2024 Oscars:2024 ఆస్కార్ నామినేషన్స్ - 54వ సారి నామినేట్ అయిన జాన్ విలియమ్స్ - ఇండియా నుంచి బరిలో నిలిచిన మూవీ ఏదంటే?
Oscars 2024 Nominations: 96 ఆస్కార్ అవార్డుల నామినేషన్స్‌ను ప్రకటించారు. క్రిస్టోఫర్ నోలన్ ఓపెన్‌హైమర్ మూవీ 13 నామినేషన్స్ తో పాటు ప్లేస్‌లో నిలిచింది. ఇండియా నుంచి బెస్ట్ డాక్యుమెంటరీ కేటగిరీలో టు కిల్ ఏ టైగర్ మూవీ మాత్రమే నిలిచింది.
Oscars 2024 Nominations: హాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల వేడుకకు రంగం సిద్ధమైంది. 96వ ఆస్కార్ అవార్డుల నామినేషన్లను మంగళవారం అనౌన్స్ చేశారు. బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్‌తో పాటు మిగిలిన విభాగాలకు సంబంధించి అవార్డుల కోసం పోటీపడుతోన్న వారి జాబితాను అనౌన్స్‌చేశారు.
96వ ఆస్కార్ అవార్డుల్లో అత్యధిక నామినేషన్స్ దక్కించుకున్న మూవీగా ఓపెన్‌హైమర్ నిలిచింది. బెస్ట్ మూవీ, బెస్ట్ డైరెక్టర్, యాక్టర్‌తో పాటు పదమూడు నామినేషన్స్‌ను ఓపెన్‌హైమర్ దక్కించుకున్నది. ఫ్రెంచ్ మూవీ పూర్ థింగ్స్ 11 నామినేషన్స్‌తో సెకండ్ ప్లేస్‌ను దక్కించుకున్నది. లియోనార్డో డికాప్రియో నటించిన కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్స్ మూన్ మూవీ 10 నామినేషన్స్‌తో థర్డ్ ప్లేస్‌లో నిలిచింది. బార్బీ మూవీ ఎనిమిది నామినేషన్లను సొంతం చేసుకున్నది.
81 ఏళ్ల వయసులో...
కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్స్ మూన్ సినిమాకు గాను బెస్ట్ డైరెక్టర్ కేటగిరీలో 81 ఏళ్ల వయసులో మార్లిన్ స్కోర్సెస్ పోటీపడ్డారు. అలాగే ఈ సారి ఆస్కార్ అవార్డుల్లో మహిళలదే డామినేషన్ కనిపిస్తోంది. బెస్ట్ డైరెక్టర్ కేటగిరీలో అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ మూవీకిగాను జస్టిన్ ట్రైట్ పడిపడుతోంది. గ్రేటా గెర్వింగ్ తెరకెక్కించిన బార్బీ మూవీ బెస్ట్ పిక్చర్‌తో పాటు ఎనిమిది విభాగాల్లో నామినేషన్స్‌ను దక్కించుకున్నది.
54వ నామినేషన్...
అలాగే బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఇండియానా జోన్స్ ది డయల్ ఆఫ్ డెస్టినీ సినిమాకు గాను జాన్ విలియమ్స్ నామినేషన్ దక్కించుకున్నాడు. అతడికి ఇది 54వ ఆస్కార్ నామినేషన్ కావడం గమనార్హం. అత్యధిక సార్లు ఆస్కార్‌కు నామినేట్ అయిన వ్యక్తిగా రికార్డ్ క్రియేట్ చేశాడు. అంతే కాకుండా 91 ఏళ్ల వయసులో ఆస్కార్‌కు నామినేట్ అయిన మ్యూజిక్ కంపోజర్‌గా నిలిచాడు.
ఇండియా నుంచి ఒకే ఒక సినిమా...
ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ వేడుకలు మార్చి 10 జరుగనున్నాయి. గత ఏడాది ఇండియా నుంచి ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ బరిలో నిలివగాఈ ఏడాది మాత్రం నిరాశే మిగిలింది. భారతీయ దర్శకురాలు తెరకెక్కించిన టు కిల్ ఏ టైగర్ మూవీ బెస్ట్ డాక్యుమెంటరీ మూవీస్ కేటగిరీలో ఒక్కటే అవార్డుల బరిలో నిలిచింది. 12 ఫెయిల్‌తో పాటు మలయాళం మూవీ 2018 ఆస్కార్ బరిలో నిలుస్తాయని ప్రచారం జరిగినా తుది నామినేషన్స్‌లో చోటు దక్కించుకోలేకపోయాయి.
బెస్ట్ మూవీ
ఓపెన్‌హైమర్
బార్బీ
అమెరికన్ ఫిక్షన్
ది హోల్డ్ ఓవర్స్
కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్
మాస్ట్రో
పాస్ట్ లైవ్స్
పూర్ థింగ్స్
ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్
బెస్ట్ డైరెక్టర్
జస్టిన్ ట్రైల్ -అటానమీ ఆఫ్ ఏ ఫాల్
మార్టిన్ స్కోర్రెస్ - కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్స్ మూన్
క్రిస్టోఫర్ నోలన్ - ఓపెన్ హైపర్
యోర్గాస్ లాంథిమోస్ - పూర్ థింగ్స్
జోనాథన్ గ్లాజేర్ - ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్స్
బెస్ట్ యాక్టర్
బ్రాడ్లీ కూపర్ - మాస్ట్రో
డోమింగో - రస్టిన్
పాల్ గైమట్లి - ది హోల్డ్ ఓవర్స్
సిలియన్ మర్ఫీ - ఓపెన్ హైపర్
జెఫ్రీ రైట్ - అమెరికన్ ఫిక్షన్
ఉత్తమ నటి
ఎమ్మా స్టోన్ - పూర్ థింగ్స్
కేరీ ముల్లిగాన్ - మాస్ట్రో
సాండ్రా హిల్లర్ - అనాటమీ ఆఫ్ ఏ ఫాల్
గ్లాడ్‌స్టోన్ - కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్స్ మూన్
బెన్నింగ్ - నైద్
టాపిక్