తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Wrestlemania Xl: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Hari Prasad S HT Telugu

08 April 2024, 9:36 IST

google News
    • WrestleMania XL: రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్ లో చివరికి డబ్ల్యూడబ్ల్యూఈ కొత్త ఛాంపియన్ గా నిలిచాడు కోడీ రోడ్స్. అతడు రోమన్ రీన్స్ ను ఓడించి టైటిల్ గెలుచుకున్నాడు.
రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం
రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

WrestleMania XL: వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్మెంట్ (WWE) కొత్త ఛాంపియన్ గా కోడీ రోడ్స్ అవతరించాడు. 1316 రోజులుగా ఈ టైటిల్ నిలబెట్టుకుంటూ వస్తున్న రోమన్ రీన్స్ కథ ముగిసింది. ఆదివారం (ఏప్రిల్ 7) రాత్రి జరిగిన రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ (WrestleMania XL) నైట్ 2లో రీన్స్ ను ఓడించి తొలిసారి ఛాంపియన్ అయ్యాడు కోడీ రోడ్స్. రెజ్లింగ్ ఛాంపియన్స్ ది రాక్, జాన్ సీనా, అండర్‌టేకర్ లాంటి వాళ్లు కూడా ఈ బౌట్ మధ్యలో వచ్చి తమ వాళ్లకు మద్దతుగా ఫైట్ చేయడం విశేషం.

కొత్త ఛాంపియన్ కోడీ రోడ్స్

కోడీ రోడ్స్ నిజానికి గతేడాదే టైటిల్ కు చేరువగా వచ్చాడు. ఈసారి మాత్రం అతడు టైటిల్ వదల్లేదు. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్ 1లో ట్యాగ్ టీమ్ మెయిన్ ఈవెంట్లో ది రాక్ చేతుల్లో రోడ్స్ ఓడిపోయాడు. దీంతో అతడు టైటిల్ కోసం బ్లడ్‌లైన్స్ రూల్స్ కింద రోమన్ రీన్స్ తో పోటీ పడాల్సి వచ్చింది. ఈ ఇద్దరు స్టార్ రెజ్లర్లు టైటిల్ కోసం తీవ్రంగా పోరాడారు.

రింగ్ బయట కూడా ఎరెనా మొత్తం తిరుగుతూ ఒకరినొకరు చితక బాదుకున్నారు. చేతులతోనే కాకుండా వివిధ వెపన్స్ ఉపయోగించే అవకాశం కూడా ఉండటంతో ఈ ఫైనల్ ఫైట్ రక్తి కట్టింది. అయితే మధ్య మధ్యలో తమ వారిని గెలిపించుకోవడానికి స్టార్ రెజ్లర్లు రింగులోకి దూసుకు రావడంతో ఒక దశలో గందరగోళం నెలకొంది. మొదట కోడీ రోడ్స్ కు మద్దతుగా జిమ్మీ ఉసో వచ్చాడు.

అండర్‌టేకర్ vs ది రాక్

అయితే వెంటనే అతని సోదరుడు జే ఉసో వచ్చి అతన్ని బయటకు తీసుకెళ్లాడు. కోడీ రోడ్స్ గెలిచే సమయంలో సోలో సికోవా వచ్చి అతన్ని సమోవన్ స్పైక్ తో కొట్టాడు. ఆ సమయంలోనే జాన్ సీనా తన ఫ్రెండ్ కోడీ రోడ్స్ ను రక్షించడానికి పరుగెత్తుకొచ్చాడు. అతడు సోలోపై దాడి చేశాడు. అది చూసి రోమన్ రీన్స్ సపోర్టర్ ది రాక్ కూడా దూసుకొచ్చాడు.

జాన్ సీనా తన రాక్ బాటమ్ తో కుప్పకూల్చాడు. ఈ సమయంలో అతనిపై సేత్ రోలిన్స్ వెనుక నుంచి కుర్చీపై దాడి చేయడానికి ప్రయత్నించగా.. రోమన్ రీన్స్ అడ్డుకున్నాడు. ఇక చివరికి అండర్‌టేకర్ తనదైన స్టైల్లో వచ్చి రాక్ ను మట్టి కరిపించాడు. చివరికి వాళ్లంతా రింగు నుంచి వెళ్లిపోవడంతో మరోసారి కోడీ రోడ్స్, రోమన్ రీన్స్ టైటిల్ ఫైట్ కొనసాగించారు.

చివరికి రోమన్ రీన్స్ ను ఓడించి కోడీ రోడ్స్ టైటిల్ ఎగరేసుకుపోయాడు. ఇక ఈ రెజిల్‌మేనియా ఎక్స్ నైట్ 2 మొదట డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ బౌట్ తో మొదలైంది. సేత్ రోలిన్స్ ను ఓడించి డ్రూ మెకింటైర్ టైటిల్ గెలిచాడు. రెజిల్‌మేనియా నైట్ 2 మొత్తం చాలా ఇంట్రెస్టింగ్ ఫైట్స్ తో సాగిపోయింది. చివరికి ఓ కొత్త ఛాంపియన్ టైటిల్ గెలవడంతో ముగిసింది. డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ గా నాలుగేళ్లుగా కొనసాగుతున్న రోమన్ రీన్స్ శకం ముగిసింది.

టాపిక్

తదుపరి వ్యాసం