Telugu News  /  Telangana  /  Irctc Tourism Announced Ladakh Tour From Hyderabad Full Details Here
హైదరాబాద్ టూ లద్దాఖ్ టూర్.
హైదరాబాద్ టూ లద్దాఖ్ టూర్. (IRCTC)

IRCTC Tour: హైదరాబాద్ టూ లద్దాఖ్ .. 7 రోజుల టూర్ లో ఎన్నో అందాలను…

15 June 2022, 11:32 ISTHT Telugu Desk
15 June 2022, 11:32 IST

హైదరాబాద్ నుంచి లద్ధాఖ్ కి టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఫ్లైట్‌ జర్నీ చేసేందుకు ప్రయాణికులకు అవకాశం కల్పించింది. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.

Hyd - Ladakh Tour: వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా హైదరాబాద్ నుంచి లద్దాఖ్ టూర్ ప్యాకేజీ ప్రకటించింది. చల్లని హిమాలయ శిఖరాల మధ్య ఉన్న పీఠభూమి అయిన లద్దాఖ్ అందాలను చూసేందుకు పర్యాటకుల కోసం చక్కని ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

టూర్ ఎప్పుడంటే...

జూన్ 16, జూలై 7 తేదీల్లో ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభం అవుతుంది. మొత్తం 6 రాత్రులు, 7 రోజుల టూర్ ప్యాకేజీ. ఈ టూర్ లో భాగంగా లేహ్, లద్దాఖ్, షామ్ వ్యాలీ, నుబ్రా, టుర్టుక్, పాంగాంగ్ ప్రాంతాలు కవర్ అవుతాయి. మొదటి రోజు ఉదయం హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుంది. 7.05 గంటలకు హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఫ్లైట్ ఎక్కితే మధ్యాహ్నం 1 గంటకు లేహ్ ఎయిర్‌పోర్టులో దిగుతారు. రాత్రికి లేహ్‌లోనే బస చేయాల్సి ఉంటుంది.

ఇక 2వ రోజు ఉధయం లేహ్ నుంచి షామ్ వ్యాలీకి బయల్దేరుతారు. శ్రీనగర్ హైవేలో సైట్ సీయింగ్ ఉంటుంది. హాల్ ఆఫ్ ఫేమ్, కాలీ మందిర్, గురుద్వార, శాంతి స్థూపం, లేహ్ ప్యాలెస్ వీక్షిస్తారు. మూడో రోజు లేహ్ నుంచి నుబ్రా బయల్దేరాలి. దారిలో ఖార్‌దుంగ్లా పాస్ సందర్శిస్తారు. మధ్యాహ్నం భోజనం తర్వాత దిక్షిత్, హండర్ విలేజెస్ చూస్తారు. రాత్రికి నుబ్రా వ్యాలీలో బస చేయాలి. నాలుగో రోజు టుర్టుక్ బయల్దేరాలి. ఇక్కడ ఉన్న టుర్టుక్ వ్యాలీని వీక్షించవచ్చు. రాత్రికి నుబ్రా వ్యాలీలో బస చేయాలి. ఐదో రోజు నుబ్రా వ్యాలీ నుంచి పాంగాంగ్ బయల్దేరాలి. పాంగాంగ్ లేక్ సందర్శించవచ్చు. ఇక ఆరో రోజు ఉదయం పాంగాంగ్ సరస్సు దగ్గర సూర్యోదయాన్ని వీక్షించవచ్చు. ఆ తర్వాత లేహ్ బయల్దేరాలి. దారిలో థిక్సే మొనాస్టరీ, షే ప్యాలెస్ చూస్తారు. లేహ్‌కు చేరుకున్న తర్వాత షాపింగ్ చేయడానికి సమయం ఉంటుంది. రాత్రికి లేహ్‌లో బస చేయాలి. ఏడో రోజు మధ్యాహ్నం 1.40 గంటలకు లేహ్‌లో బయల్దేరితే రాత్రి 8.10 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

<p>టూర్ ప్యాకేజీ వివరాలు</p>
టూర్ ప్యాకేజీ వివరాలు

ధరలివే....

లేహ్ లద్దాఖ్ టూర్ ప్యాకేజీ ధర చూస్తే ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.38,470, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.39,080, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.44,025 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, హోటల్‌లో బస, నాన్ ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, లేహ్‌లో సంప్రదాయ స్వాగతం, ఒక కల్చరల్ షో, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.

 

నోట్ :

లింక్ పై క్లిక్ చేసి అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి మీ టూర్ ప్యాకేజీ వివరాలను పూర్తిగా తెలుసుకోవచ్చు.

 

టాపిక్