తెలుగు న్యూస్  /  Sports  /  Uthappa On Dhoni Share One Unheard Story Of Him Injuring Bowler Sridharan Sriram

Uthappa on Dhoni: ధోనీ కొట్టిన షాట్‌కు రెండు వేళ్లు విరిగాయి: ఉతప్ప

Hari Prasad S HT Telugu

31 March 2023, 10:02 IST

  • Uthappa on Dhoni: ధోనీ కొట్టిన షాట్‌కు రెండు వేళ్లు విరిగాయి అంటూ రాబిన్ ఉతప్ప ఇప్పటి వరకూ ఎవరికీ తెలియని ఓ స్టోరీ చెప్పాడు. ఐపీఎల్ 2023 ప్రారంభానికి ముందు జియో సినిమాలో మాట్లాడిన ఉతప్ప.. ధోనీని ఆకాశానికెత్తాడు.

ఎమ్మెస్ ధోనీ
ఎమ్మెస్ ధోనీ

ఎమ్మెస్ ధోనీ

Uthappa on Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ గురించి ఎంత చెప్పినా.. ఇప్పటికీ ఏదో ఒక బయటకు రాని స్టోరీ ఉంటూనే ఉంటుంది. అలాంటి ఓ విషయాన్నే తాజాగా ధోనీ సీఎస్కే టీమ్ మాజీ ప్లేయర్ రాబిన్ ఉతప్ప వెల్లడించాడు. ఐపీఎల్ 2023 ప్రారంభానికి ముందు జియో సినిమాలో మాట్లాడిన ఉతప్ప.. తాను తొలిసారి ధోనీని కలిసినప్పుడు జరిగిన సంఘటనను వివరించాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

"నేను తొలిసారి ధోనీని 2003లో బెంగళూరులోని ఎన్సీఏలో జరిగిన ఇండియా ఎ క్యాంప్ లో చూశాను. చిన్నస్వామి స్టేడియంలో ధోనీ ఆడుతున్నాడు. అప్పట్లో చాలా వేగంగా బౌలింగ్ చేస్తాడన్న పేరున్న మునాఫ్ పటేల్ బౌలింగ్ చేస్తున్నాడు.

ధోనీ భారీ సిక్స్ లు కొడుతున్నాడు. హెలికాప్టర్ షాట్ కూడా ఆడాడు. కొన్ని బాల్స్ అయితే స్టేడియం బయట పడ్డాయి. నిజానిక అతడు శ్రీధరన్ శ్రీరామ్ ను తీవ్రంగా గాయపరిచాడు. అతడు బౌలింగ్ చేస్తున్న సమయంలో నేరుగా బౌలర్ వైపే బలంగా కొట్టాడు.

ఆ బంతిని శ్రీరామ్ అడ్డుకోబోయాడు. అది బలంగా తగలడంతో అతడు వెంటనే పెవిలియన్ వైపు పరుగెత్తాడు. మేము అతడు బంతి కోసం వెళ్తున్నాడని అనుకున్నాం. కానీ శ్రీరామ్ డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లి చూస్తే రెండు వేళ్లు విరిగిపోయాయి. అప్పుడు తెలిసింది ధోనీ ఎంత బలంగా బంతిని బాదుతాడో అని. అప్పుడే అతడు ఇండియాకు ఆడతాడని అనుకున్నాను" అని ఉతప్ప చెప్పాడు.

ధోనీ, ఉతప్ప కలిసి ఇండియా, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు ఆడారు. 2007లో ఇండియా టీ20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు కూడా ధోనీ కెప్టెన్ కాగా.. ఉతప్ప టీమ్ లో ఉన్నాడు. క్రికెట్ ఆడే తొలినాళ్లలో ధోనీ చాలా క్లోజ్ ఫ్రెండ్ అయ్యాడని కూడా ఉతప్ప ఈ సందర్భంగా చెప్పాడు. 2004 సమయంలో తాము స్నేహితులం అయ్యామని, తాను అండర్ 19 ఆడుతున్న రోజుల్లోనే ధోనీ ఇండియా ఎ జట్టుకు ఆడినట్లు తెలిపాడు.

"మా ఇద్దరికీ కొత్త బట్టలు అంటే పిచ్చి. చాలా షాపింగ్ చేసేవాళ్లం. రెస్టారెంట్లకు కూడా బాగానే వెళ్లేవాళ్లం. మాదో గ్రూపు ఉండేది. రైనా, ఇర్ఫాన్ పఠాన్, ఆర్పీ సింగ్, పియూష్ చావ్లా, మునాఫ్ పటేల్, ధోనీ, నేను. మేము ప్రతిరోజూ దాల్ మఖనీ, బటర్ చికెన్, జీరా ఆలూ, రోటీ ఆర్డర్ చేసేవాళ్లం.

ఫుడ్ విషయంలో ధోనీ విచిత్రంగా ఉండేవాడు. బటర్ చికెన్ లో చికెన్ తీసేసి గ్రేవీతోనే తినేవాడు. ఒకవేళ చికెన్ తింటే రోటీ తినేవాడు కాదు. ఇప్పటికీ మారలేదు. తొలిసారి చూసినప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. అతడు చాలా సింపుల్" అని ఉతప్ప చెప్పుకొచ్చాడు.