Oscars 2024 John Cena: ఆస్కార్స్ స్టేజ్‌పై స్టార్ రెజ్లర్ న్యూడ్ షో.. షాక్‌లో అభిమానులు.. వీడియో వైరల్-oscars 2024 john cena nude show on stage shocks fans academy awards 2024 john cena ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Oscars 2024 John Cena: ఆస్కార్స్ స్టేజ్‌పై స్టార్ రెజ్లర్ న్యూడ్ షో.. షాక్‌లో అభిమానులు.. వీడియో వైరల్

Oscars 2024 John Cena: ఆస్కార్స్ స్టేజ్‌పై స్టార్ రెజ్లర్ న్యూడ్ షో.. షాక్‌లో అభిమానులు.. వీడియో వైరల్

Hari Prasad S HT Telugu
Mar 11, 2024 07:34 AM IST

Oscars 2024 John Cena: ఆస్కార్స్ స్టేజ్‌పైకి స్టార్ రెజ్లర్ జాన్ సీనా న్యూడ్ గా రావడం అభిమానులను షాక్ కు గురి చేసింది. బెస్ట్ కాస్ట్యూమ్ అవార్డు ఇవ్వడానికి వచ్చిన అతడు.. ఒంటిపై అసలు ఎలాంటి డ్రెస్ లేకుండా వచ్చాడు.

ఆస్కార్స్ స్టేజ్‌పై స్టార్ రెజ్లర్ జాన్ సీనా న్యూడ్ షో.. షాక్‌లో అభిమానులు
ఆస్కార్స్ స్టేజ్‌పై స్టార్ రెజ్లర్ జాన్ సీనా న్యూడ్ షో.. షాక్‌లో అభిమానులు

Oscars 2024 John Cena: ఆస్కార్స్ లేదా అకాడెమీ అవార్డ్స్.. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ సినీ అవార్డుల ఉత్సవాన్ని ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా చూస్తుంది. అయితే అలాంటి ఆస్కార్స్ వేదికపై ఎప్పుడూ ఏదో ఒక వివాదం జరగుతూనే ఉంటుంది. ఈసారి కూడా అలాంటిదే ఒకటి అభిమానులను షాక్ గురి చేసింది. స్టార్ రెజ్లర్ జాన్ సీనా న్యూడ్ గా స్టేజ్ పైకి వచ్చిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

జాన్ సీనా న్యూడ్‌గా..

ఆస్కార్స్ వేడుకలో ఈసారి బెస్ట్ కాస్ట్యూమ్ అవార్డును ఇచ్చే అవకాశం డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ జాన్ సీనాకు దక్కింది. ఈ అవార్డును ప్రజెంట్ చేయడానికి అతని పేరు అనౌన్స్ చేశారు. ఆ తర్వాత జరిగిన ఘటన చూసి అందరూ షాక్ తిన్నారు. ఆ తర్వాత కోలుకొని స్టేజ్ కింద ఉన్న వాళ్లు తెగ నవ్వుకున్నారు. దీనికి కారణం జాన్ సీనా అసలు ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా రావడం.

తన ప్రైవేట్ పార్ట్ కనిపించకుండా మాత్రం అడ్డుగా విన్నర్ పేరు ఉన్న కార్డు పెట్టుకొని వచ్చాడు. సినిమాల్లో కాస్టూమ్ డిజైనర్ ఎంత అవసరమో తెలిసింది అనే తన కామెంట్ తో జాన్ సీనా మరోసారి అందరినీ నవ్వించాడు. ఆ తర్వాత మరో వ్యక్త వచ్చి ఈ అవార్డు నామినీల జాబితాను అనౌన్స్ చేశాడు. ఈ అవార్డు కోసం బార్బీ, కిల్లర్స్ ఆఫ్ ఫ్లవర్ మూన్, నెపోలియన్, ఓపెన్‌హైమర్, పూర్ థింగ్స్ నిలిచాయి.

స్టేజ్‌పైనే డ్రెస్ వేసుకుంటూ..

నామినీల వీడియోను బిగ్ స్క్రీన్ పై ప్లే చేస్తుండగానే జాన్ సీనా స్టేజ్ పైనే డ్రెస్ వేసుకోవడం విశేషం. బెస్ట్ కాస్ట్యూమ్ అవార్డుల నామినీల వీడియోలు ప్లే చేసే సమయంలో స్టేజ్ పై లైట్లన్నీ ఆర్పేశారు. ఆ సమయంలో నలుగురైదుగురు వ్యక్తులు వేగంగా వచ్చి జాన్ సీనాకు ఓ డ్రెస్ వేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత అతడు విజేతను అనౌన్స్ చేశాడు.

ఈ బెస్ట్ కాస్ట్యూమ్ అవార్డు పూర్ థింగ్స్ సినిమాకు వెళ్లింది. అయితే కోట్లాది మంది చూసే వేడుక స్టేజ్ పైకి ఓ స్టార్ రెజ్లర్ ఇలా న్యూడ్ గా రావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాన్ సీనా అభిమానులు కూడా షాక్ లో ఉన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఇదేంటి.. అతడు ఇలా చేశాడంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.

"నా ఫాలోవర్లలో ఒకరు (జాన్ సీనా) ఆస్కార్స్ స్టేజ్ పైకి న్యూడ్ గా రావడం నన్ను తీవ్ర ఇబ్బందికి గురి చేస్తోంది" అనే క్యాప్షన్ తో గ్రెగ్ అనే వ్యక్తి ఈ వీడియోను షేర్ చేశాడు. 96వ అకాడెమీ అవార్డుల వేడుక అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం లాస్ ఏంజిల్స్ లో ఆదివారం (మార్చి 10) రాత్రి ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ఈసారి ఇండియాకు నిరాశే ఎదురైంది. బెస్ట్ డాక్యుమెంటరీ కేటగిరీలో నామినేట్ అయిన టు కిల్ ఎ టైగర్ కు కూడా అవార్డు దక్కలేదు.

IPL_Entry_Point