Poor Things OTT Release Date: రెండు ఓటీటీల్లోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హిట్ కామెడీ మూవీ.. ఎక్కడ చూడాలంటే?-poor things ott release date prime video to stream the movie from february 27th ott hollywood news in telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Poor Things Ott Release Date: రెండు ఓటీటీల్లోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హిట్ కామెడీ మూవీ.. ఎక్కడ చూడాలంటే?

Poor Things OTT Release Date: రెండు ఓటీటీల్లోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హిట్ కామెడీ మూవీ.. ఎక్కడ చూడాలంటే?

Hari Prasad S HT Telugu
Feb 21, 2024 09:31 AM IST

Poor Things OTT Release Date: హాలీవుడ్ సూపర్ హిట్ కామెడీ మూవీ పూర్ థింగ్స్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఫిబ్రవరి 27 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

రెండు ఓటీటీల్లోకి వస్తున్న హాలీవుడ్ సూపర్ హిట్ కామెడీ మూవీ పూర్ థింగ్స్ లో ఎమ్మా స్టోన్
రెండు ఓటీటీల్లోకి వస్తున్న హాలీవుడ్ సూపర్ హిట్ కామెడీ మూవీ పూర్ థింగ్స్ లో ఎమ్మా స్టోన్

Poor Things OTT Release Date: హాలీవుడ్ లో గతేడాది రిలీజై సంచలన విజయం సాధించి పెట్టిన సినిమా పూర్ థింగ్స్ (Poor Things). ఎమ్మా స్టోన్ నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ సక్సెసే కాదు.. అవార్డుల విషయంలోనూ దుమ్ము రేపుతూ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. పూర్ థింగ్స్ మూవీ ఫిబ్రవరి 27 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ ప్లస్ లలో స్ట్రీమింగ్ కానుంది.

పూర్ థింగ్స్ ఓటీటీ రిలీజ్

పూర్ థింగ్స్ మూవీ 2023లో రిలీజైంది. గతేడాది టాప్ 10 హాలీవుడ్ సినిమాల్లో ఒకటిగా ఈ మూవీని అమెరికన్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ అండ్ ద నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ ఎంపిక చేసింది. గోల్డెన్స్ గ్లోబ్స్ లో రెండు, బాఫ్టాల్లో ఐదు అవార్డులు గెలుచుకున్న ఈ మూవీ.. ఆస్కార్స్ లో 11 నామినేషన్లను సొంతం చేసుకుంది. ఇప్పుడీ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ ప్లస్ లు వచ్చే మంగళవారం (ఫిబ్రవరి 27) నుంచి స్ట్రీమింగ్ చేయనున్నాయి.

ఈ పూర్ థింగ్స్ మూవీ గతేడాది సెప్టెంబర్ 1, 2023న 80వ వెనిస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించారు. అక్కడ గోల్డెన్ లయన్ గెలుచుకుంది. ఇక గతేడాది డిసెంబర్ 8న అమెరికాలో, జనవరి 12న యూకేలో రిలీజైంది.

పూర్ థింగ్స్.. రెంట్‌కే అందుబాటులో..

అయితే ఈ పూర్ థింగ్స్ మూవీ రెండు ఓటీటీల్లోకి వస్తున్నా ప్రస్తుతానికి రెంట్ కిందే అందుబాటులో ఉంది. అంటే మూవీ చూడాలంటే ఆ ఓటీటీలు డిమాండ్ చేసే మొత్తం చెల్లించాలి. ఫ్రీగా ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందన్నది ఇంకా చెప్పలేదు. ఎమ్మా స్టోన్, మార్క్ రఫాలో, విలెమ్ డాఫో, రామీ యూసెఫ్ లాంటి వాళ్లు ఇందులో నటించారు.

పూర్ థింగ్స్ ఒక అసాధారణ సైన్ ఫిక్షన్ డ్రామెడీ. తన భర్త వేధింపులు తట్టుకోలేక కడుపులో శిశువుతోనే విక్టోరియా అనే యువతి ఆత్మహత్య చేసుకుంటుంది. అయితే ఆమె కడుపులోని బిడ్డ మెదడును ఆమెలో ఉంచి తిరిగి బతికేలా చేస్తాడు ఓ మ్యాడ్ సైంటిస్ట్ డాక్టర్ గాడ్విన్ బాక్స్‌టర్. అయితే ఆమెకు బేబీ మెదడు ఉండటంతో వయసు పెద్దదైనా చిన్నారి చేష్టలు చేస్తూ ఉంటుంది.

ముద్దు ముద్దుగా మాట్లాడుతూ, నడక నేర్చుకుంటూ అచ్చూ చిన్నారిలాగే చేస్తుంటుంది. తన పెళ్లిని మ్యాక్స్ మెక్‌క్యాండిల్స్ అనే వ్యక్తితో ఖాయం చేసినా.. ఆమె మాత్రం డంకన్ అనే ఓ లాయర్ తో కలిసి పారిపోతుంది. తర్వాత ఏం జరిగిందన్నది ఈ మూవీలో చూడొచ్చు.

IPL_Entry_Point