IRCTC Ladakh tour package : హైదరాబాద్ టు లద్దాఖ్.. ది బెస్ట్ ప్యాకేజీ..!
IRCTC Ladakh tour package : లద్దాఖ్‌కు కొత్త ప్యాకేజీలు తీసుకొచ్చింది ఐఆర్సీటీసీ. ఆ ప్యాకేజీల వివరాలు..
IRCTC Ladakh tour package : 'లద్దాఖ్ రోడ్ ట్రిప్'.. ఇది ఎంతో మంది కల! జీవితంలో ఒక్కసారైనా లద్దాఖ్‌కు వెళ్లి.. అక్కడ బైక్ మీద చక్కర్లు కొట్టాలని చాలా మందికి డ్రీమ్స్ ఉంటాయి. వారిలో మీరూ ఒకరా? లద్దాఖ్ ట్రిప్‌నకు వెళ్లాలని ఉన్నా.. ఖర్చులు చూసి భయపడుతున్నారా? అయితే.. మీకోసమే ఐఆర్సీటీసీ టూరిజం ప్యాకేజీలు తీసుకొచ్చింది. ఆ వివరాలు..
1. హైదరాబాద్ టు లేహ్- లద్దాఖ్..
ఐఆర్సీటీసీ టూరిజం ప్యాకేజీలో భాగంగా.. హైదరాబాద్ టు లద్దాఖ్, లేహ్ ప్రాంతాలకు వెళ్లొచ్చు. ఈ ప్యాకేజీలో 6 రాత్రులు/ 7 రోజులు ఉంటాయి. శామ్ వాలీ, లేహ్, నుబ్రా, టుర్టుక్, పాంగ్యాంగ్ ప్రాంతాలు ఈ ట్రిప్‌లో కవర్ చేయవచ్చు. ఆగస్టు 25న ఒక ట్రిప్ ముగిసింది. సెప్టెంబర్ 8, 23న మరో రెండో ట్రిప్‌లు ప్రారంభంకానున్నాయి. ఈ ఐఆర్సీటీసీ టూరిజం ప్యాకేజీ ధర రూ. 41,360.
2. ఢిల్లీ టు లద్దాఖ్..
ఈ ఐఆర్సీటీసీ లద్దాఖ్ టూరిజం ప్యాకేజీలో 6 రాత్రులు/ 7 రోజులు ఉంటాయి. ఢిల్లీ నుంచి ఈ ట్రిప్ మొదలవుతుంది. సెప్టెంబర్ 3, 5, 10, 12, 17, 19, 29 తేదీల్లో ట్రిప్‌లు ఉంటాయి. ఈ ట్రిప్ ప్యాకేజీ ధర రూ. 32,960. 3 స్టార్ హోటల్స్, ఫుడ్ వంటివి ప్యాకేజీ ధరలోనే కలిసి ఉంటాయి.
IRCTC Ladakh tour package details : లేహ్, శామ్ వాలీ, నుబ్రా, పాంగ్యాంగ్, టుర్టుక్ ప్రాంతాలు కవర్ చేయవచ్చు.
3. కోల్‌కతా టు లేహ్- లద్దాఖ్..
ఈ ఐఆర్సీటీసీ టూరిజం ప్యాకేజీ.. కోల్‌కతా నుంచి మొదలవుతుంది. ముందుగా.. కోల్‌కతా నుంచి ఢిల్లీకి విమానంలో వెళతారు. ఈ ప్యాకేజీ ధర రూ. 41,500. సెప్టెంబర్ 11, 17, 23 తేదీల్లో ట్రిప్ ప్రారంభమవుతుంది. లేహ్, నుబ్రా, టుర్టుక్, పాంగ్యాంగ్ ప్రాంతాలను సందర్శించవచ్చు.
4. లక్నో టు లద్దాఖ్..
IRCTC tour packages : ఈ ఐఆర్సీటీసీ టూరిజం ప్యాకేజీ సెప్టెంబర్ 7, 14, 21, 28న ఉంటుంది. 7రాత్రులు/8 రోజుల ట్రిప్ ఇంది. లక్నో నుంచి మొదలవుతుంది. లాడ్జింగ్, రోజుకు మూడు పుటలా భోజనం, బస్సు- విమాన ఛార్జీలు, సైట్‌సీయింగ్ ఖర్చులు ఈ ధరలో భాగం. శామ్ వాలీ, లేహ్, నుబ్రా, టుర్టుక్, పాంగ్యాంగ్ ప్రాంతాలను కవర్ చేయవచ్చు. ఈ ప్యాకేజీ ధర రూ. 43,900.
పూర్తి వివరాల కోసం.. www.irctctourism.com వెబ్‌సైట్‌ను చూడండి.
ఐఆర్సీటీసీ షిరిడీ టూర్ ప్యాకేజీ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
హైదరాబాద్ టు ఉజ్జెయిన్ టూర్ ప్యాకేజీ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం