Record Break Movie: డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్‌గా జ‌య‌సుధ కొడుకు - ఎనిమిది భాష‌ల్లో రికార్డ్ బ్రేక్ రిలీజ్‌-jayasudha son nihar kapoor record break movie releasing in 8 languages ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Record Break Movie: డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్‌గా జ‌య‌సుధ కొడుకు - ఎనిమిది భాష‌ల్లో రికార్డ్ బ్రేక్ రిలీజ్‌

Record Break Movie: డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్‌గా జ‌య‌సుధ కొడుకు - ఎనిమిది భాష‌ల్లో రికార్డ్ బ్రేక్ రిలీజ్‌

Nelki Naresh Kumar HT Telugu
Mar 06, 2024 11:45 AM IST

Record Break Movie: జ‌య‌సుధ త‌న‌యుడు నిహార్ క‌పూర్ హీరోగా న‌టిస్తోన్న రికార్డ్ బ్రేక్ మూవీ మార్చి 8న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ ఎనిమిది భాష‌ల్లో రిలీజ్ అవుతోంది.

నిహార్ క‌పూర్
నిహార్ క‌పూర్

Record Break Movie: సీనియ‌ర్ న‌టి జ‌య‌సుధ త‌న‌యుడు నిహార్‌ క‌పూర్ హీరోగా రీఎంట్రీ ఇస్తోన్నాడు. రికార్డ్ బ్రేక్ పేరుతో ఓ సినిమా చేస్తోన్నాడు. బిచ్చ‌గాడు ఫేమ్‌ చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ మార్చి 8న థియేట‌ర్ల‌లో ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఎనిమిది భాష‌ల్లో రికార్డ్ బ్రేక్ మూవీ రిలీజ్ అవుతోంది. రికార్డ్ బ్రేక్ గురించి నిహార్ క‌పూర్ మాట్లాడుతూ... గ్యాంగ్ స్టర్ గంగరాజు సినిమాలో న‌టిస్తోన్న‌ప్పుడు చదలవాడ శ్రీనివాసరావు రికార్డ్ బ్రేక్ క‌థ చెప్పారు. హీరో పాత్ర‌కు నువ్వు యాప్ట్ అవుతావ‌ని అన్నారు.. కథ వినగానే చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. హీరో అని కాకుండా క్యారెక్య‌రైజేష‌న్ న‌మ్మి ఈ సినిమాను అంగీక‌రించాన‌ని నిహార్ క‌పూర్అన్నాడు.

అనాథ‌ల క‌థ‌...

అడ‌విలో పెరిగిన ఇద్ద‌రు అనాథ‌ల క‌థ‌తో రికార్డ్ బ్రేక్ మూవీ తెర‌కెక్కుతోంది. ఆ ట్విన్స్ ప్ర‌యాణం అడవి నుంచి డబ్ల్యూ డబ్ల్యూ ఈ దాకా ఎలా వెళ్లింది అన్న‌దే ఈ సినిమా క‌థ‌. రికార్డ్ బ్రేక్‌లో యాక్ష‌న్ అంశాల‌తో పాటు అంత‌ర్లీనంగా మ‌ద‌ర్ సెంటిమెంట్ ఉంటుంది.

దంగ‌ల్‌తో పోలిక ఉండ‌దు...

కుస్తీ పోటీలు అన‌గానే చాలా మందికి ఆమిర్‌ఖాన్ దంగ‌ల్ గుర్తొస్తుంది. దంగల్ తో రికార్డ్ బ్రేక్‌కు ఎలాంటి కంపారిజన్ ఉండదు. అందులో కుస్తీ పోటీలు డిటైలింగ్‌గా చూపించారు. ఇందులో కుస్తీ పోటీల గురించి చెబుతూ ఇద్దరు అనాధల జర్నీ ఇంటర్నేషనల్ లెవెల్ దాకా ఎలా వెళ్ళింది అన్న‌దే మెయిన్ పాయింట్‌. సెంటిమెంట్, ఎమోష‌న్స్‌ కలగలిపిన ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ సినిమాగా రికార్డ్ బ్రేక్ ఉంటుంది.

8 భాష‌ల్లో రిలీజ్‌...

కుస్తీ పోటీల బ్యాక్‌డ్రాప్‌లో బాలీవుడ్‌లో ఎక్కువ సినిమాలు వ‌చ్చాయి. ఈ బ్యాక్‌డ్రాప్‌లో తెలుగులో వ‌చ్చిన అతి త‌క్కువ సినిమాల్లో మాది ఒక‌టి. తెలుగు సినిమా అయినా ప్రతి భారతీయుడు చూసి గర్వించదగ్గ సినిమా. ఇలాంటి సినిమా తెలుగుతోనే ఆగిపోకూడదు. అందుకే ఎనిమిది భాషల్లో వరల్డ్ వైడ్ గా సినిమా రిలీజ్ చేస్తున్నాం.

క‌న్న‌డ‌, మ‌ల‌యాళంలో ప్ర‌మోష‌న్స్‌...

రీసెంట్ గా కన్నడ చెన్నై వెళ్లి అక్కడ రికార్డ్ బ్రేక్ సినిమాను ప్రమోట్ చేశాం. కన్నడలో రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. ముంబైలో కూడా ఇలాంటి కథలు ఎక్కువగా చూస్తారు అక్కడ కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇంకా మలయాళం ఒడియాలో కూడా నెక్స్ట్ ప్రమోట్ చేస్తున్నాము. సామాజికాంశాల‌ను మేళ‌వించి ఒక మంచి కాన్సెప్ట్ తో డైరెక్ట‌ర్ చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు ఈ మూవీని తెర‌కెక్కించారు. ఇది పూర్తిగా దేశభక్తి సినిమా. సినిమాలోని ప్ర‌తి యాక్ష‌న్ ఎపిసోడ్ కొత్త‌గా ఉంటుంది.

అమ్మ‌కు ట్రైల‌ర్ నచ్చింది….

రికార్డ్ బ్రేక్ ట్రైల‌ర్ అమ్మ‌కు చాలా న‌చ్చంది. ఈ సినిమాను అంగీక‌రించే టైమ్‌లో అమ్మ జ‌య‌సుధ బిజీగా ఉన్నారు. అందుకే కథ నేనే విని ఒకే చేశా.ఆ ఆ త‌ర్వాత‌ యూనిక్ కాన్సెప్ట్ ఎంచుకున్నావ్ అని చెప్పి చాలా మెచ్చుకున్నారు.

డైరెక్ట‌ర్‌గా...

ఫిలిమేకింగ్ కోర్సు చేశాడు. భ‌విష్య‌త్తులో త‌ప్ప‌కుండా డైరెక్షన్ చేస్తాను . ఓటీటీతో పాటు సిల్వ‌ర్ స్క్రీన్ ను దృష్టిలో పెట్టుకొని కొన్ని క‌థ‌లు రాసుకున్నాను. టైమ్ దొరికితే త‌ప్ప‌కుండా డైరెక్ట‌ర్‌గా సినిమా చేస్తాడు.రికార్డ్ బ్రేక్‌తో పాటు ఎన్టీఆర్ దేవ‌ర‌లో నిహార్ క‌పూర్ ఓ కీల‌క పాత్ర చేస్తున్నాడు.