Oppenheimer Twitter review : అబ్బా.. ఇది నిజంగా కళాఖండం.. ఓపెన్‌హైమర్ చిత్రంపై ప్రేక్షకుల రివ్యూ
oppenheimer review Telugu : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో వచ్చిన ఓపెన్‌హైమర్ చిత్రం విడుదలైంది. బయోగ్రాఫికల్ థ్రిల్లర్ గా ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సినిమా చూసి ప్రేక్షకులు వావ్ అంటున్నారు. సిలియన్ మర్ఫీ నటన అద్భుతమని చెబుతున్నారు.

క్రిస్టోఫర్ నోలన్(Chirstopher nolan) దర్శకత్వం వహించిన 'ఓపెన్‌హైమర్' సినిమాపై అంచనాలు తప్పలేదు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారు. అణు బాంబును కనుగొన్న శాస్త్రవేత్త జె. రాబర్ట్ ఓపెన్‌హైమర్ జీవితం ఆధారంగా రూపొందించారు చిత్రం. సిలియన్ మర్ఫీ(Cillian murphy) ఈ పాత్రను పోషించాడు. ఆయన నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ సినిమా రివ్యూలు చూస్తుంటే సినిమా దుమ్మురేపడం ఖాయమని అంటున్నారు. ఈ సినిమా చూసిన పలువురు ట్విట్టర్‌లో కామెంట్స్ చేస్తున్నారు.
రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో, జపాన్‌లోని రెండు నగరాలపై అణు బాంబులు వేశారు. ఈ అణు బాంబును J. రాబర్ట్ ఓపెన్‌హైమర్ కనుగొన్నారు. ఆయన జీవితాధారంగా సినిమా తెరకెక్కుతుందన్న అంచనాలు ఇప్పటికే ఏర్పడ్డాయి. జులై 21న విడుదలైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. ఆస్కార్(Oscar)లో ఎన్నో అవార్డులు గెలుచుకోవాలనే ఆశను సృష్టించింది.
'సిలియన్ మర్ఫీ నటన అద్భుతం. ఆస్కార్‌లో అతనికి తప్పకుండా అవార్డు వస్తుంది. ఇది క్రిస్టోఫర్ నోలన్ మాస్టర్ పీస్.' అని కొందరు కామెంట్ చేశారు.
'ఓపెన్‌హైమర్ సినిమాని మాటల్లో వర్ణించలేం. థియేటర్‌లో చూసి ఆనందించాల్సిందే. 10కి 10 ఇస్తాం' అని ఓ ప్రేక్షకుడు ట్వీట్ చేశాడు. అలాగే సినిమాని రివ్యూ చేసేందుకు కొంత మంది సినిమాలోని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించి ట్విట్టర్‌లో షేర్ చేస్తున్నారు.
ఇది జూలై 11న పారిస్‌లో, జూలై 13న లండన్‌లో, జూలై 17న న్యూయార్క్‌లో ప్రదర్శించారు. జులై 21న సినిమా చాలా దేశాల్లో విడుదలైంది. ఈ సినిమాపై అభిమానుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ అందర్నీ ఆశ్చర్యపరిచింది. తొలిరోజు ఇండియాలో 3 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోయాయి. మరో విశేషమేమిటంటే.. ఈ సినిమా టిక్కెట్లు కాశ్మీర్‌లో భారీగా అమ్ముడయ్యాయి. వీకెండ్‌లో వెతికినా ఒక్క సీటు కూడా దొరకలేదు. షారుక్ ఖాన్ 'పఠాన్' తర్వాత కాశ్మీర్‌లో హౌస్‌ఫుల్‌గా కనిపిస్తున్న సినిమా ఇదే. జనవరి నెలలో విడుదలైన 'పఠాన్' సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. తర్వాత ఓపెన్‌హైమర్ ఇప్పుడు కాశ్మీర్ థియేటర్లలో మళ్లీ హౌస్‌ఫుల్ షోలతో ఉంది.
టాపిక్