Fighter Actors Remunerations: ఫైటర్ మూవీ కోసం హృతిక్, దీపికా రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకే
Fighter Actors Remunerations: బాలీవుడ్ నటీనటులు హృతిక్ రోషన్, దీపికా పదుకోన్ నటించిన ఫైటర్ మూవీ గురువారం (జనవరి 25) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ మూవీ కోసం వీళ్లు తీసుకున్న రెమ్యునరేషన్ తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే.

Fighter Actors Remunerations: ఫైటర్ మూవీ రిపబ్లిక్ డేకి ఒక రోజు ముందు దేశభక్తిని నింపడానికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో హృతిక్ రోషన్, దీపికా పదుకోన్ లీడ్ రోల్స్ లో నటించారు. అయితే ఈ మూవీ కోసం ఈ లీడ్ పెయిర్ తీసుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఈ మధ్యకాలంలో పెద్దగా హిట్ లేని హృతిక్ కూడా ఫైటర్ సినిమా కోసం భారీ మొత్తం తీసుకోవడం విశేషం. అటు బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరైన దీపికా కూడా బాగానే సంపాదించింది.
ఫైటర్.. భారీ బడ్జెట్.. భారీ రెమ్యునరేషన్లు
ఫైటర్ మూవీని సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేశాడు. గతేడాది ఇదే రోజున (జనవరి 25) షారుక్ ఖాన్ తో అతడు తీసిన పఠాన్ మూవీ రిలీజై.. ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకుపైగానే వసూలు చేసింది. దీంతో ఫైటర్ మూవీని కూడా అతనిపై నమ్మకంతో భారీ బడ్జెట్ తో రూపొందించారు. ఈ సినిమాను సుమారు రూ.250 కోట్లతో నిర్మించినట్లు సమాచారం.
ముఖ్యంగా ఇందులో లీడ్ రోల్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులుగా కనిపించడం, గగనతలంలో స్టంట్స్ కోసం భారీగా ఖర్చు చేయాల్సి వచ్చింది. దీనికితోడు హృతిక్, దీపిక రెమ్యునరేషన్లు కూడా ఎక్కువే. ఫైటర్ మూవీ కోసం హృతిక్ ఏకంగా రూ.50 కోట్లు వసూలు చేయగా.. దీపికా పదుకోన్ రూ.15 కోట్లు తీసుకోవడం విశేషం. హృతిక్ రెమ్యునరేషన్ అంత భారీగా అనిపించకపోవచ్చు కానీ.. ఫిమేల్ లీడ్ గా దీపికాకు మాత్రం ఇది భారీ మొత్తమనే చెప్పాలి.
అయితే ఫైటర్ మూవీలో వీళ్ల నటనకు ఆ రెమ్యునరేషన్లు ఇవ్వాల్సిందే అని ఫ్యాన్స్ అంటున్నారు. ఫైటర్ తొలి షో నుంచే పాజిటివ్ రివ్యూలు సంపాదించింది. మూవీలో హృతిక్, దీపికా మధ్య కెమెస్ట్రీ అదుర్స్ అని అభిమానులు తేల్చేశారు. ఇక ఇప్పటికే వార్, పఠాన్ లాంటి యాక్షన్ మూవీస్ తీసిన సిద్ధార్థ్ ఆనంద్ మరోసారి తన జానర్ లో చెలరేగిపోయాడు.
ఫైటర్ మూవీకి హృతిక్ రోషనే పెద్ద ప్లస్ పాయింట్ అని అందరూ చెబుతున్న మాట. అందుకే అతడు అందుకున్న రూ.50 కోట్లకు పూర్తి న్యాయం చేశాడని ఫ్యాన్స్ స్పష్టం చేస్తున్నారు. అటు యాక్షన్ సీన్స్ లో ఈ మధ్య చెలరేగి నటిస్తున్న దీపికాకు రూ.15 కోట్లు ఎక్కువేమీ కాదని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. మరోవైపు ఇందులో సీనియర్ నటుడు అనిల్ కపూర్ కూడా నటించాడు.
ఈ మధ్యే యానిమల్ మూవీతో సక్సెస్ అందుకున్న ఈ బాలీవుడ్ సీనియర్ నటుడు.. ఫైటర్ మూవీ కోసం రూ.7 కోట్లు రెమ్యునరేషన్ గా అందుకున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీలో స్క్వాడ్రన్ లీడర్ గా నటించిన కరణ్ సింగ్ గ్రోవర్ కూడా రూ.2 కోట్లు అందుకున్నాడు. ఫైటర్ మూవీ పఠాన్, వార్ కంటే చాలా బాగుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ లెక్కన సిద్ధార్థ్ ఆనంద్ మరో హిట్ అందుకున్నట్లే చెప్పాలి.