తెలుగు న్యూస్  /  Telangana  /  Hyderabad Ccmb Researchers In Hunt For Early Settlers Of Ladakh

CCMB Hyderabad : మంచు మనిషి నిజంగా ఉన్నాడా? సమాధానాలు వెతికే పనిలో శాస్త్రవేత్తలు

Anand Sai HT Telugu

12 September 2022, 16:16 IST

    • Hyderabad : హిమాలయ ప్రాంతాల్లో ఎన్నో జానపద కథలు అందుబాటులో ఉన్నాయి.  మంచు మనిషి నిజంగా ఉన్నాడా? లేకుంటే సంవత్సరాలుగా చెప్పింది కల్పితమేనా? ఇక్కడ మెుదటి స్థిరనివాసులు ఎవరు? మైనస్ 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో ఎలా బతికారు? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నారు సీసీఎంబీ శాస్త్రవేత్తలు.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unplash)

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్ CCMBతో సహా భారతదేశం నుండి అనేక సంస్థల నుంచి.. పరిశోధకుల బృందం లద్దాఖ్‌లోని హిమాలయ ప్రాంతాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. చాలా మంది భారతీయులకు మిస్టరీగా మిగిలిపోయిన ప్రశ్నలకు సమాధానాలను వెతికే పనిలో పడింది. లద్దాఖ్‌లో ప్రారంభ స్థిరనివాసుల కోసం వెతకడమే కాకుండా.., లద్దాఖ్‌ మినహా భారతదేశంలో మరెక్కడా కనిపించని బాక్టీరియన్ ఒంటె లేదా డబుల్ హంప్ ఒంటెల జన్యు రూపాన్ని పరిశోధించడానికి ఈ బృందం ప్రయత్నిస్తుంది.

ట్రెండింగ్ వార్తలు

Erravalli Farmers: వరి వెదసాగు పద్ధతితో సిరులు పండిస్తున్న ఎర్రవల్లి రైతులు, వెదజల్లే పద్ధతిలో అధిక దిగుబడులు..

Jagtial Crime : జగిత్యాలలో దారుణం, కోడలి మెడ నరికి హత్య చేసిన మామ

Warangal Kidnap : వరంగల్ లో వడ్డీ వ్యాపారి దారుణం, అప్పు తీసుకున్న వ్యక్తి కిడ్నాప్-రూ.28 లక్షలకు బలవంతపు సంతకాలు

TS ICET 2024 Updates : తెలంగాణ ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు, మే 7 వరకు ఛాన్స్

నిజానికి ఎడారిలో వేడి, పొడి వాతావరణ పరిస్థితులలో వృద్ధి చెందే సాధారణ ఒంటె జాతుల వలె కాకుండా, బాక్ట్రియన్ ఒంటె జాతులు లద్దాఖ్‌ నుబ్రా లోయలో కనిపిస్తాయి. ఇది మధ్య, దక్షిణ ఆసియా నుండి వ్యాపారులు కలిసే మార్గంలోకి వస్తుంది. ఇక్కడ ఇవి ఎలా ఉన్నాయని పరిశోధనలు సాగుతున్నాయి.

బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (BHU), హిమాలయన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ అలైడ్ సైన్సెస్ (HIAAS), లేహ్ విశ్వవిద్యాలయం, CCMB నుండి దాదాపు 20 మంది పరిశోధకులు లద్దాఖ్‌లో పరిశోధనలు చేస్తున్నారు. మొక్కలు, జంతువుల స్థానిక హిమాలయ జీవవైవిధ్యాన్ని అర్థం చేసుకోవడంలో పాలుపంచుకుంటున్నారు. లద్దాఖ్‌ ప్రాంతంలో మొదట స్థిరపడిన వారి గురించి విశ్లేషించే ప్రక్రియలో కూడా బృందం ఉంది.

పరిశోధకులు.. స్థానిక చాంగ్పా గిరిజన స్థావరాల నుండి రక్త నమూనాలను సేకరించారు. ఇది తరతరాలుగా చాలా ఎత్తైన ప్రదేశాలలో నివసించడానికి అలవాటుపడిన వ్యక్తుల జన్యుపరమైన విధానాన్ని అర్థం చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. పరిశోధకులు స్థానిక నివాసాలను జియో-ట్యాగ్ చేశారు. లద్దాఖ్‌లోని స్థానిక వేడి నీటి బుగ్గ ప్రాంతాల నుండి, పాంగాంగ్ సరస్సు నుండి నీటి నమూనాలను సేకరించారు.

ఈ బృందం లద్దాఖ్‌లోని మంచు ప్రాంతంలో మొదటి స్థిరనివాసుల ఆధారాల కోసం మాత్రమే చూడట్లేదు. స్థానిక జనాభాలో జన్యుపరమైన వ్యాధులు, ఇతర సమస్యలూ డాక్యుమెంట్ చేయడంలోనూ కూడా పరిశోధనా బృందం పాల్గొంటుంది. BHU, CCMB లోని.. స్థానిక జనాభా రక్త నమూనాలను విశ్లేషించే బృందం, జన్యుశాస్త్రం పాత్రపై కూడా పరిశోధన చేస్తుంది. మైనస్ 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు, తక్కువ ఆక్సిజన్‌లో జీవించగలిగే స్థానిక తెగల సామర్థ్యాన్ని కూడా అన్వేషిస్తుంది.