RRR Team in Oscars: ఆస్కార్ రెడ్‌ కార్పెట్‌పై ఆర్ఆర్ఆర్ టీమ్.. షెర్వాణీలో అదరగొట్టిన చరణ్, తారక్, జక్కన్న-jr ntr ram charan and ss rajamouli in oscars 2023 red carpet ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rrr Team In Oscars: ఆస్కార్ రెడ్‌ కార్పెట్‌పై ఆర్ఆర్ఆర్ టీమ్.. షెర్వాణీలో అదరగొట్టిన చరణ్, తారక్, జక్కన్న

RRR Team in Oscars: ఆస్కార్ రెడ్‌ కార్పెట్‌పై ఆర్ఆర్ఆర్ టీమ్.. షెర్వాణీలో అదరగొట్టిన చరణ్, తారక్, జక్కన్న

Maragani Govardhan HT Telugu
Mar 13, 2023 06:40 AM IST

RRR Team in Oscars: 95వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవంలో ఆర్ఆర్ఆర్ టీమ్ సందడి చేసింది. ఆస్కార్ రెడ్ కార్పెట్‌పై రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి మెరిశారు. భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా షెర్వాణీ ధరించారు.

ఆస్కార్ రెడ్‌ కార్పెట్‌పై ఆర్ఆర్ఆర్ టీమ్
ఆస్కార్ రెడ్‌ కార్పెట్‌పై ఆర్ఆర్ఆర్ టీమ్

RRR Team in Oscars: ప్రతిష్టాత్మక 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అమెరికా లాస్ ఏంజెల్స్ వేదికగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఆర్ఆర్ఆర్ బృందం ఎస్ఎస్ రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నాటు నాటు పాట ఆస్కార్‌కు నామినేట్ కావడంతో సింగర్స్ కాలభైరవ, రాహుల్ సిప్లీగంజ్, ప్రేమ్ రక్షిత్ అక్కడకు చేరుకున్నాడు. సోమవారం నాడు ఉదయం తెల్లవారుజామున మొదలైన ఈ కార్యక్రమంలో ఆర్ఆర్ఆర్ బృందం రెడ్ కార్పెట్‌పై నడిచింది.

తారక్, రాజమౌళి, చరణ్ ముగ్గురు భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా షెర్వాణి ధరించి హాజరయ్యారు. చరణ్, తారక్ నలుపు రంగు దుస్తుల్లో మెరిశారు. ముఖ్యంగా ఎన్‌టీఆర్ భుజంపై పులి బొమ్మ కనిపించేలా డిజైన్ చేసిన షెర్వాణి ధరించారు. వీరు ముగ్గురు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముగ్గురు కలిసి దిగిన ఫొటోను ఆర్ఆర్ఆర్ బృందం ట్విటర్ వేదికగా షేర్ చేసింది.

ఈ కార్యక్రమానికి రామ్ చరణ్.. తన భార్య ఉపాసనతో కలిసి హాజరయ్యారు. క్రీమ్ కలర్ చీరలో ఈ ఈవెంట్‌కు ఆమె హాజరయ్యారు. ఉపాసన ఆరు నెలల గర్బంతో ఉందని, తమ బేబీ ఇప్పటికే అదృష్టం తీసుకొస్తుందని భావిస్తున్నట్లు చరణ్ పేర్కొన్నారు.

ఆస్కార్‌కు నాటు నాటు సాంగ్ నామినేట్ కావడంతో గత కొన్ని రోజులుగా చిత్రబృందం అమెరికాలోనే ప్రమోషన్‌ను నిర్వహిస్తుంది. 95వ అకాడమీ అవార్డుల వేడుకల్లో రాహుల్ సిప్లీగంజ్, కాల భైరవ, ప్రేమ్ రక్షిత్ కూడా మెరిశారు. ఆస్కార్‌కు నామినేట్ కావడాని కంటే ముందు నాటు నాటు అనేక అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. వీటిలో ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా ఉంది.95."

IPL_Entry_Point

టాపిక్