NTR on Oscars: ఆర్ఆర్ఆర్ హీరోగా కాదు భార‌తీయుడిగా ఆస్కార్‌ రెడ్ కార్పెట్‌పై న‌డుస్తా - ఎన్టీఆర్ కామెంట్స్ వైర‌ల్‌-ntr says whole nation in our hearts as step foot on oscar red carpet ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ntr On Oscars: ఆర్ఆర్ఆర్ హీరోగా కాదు భార‌తీయుడిగా ఆస్కార్‌ రెడ్ కార్పెట్‌పై న‌డుస్తా - ఎన్టీఆర్ కామెంట్స్ వైర‌ల్‌

NTR on Oscars: ఆర్ఆర్ఆర్ హీరోగా కాదు భార‌తీయుడిగా ఆస్కార్‌ రెడ్ కార్పెట్‌పై న‌డుస్తా - ఎన్టీఆర్ కామెంట్స్ వైర‌ల్‌

Nelki Naresh Kumar HT Telugu
Mar 10, 2023 10:03 AM IST

NTR on Oscars: మార్చి 13న జ‌రుగ‌నున్న ఆస్కార్ ప్ర‌దానోత్స‌వ వేడుక‌ల్లో ఆర్ఆర్ఆర్ టీమ్ సంద‌డి చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఆస్కార్ వేడుక‌లో తొలిసారి పాల్గొన‌డంపై ఎన్టీఆర్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. ఆయ‌న ఏమ‌న్నారంటే...

ఎన్టీఆర్
ఎన్టీఆర్

NTR on Oscars: హీరోగా కాకుండా భార‌తీయుడిగా ఆస్కార్‌ (Oscars) రెడ్ కార్పెట్‌పై అడుగుపెట్ట‌డానికి ఉత్సుక‌త‌గా ఎదురుచూస్తోన్న‌ట్లు ఎన్టీఆర్ (Ntr) పేర్కొన్నాడు. ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందించిన‌ ఆర్ఆర్ఆర్‌ సినిమా ఆస్కార్ కు నామినేట్ అయిన సంగ‌తి తెలిసిందే.

నాటు నాటు పాట‌కు గాను బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయిన ఆర్ఆర్ఆర్ ఈ ఘ‌న‌త‌ను ద‌క్కించుకున్న తొలి తెలుగు సినిమాగా నిలిచింది ఇప్ప‌టికే ప‌లు అంతర్జాతీయ అవార్డుల‌ను అందుకొన్న ఆర్ఆర్ఆర్ ఆస్కార్ కూడా గెల‌వ‌డం ఖాయ‌మంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ నెల 13న (భార‌త కాల‌మానం ప్ర‌కారం ) ఆస్కార్ ప్ర‌దానోత్స‌వ వేడుక జ‌రుగ‌నుంది. ఇందులో పాల్గొన‌డానికి ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌తో పాటు రాజ‌మౌళితో పాటు చిత్ర యూనిట్ అమెరికా వెళ్లారు.వీరు ఆస్కార్ రెడ్ కార్పెట్‌పై మెర‌వ‌బోతున్నారు.

ఆస్కార్ వేడుక‌లో తొలిసారి పాల్గొన‌నుండ‌టంపై లాస్ ఏంజిలాస్‌కు చెందిన ఓ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఎన్టీఆర్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. ఎన్టీఆర్‌గానో, కొమురం భీమ్ పాత్ర‌ధారిగా కాకుండా భార‌తీయుడిగా రెడ్ కార్పెట్‌పై న‌డ‌వ‌బోతున్న‌ట్లు ఎన్టీఆర్ పేర్కొన్నాడు.

గుండెల నిండా భార‌తీయ‌త‌ను నింపుకొని రెడ్ కార్పెట్‌పై అడుగుపెట్టే క్ష‌ణాల కోసం ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నానంటూ ఎన్టీఆర్ పేర్కొన్నాడు. గ‌త ఏడాది మార్చిలో థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఆర్ఆర్ఆర్ 1200 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది.

IPL_Entry_Point

టాపిక్