BAFTAs 2024: బాఫ్టా అవార్డుల్లో ఆ సినిమాదే హవా.. చీరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన దీపికా పదుకోన్-baftas 2024 full award winners list deepika padukone in saree hollywood news in telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Baftas 2024: బాఫ్టా అవార్డుల్లో ఆ సినిమాదే హవా.. చీరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన దీపికా పదుకోన్

BAFTAs 2024: బాఫ్టా అవార్డుల్లో ఆ సినిమాదే హవా.. చీరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన దీపికా పదుకోన్

Hari Prasad S HT Telugu
Feb 19, 2024 09:09 AM IST

BAFTAs 2024: బాఫ్టా అవార్డుల వేడుకు ఆదివారం (ఫిబ్రవరి 18) రాత్రి ఘనంగా జరిగింది. ఇందులో దీపికా పదుకోన్ చీరలో కనిపించి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ బ్రిటీష్ అవార్డ్స్ నైట్ లో ఓపెన్ హైమర్ మూవీ ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు అవార్డులను గెలుచుకుంది.

బాఫ్టా అవార్డుల్లో ఓపెన్‌హైమర్ మూవీ కోసం ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న సిలియన్ మర్ఫీ
బాఫ్టా అవార్డుల్లో ఓపెన్‌హైమర్ మూవీ కోసం ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న సిలియన్ మర్ఫీ (Vianney Le Caer/Invision/AP)

BAFTAs 2024: బ్రిటీష్ అకాడెమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ (BAFTA) 2024 ఏడాదికి ప్రకటించిన అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం (ఫిబ్రవరి 18) రాత్రి ఘనంగా జరిగింది. దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ బయోపిక్ చిత్రం 'ఓపెన్‌హైమర్' బాఫ్టా ఫిల్మ్ అవార్డ్స్ 2024 లో ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు అవార్డులతో సహా ఏడు అవార్డులతో సత్తా చాటింది. లండన్ లోని రాయల్ ఫెస్టివల్ హాల్ లో ఈ వేడుక జరిగింది.

అమెరికాకు చెందిన మీడియా సంస్థ డెడ్ లైన్ ప్రకారం పూర్ థింగ్స్ మూవీ అవార్డుల పంట పండించింది. ఉత్తమ నటిగా ఎమ్మా స్టోన్ నిలవడంతో పాటు కాస్ట్యూమ్, మేకప్, హెయిర్, ప్రొడక్షన్ డిజైన్, స్పెషల్ విజువల్ ఎఫెక్ట్స్ తో సహా ఐదు బాఫ్టాలతో దుమ్ము రేపింది.

అయితే ఈ బాఫ్టా అవార్డుల్లో 9 నామినేషన్లు పొందిన కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్, ఏడు నామినేషన్లు ఉన్న మ్యాస్ట్రో, బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించిన బార్బీ సినిమాలకు ఒక్క అవార్డు కూడా రాకపోవడం గమనార్హం.

స్పెషల్ అట్రాక్షన్ దీపికా పదుకోన్

ఈ బాఫ్టా అవార్డుల్లో బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఆమె గౌన్ లో కాకుండా చీరలో కనిపించి ఆకట్టుకుంది. ఈ అవార్డుల సెర్మనీలో దీపికా ప్రధాన అవార్డు అయిన బెస్ట్ నాన్ ఇంగ్లిష్ మూవీ కేటగిరీలో విజేతకు అవార్డు అందజేసింది. ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మూవీ ఈ అవార్డు గెలుచుకుంది.

బాఫ్టా అవార్డు విజేతలు వీళ్లే

బాఫ్టా అవార్డులు 2024 విజేతల పూర్తి జాబితా ఇక్కడ ఉంది. ఇందులో ఓపెన్‌హైమర్ మూవీ ఏకంగా ఏడు కేటగిరీల్లో అవార్డులు గెలిచింది. పూర్ థింగ్స్ మూవీకి ఐదు అవార్డులు వచ్చాయి.

బెస్ట్ మూవీ - ఓపెన్‌హైమర్

అత్యద్భుతమైన బ్రిటీష్ మూవీ - ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్

బిట్రీష్ డైరెక్టర్, రైటర్, ప్రొడ్యూసర్ ఔట్‌స్టాండింగ్ డెబ్యూ - ఎర్త్ మామా - సవనా లీఫ్ (రచయిత, దర్శకుడు, నిర్మాత), షెర్లీ ఓ'కానర్ (నిర్మాత), మెడ్బ్ రియోర్డాన్ (నిర్మాత)

ఇంగ్లిషేతర బెస్ట్ మూవీ - ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్

బెస్ట్ డాక్యుమెంటరీ - 20 డేస్ ఇన్ మారిపోల్

బెస్ట్ యానిమేటెడ్ మూవీ - ది బాయ్ అండ్ ది హెరాన్

బెస్ట్ డైరెక్టర్ - క్రిస్టోఫర్ నోలన్, ఒపెన్‌హైమర్

బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే - అనాటమీ ఆఫ్ ఎ ఫాల్

బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే - అమెరికన్ ఫిక్షన్

ఉత్తమ నటి - ఎమ్మా స్టోన్, పూర్ థింగ్స్

ఉత్తమ నటుడు - సిలియన్ మర్ఫీ, ఒపెన్హైమర్

ఉత్తమ సహాయ నటి - డా'వైన్ జాయ్ రాండాల్ఫ్, ది హోల్డోవర్స్

ఉత్తమ సహాయ నటుడు - రాబర్ట్ డౌనీ జూనియర్ , ఓపెన్ హైమర్

బెస్ట్ కాస్టింగ్ - ది హోల్డోవర్స్

బెస్ట్ సినిమాటోగ్రఫీ - ఓపెన్హైమర్

బెస్ట్ ఎడిటింగ్ - ఓపెన్ హైమర్

బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ - పూర్ థింగ్స్

బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ - పూర్ థింగ్స్

బెస్ట్ ఒరిజినల్ స్కోర్ - ఓపెన్ హైమర్

బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ - పూర్ థింగ్స్

బెస్ట్ సౌండ్ - ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్

బెస్ట్ స్పెషల్ విజువల్ ఎఫెక్ట్స్ - పూర్ థింగ్స్

బెస్ట్ బ్రిటీష్ పార్ట్ యానిమేషన్ - క్రాబ్ డే

బెస్ట్ బ్రిటీష్ షార్ట్ ఫిల్మ్ - జెల్లీ ఫిష్ అండ్ లాబ్ స్టర్

ఈఈ రైజింగ్ స్టార్ అవార్డు (పీపుల్స్ ఛాయిస్) - మియా మెక్కెన్నా-బ్రూస్

Whats_app_banner