తల్లి డిప్రెషన్ కూతురికి… పరిశోధనలో షాకింగ్ నిజాలు!
తాజాగా ఆందోళనపై కెనడా పరిశోధకులు నిర్వహించిన సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ఈ అద్యయనంలో తల్లులకు డిప్రెషన్ ఉంటే అది వారి కూతుళ్లలో కూడా కనిపిస్తున్నట్లు తెలింది
మారుతున్న జీవన ప్రమాణాలు, పెరిగిన పోటీ, జీవనశైలి, ఆరోగ్యం కారణంగా చాలా మంది శారీరక, మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. రోజు రోజుకు ప్రజలలో ఆందోళన, డిప్రెషన్ రేట్లు పెరుగుతున్నాయి. ఇటీవల, కెనడాలోని పరిశోధకులు డిప్రెషన్ కారణాలపై అధ్యయనం నిర్వహించారు. ముఖ్యంగా విశ్రాంతి లేకపోవడం, జన్యుపరమైన లింక్ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ పరిశోధన జరిపారు.
ట్రెండింగ్ వార్తలు
ఈ అధ్యయనం ప్రకారం, యువతుల్లో తమ తల్లుల నుండి ఆందోళన వారసత్వంగా వస్తున్నట్లు వివరించారు. మరోవైపు, పిల్లలలో ఈ రుగ్మతకు తండ్రులు పాత్ర చాలా తక్కువని తెలిపారు. తల్లుల నుండి వచ్చే ఈ రుగ్మత కారణంగా చాలా మంది బాలికలకు ఇబ్బంది పడుతున్నట్లు పరిశోధన వెల్లడించింది.. కెనడాలోని డల్‌హౌసీ యూనివర్శిటీలోని సైకియాట్రీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పావ్లోవా ప్రకారం, తల్లిదండ్రులిద్దరికీ డిప్రెషన్ ఉంటే, ఈ రుగ్మత పిల్లలకు సంక్రమించే అవకాశం ఉందని ఈ పరిశోధన అధ్యయనంలో తెలిపట్లు వివరించారు. తల్లుల నుండి జన్యు పరంగా డిప్రెషన్ అమ్మాయిలలో ఉండడం ఆందోళన కలిగించే అంశంగా పేర్కొన్నారు. అధ్యయనంలో ఈ రుగ్మతతో బాధపడుతున్న వారు సంఖ్య పెరుగుతున్నట్లు తెలిపారు.
అదే సమయంలో, తండ్రులకు డిప్రెషన్ ఉన్న అది పిల్లలపై పెద్దగా ప్రభావం చూపదని వివరించారు. ఈ పరిశోధన అధ్యయనంలో పురుషులు, మహిళలు ఇద్దరిపై పరిశోధన జరిపారు, అలాగే డిప్రెషన్ సంబంధించి జరిపిన మరో అధ్యయనంలో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నప్పుడు, పిల్లలు ఎక్కువగా ఆందోళన చెందుతారని తేలింది. ఈ అధ్యయనం ప్రకారం పిల్లలు తమ తల్లిదండ్రుల ప్రవర్తన లేదా అలవాట్లను అనుకరిస్తారని వెల్లడైంది. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఆందోళనగా ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తారో, పిల్లలు కూడా అలాగే ప్రవర్తించడం మొదలుపెట్టి, అది వారికి అలవాటుగా మారుతుందన్నారు.
సంబంధిత కథనం