తెలుగు న్యూస్  /  Sports  /  Gt Vs Csk Ipl 2023 Opening Match In Doubt As Heavy Rain Lashes Ahmedabad

GT vs CSK IPL 2023: అహ్మదాబాద్‌లో భారీ వర్షం.. ఐపీఎల్ తొలి మ్యాచ్ డౌటే

Hari Prasad S HT Telugu

31 March 2023, 9:23 IST

  • GT vs CSK IPL 2023: అహ్మదాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో శుక్రవారం (మార్చి 31) నరేంద్ర మోదీ స్టేడియంలో జరగాల్సిన ఐపీఎల్ తొలి మ్యాచ్ జరగడం అనుమానంగా మారింది.

గురువారం సాయంత్రం అహ్మదాబాద్ లో భారీ వర్షం.. వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్న గుజరాత్ టైటన్స్ కోచ్ నెహ్రా
గురువారం సాయంత్రం అహ్మదాబాద్ లో భారీ వర్షం.. వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్న గుజరాత్ టైటన్స్ కోచ్ నెహ్రా (Twitter)

గురువారం సాయంత్రం అహ్మదాబాద్ లో భారీ వర్షం.. వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్న గుజరాత్ టైటన్స్ కోచ్ నెహ్రా

GT vs CSK IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతోంది. అయితే గుజరాత్ టైటన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్. అహ్మదాబాద్ లో గురువారం భారీ వర్షం కురిసింది. అసలు ఊహించని రీతిలో హఠాత్తుగా వాతావరణం మారిపోయి భారీ వర్షం కురవడంతో చెన్నై, గుజరాత్ టీమ్స్ ప్రాక్టీస్ సెషన్ లను రద్దు చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

గురువారం సాయంత్రం ఏదో కాసేపు చినుకులు పడి వెళ్లిపోతాయనుకుంటే ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గి జనాలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఐపీఎల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ మాత్రం ఉసూరుమన్నారు. మ్యాచ్ సమయానికి కూడా ఇలాగే వర్షం పడితే ఎలా అన్న ఆందోళనలో వాళ్లు ఉన్నారు.

ఐపీఎల్ తొలి మ్యాచ్ జరుగుతుందా?

అభిమానులకు కాస్త ఊరట కలిగించే విషయం ఏమిటంటే.. శుక్రవారం వర్షం పడే అవకాశాలు అసలు లేవని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే కొన్ని రోజులుగా ఉత్తర, పశ్చిమ భారతదేశంలో ఊహించని రీతిలో సడెన్ గా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. శుక్రవారం (మార్చి 31) ఉదయం అయితే అహ్మదాబాద్ లో ఎలాంటి వర్షం లేదు.

సాయంత్రం కూడా ఇలాగే ఉంటే మ్యాచ్ సజావుగా సాగిపోతుంది. అంతేకాదు అంతకుముందు మన తెలుగు స్టార్లు రష్మిక మందన్నా, తమన్నా భాటియా, సింగర్ అరిజిత్ సింగ్ కూడా పర్ఫార్మ్ చేయనున్నారు. వరుణుడు కరుణిస్తే ఓపెనింగ్ సెర్మనీతోపాటు హైఓల్టేజ్ గుజరాత్, చెన్నై మ్యాచ్ ఎలాంటి అడ్డంకి లేకుండా సాగుతుంది.

అయితే తొలి మ్యాచ్ కు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ అందుబాటులో ఉండేది అనుమానంగా ఉంది. అతడు మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. ఒకవేళ అతడు ఆడకపోతే చెన్నై కెప్టెన్సీ బాధ్యతలు ఎవరు తీసుకుంటారన్నది చూడాలి. స్టోక్స్, జడేజా, రుతురాజ్ గైక్వాడ్ రేసులో ఉన్నారు.