Moon resort Dubai : భూమిపై 'చంద్రుడు'.. ఈ రిసార్ట్​ కోసం 5బిలియన్​ డాలర్ల ఖర్చు!-dubai to build new 5 billion dollar moon resort ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Dubai To Build New 5 Billion Dollar Moon Resort

Moon resort Dubai : భూమిపై 'చంద్రుడు'.. ఈ రిసార్ట్​ కోసం 5బిలియన్​ డాలర్ల ఖర్చు!

Sharath Chitturi HT Telugu
Sep 11, 2022 08:40 PM IST

Moon shaped resort Dubai : 'మూన్​' రిసార్ట్​ని నిర్మిస్తోంది దుబాయ్​. దీని ఖర్చు 5 బిలియన్​ డాలర్లు అని తెలుస్తోంది.

భూమిపై 'చంద్రుడు'.. ఈ రిసార్టు కోసం 5బిలియన్​ డాలర్ల ఖర్చు!
భూమిపై 'చంద్రుడు'.. ఈ రిసార్టు కోసం 5బిలియన్​ డాలర్ల ఖర్చు! (RapTV Twitter)

Moon resort Dubai : ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో.. యూఏఈ టూరిజం రెవెన్యూ 5 బిలియన్​ డాలర్లు దాటింది. ఇక ఖతార్​లో ఫుట్​బాల్​ వరల్డ్​ కప్​ జరగనున్న నేపథ్యంలో యూఏఈ పర్యాటకానికి రికార్డుస్థాయిలో ఆదాయం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వార్తల మధ్య.. దుబాయ్​కి చెందిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. భూమిపై చంద్రుడిని నిర్మించేందుకు దుబాయ్​ సిద్ధపడుతోంది! 5 బిలియన్​ డాలర్లు ఖర్చు పెట్టి.. 'మూన్'​ రిసార్ట్​ను నిర్మిస్తోంది దుబాయ్​.

"డెస్టినేషన్​ రిసార్ట్​ తరహాలో 5 బిలియన్​ డాలర్లు ఖర్చు పెట్టి దుబాయ్​.. ఓ మూన్​ బిల్డింగ్​ని రూపొందించనుంది. కెనడాకు చెందిన ఓ ఆర్కిటెక్​ కంపెనీ దీనిని నిర్మిస్తుంది. 48 నెలల్లో ఈ మూన్​ రిసార్ట్​ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళికలు రచించారు. దీని మొత్తం ఎత్తు 735అడుగులు," అని అరేబియన్​ బిజినెస్​ తన నివేదికలో పేర్కొంది.

మూన్​ రిసార్ట్​ అందుబాటులోకి వచ్చాక హాస్పిటాలిటీ, వినోదం, టూరిజం, విద్య, టెక్నాలజీ, పర్యావరణం రంగాల్లో యూఏఈకి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ మూన్​ రిసార్ట్​లో వార్షికంగా 2.5మిలియన్​ గెస్టులు వస్తారని అంచనాలు వెలువడుతున్నాయి. భూమిపైనే అంతరిక్ష అనుభూతిని పొందే విధంగాను ఈ మూన్​ రిసార్ట్​ను తీర్చిదిద్దనున్నారు.

టూరిజం రెవెన్యూతో ఈ ఏడాది బాగానే ఆదాయాన్ని వెనకేసుకుంటోంది దుబాయ్​. తొలి ఆరు నెలల్లో 12మిలియన్​ మంది హోటళ్లల్లో బస చేశారని పేర్కొంది. ఇది గతేడాదితో పోల్చుకుంటే 42శాతం వృద్ధిచెందినట్టు అని స్పష్టం చేసింది. రానున్న శీతాకాలంలో టూరిజం రెవెన్యూ మరింత పెరుగుతుందని ఆశలు పెట్టుకుంది దుబాయ్​.

IPL_Entry_Point

సంబంధిత కథనం