Oscars 2024 Live Streaming: ఆస్కార్స్ 2024 వచ్చేస్తోంది.. ఈ మెగా అవార్డుల సెర్మనీ ఎప్పుడు, ఎక్కడ లైవ్ చూడాలి?
Oscars 2024 Live Streaming: ఆస్కార్స్ 2024 వేడుక మార్చి 10న జరగబోతోంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ హాలీవుడ్ లో ఉన్న డాల్బీ థియేటర్లో జరగబోయే ఈ వేడుకను ఎప్పుడు, ఎక్కడ లైవ్ చూడాలి?
Oscars 2024 Live Streaming: 96వ అకాడెమీ అవార్డుల సెర్మనీకి టైమ్ దగ్గర పడింది. ప్రపంచ సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుల సెర్మనీ ఇది. ఆస్కార్స్ వేడుక ఈస్టర్న్ స్టాండర్డ్ టైమ్ (ఈఎస్టీ) ప్రకారం వచ్చే ఆదివారం (మార్చి 10) జరగనుంది. అయితే భారత కాలమానం ప్రకారం మనకు సోమవారం తెల్లవారుఝాము అవుతుంది.
ఆస్కార్స్ వేడుక లైవ్ వివరాలు
ఆస్కార్స్ 2024 వేడుకను ఇండియాలో లైవ్ చూడాలనుకునే వారు వచ్చే సోమవారం (మార్చి 11) ఉదయం 4 గంటలకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కు ట్యూన్ అవండి. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్లో ఈ 96వ అకాడెమీ అవార్డుల సెర్మనీ జరగనుంది. ఈ వేడుక లైవ్ స్ట్రీమింగ్ వివరాలను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ షేర్ చేసింది.
ఆస్కార్స్ కు నామినేట్ అయిన సినిమాలను వెల్లడిస్తూ స్ట్రీమింగ్ వివరాలను తెలిపింది. "స్టార్లతో కూడిన రోజు కోస స్నాక్స్ తో సిద్ధంగా ఉండండి. ఆస్కార్స్ 2024 మార్చి 11న మీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ కానుంది. లెట్ ద షో బిగిన్" అనే క్యాప్షన్ తో హాట్‌స్టార్ ఈ వివరాలను షేర్ చేసింది.
ఈ సందర్భంగా ఆస్కార్స్ కు నామినేట్ అయిన హాలీవుడ్ సినిమాలు కిల్లర్స్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్, ఓపెన్‌హైమర్, బార్బీ, మ్యాస్ట్రో, పూర్ థింగ్స్, అమెరికన్ ఫిక్షన్ లాంటి సినిమాల విజువల్స్ ను పోస్ట్ చేసింది. ఆస్కార్స్ 2024ను కమెడియన్ జిమ్మీ కిమ్మెల్ హోస్ట్ చేయనున్నాడు. వరుసగా నాలుగోసారి అతడీ అవార్డుల సెర్మనీకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు.
ఆస్కార్స్ నామినేషన్లు ఇవీ
ఆస్కార్స్ పై గతేడాది ఇండియన్ ఫ్యాన్స్ లో విపరీతమైన ఆసక్తి ఉండేది. దీనికి కారణంగా ఆర్ఆర్ఆర్ మూవీ పోటీ పడటమే. ఆ సినిమా బెస్ట్ ఒరిజినల్ స్కోర్ అవార్డు కూడా గెలుచుకుది.
అయితే ఈసారి మాత్రం నిరాశే మిగిలింది. భారతీయ దర్శకురాలు తెరకెక్కించిన టు కిల్ ఏ టైగర్ మూవీ బెస్ట్ డాక్యుమెంటరీ మూవీస్ కేటగిరీలో ఒక్కటే అవార్డుల బరిలో నిలిచింది. 12th ఫెయిల్‌తో పాటు మలయాళం మూవీ 2018 ఆస్కార్ బరిలో నిలుస్తాయని ప్రచారం జరిగినా తుది నామినేషన్స్‌లో చోటు దక్కించుకోలేకపోయాయి.
బెస్ట్ మూవీ
ఓపెన్‌హైమర్
బార్బీ
అమెరికన్ ఫిక్షన్
ది హోల్డ్ ఓవర్స్
కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్
మాస్ట్రో
పాస్ట్ లైవ్స్
పూర్ థింగ్స్
ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్
బెస్ట్ డైరెక్టర్
జస్టిన్ ట్రైల్ -అటానమీ ఆఫ్ ఏ ఫాల్
మార్టిన్ స్కోర్రెస్ - కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్స్ మూన్
క్రిస్టోఫర్ నోలన్ - ఓపెన్ హైపర్
యోర్గాస్ లాంథిమోస్ - పూర్ థింగ్స్
జోనాథన్ గ్లాజేర్ - ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్స్
బెస్ట్ యాక్టర్
బ్రాడ్లీ కూపర్ - మాస్ట్రో
డోమింగో - రస్టిన్
పాల్ గైమట్లి - ది హోల్డ్ ఓవర్స్
సిలియన్ మర్ఫీ - ఓపెన్ హైపర్
జెఫ్రీ రైట్ - అమెరికన్ ఫిక్షన్
ఉత్తమ నటి
ఎమ్మా స్టోన్ - పూర్ థింగ్స్
కేరీ ముల్లిగాన్ - మాస్ట్రో
సాండ్రా హిల్లర్ - అనాటమీ ఆఫ్ ఏ ఫాల్
గ్లాడ్‌స్టోన్ - కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్స్ మూన్
బెన్నింగ్ - నైద్