Natu Natu Song: ఆస్కార్స్‌లో నాటు నాటు డ్యాన్స్.. స్టెప్పులేసేది తారక్, చరణ్ కాదు.. ఈ నటి-natu natu song performance by lauren gottlieb on oscars stage ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Natu Natu Song: ఆస్కార్స్‌లో నాటు నాటు డ్యాన్స్.. స్టెప్పులేసేది తారక్, చరణ్ కాదు.. ఈ నటి

Natu Natu Song: ఆస్కార్స్‌లో నాటు నాటు డ్యాన్స్.. స్టెప్పులేసేది తారక్, చరణ్ కాదు.. ఈ నటి

Hari Prasad S HT Telugu
Mar 12, 2023 08:57 PM IST

Natu Natu Song: ఆస్కార్స్‌లో నాటు నాటు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది. కానీ స్టెప్పులేసేది మాత్రం తారక్, చరణ్ కాదు.. ఓ బాలీవుడ్ నటి. ఈ విషయాన్ని ఆమె ఆదివారం (మార్చి 12) ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అనౌన్స్ చేసింది.

బాలీవుడ్ నటి లారెన్
బాలీవుడ్ నటి లారెన్

Natu Natu Song: ఈసారి ఆస్కార్స్ మరీ నాటుగా ఉండే అవకాశం ఉంది. టాలీవుడ్, పాన్ ఇండియా కాకుండా పాన్ వరల్డ్ లో సంచలనం సృష్టించిన ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ ఈసారి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో పోటీ పడబోతోంది. అంతేకాదు ఈ పాటపై కీరవాణి, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు.

ఇక తాజాగా బయటకు వచ్చిన మరో విషయం ఏంటంటే.. ఈ పాటపై ఆస్కార్స్ వేదిక పై స్టెప్పులు కూడా వేయబోతున్నారు. అయితే అది అందరూ అనుకుంటున్నట్లు తారక్, చరణ్ కాదు. బాలీవుడ్ నటి లారెన్ గోట్లీబ్. ఏబీసీడీ, వెల్‌కమ్ బ్యాక్, వెల్‌కమ్ టు కరాచీలాంటి మూవీస్ లో నటించిన ఈమె.. నాటు నాటుపై డ్యాన్స్ చేయబోతోంది.

ఈ విషయాన్ని లారెన్ ఆదివారం (మార్చి 12) తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అనౌన్స్ చేసింది. హాలీవుడ్ ముందు ఫొటోలకు పోజులిచ్చిన ఆమె.. వాటిని షేర్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించింది. "స్పెషల్ న్యూస్.. ఆస్కార్స్ లో నేను నాటు నాటు పర్ఫార్మ్ చేయబోతున్నాను. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన స్టేజ్ పై పర్ఫార్మ్ చేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాను. నాకు ఆల్ ద బెస్ట్ చెప్పండి" అంటూ లారెన్ పోస్ట్ చేసింది.

ఆస్కార్స్ వేడుకలు ఆదివారం (మార్చి 12) రాత్రి లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో జరగనున్నాయి. ఈ వేడుకలు భారత కాలమానం ప్రకారం సోమవారం (మార్చి 13) తెల్లవారుఝామున 5.30 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ అవార్డుల వేడుకలో పాల్గొనడానికి ఇప్పటికే తారక్, చరణ్ సహా ఆర్ఆర్ఆర్ టీమ్ అంతా అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే.

అక్కడి ప్రముఖ నటీనటులతో తారక్, చరణ్ ఫొటోలకు పోజులిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్.. బాలీవుడ్, హాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా ఇచ్చిన ప్రీ ఆస్కార్ పార్టీలోనూ పాల్గొని ఆమెతో ఫొటోలు దిగాడు. అటు రామ్ చరణ్ కూడా భార్య ఉపాసనతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొనడానికి వెళ్లాడు. ఈ జంట కూడా అక్కడ కెమెరాలకు పోజులిస్తోంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం