వార ఫలాలు.. ఈవారం ఏ రాశుల వారి అదృష్టం ఎలా ఉంటుందో తెలుసుకోండి
11 February 2024, 2:00 IST
- Weekly horoscope in telugu : ఈ వారం రాశి ఫలాలు కింది విధంగా ఉన్నాయి. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ఫిబ్రవరి 17వ తేదీ వరకు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. జ్యోతిష శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.
వార ఫలాలు: ఫిబ్రవరి 11 నుంచి ఫిబ్రవరి 17 వరకు రాశి ఫలాలు
రాశిఫలాలు (వార ఫలాలు) 11.02.2024 నుండి 17.02.2024 వరకు
లేటెస్ట్ ఫోటోలు
సంవత్సరం : శోభకృత్ నామ, అయనం : ఉత్తరాయణం, మాసం : మాఘం
మేష రాశి
మేష రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. వ్యాపారపరంగా అనుకూల సమయం. గతంలో నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. సహోద్యోగులతో సమస్యలు రావచ్చు. విద్యార్థులకు మంచి సమయం. విదేశీయాన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం. వాహనం, భూమి కొనుగోలు వ్యవహారాలు కలసివస్తాయి. మేష రాశి వారు ఈవారం దక్షిణామూర్తిని పూజించాలి. ఆదివారం, మంగళవారం, శనివారం రాహుకాల సమయంలో దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యుడిని పూజించినట్లయితే మరింత శుభఫలితాలు కలుగుతాయి.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ వారం మీకు అంత అనుకూలంగా లేదు. పెద్దల నుంచి విలువైన సలహాలు అందుకుంటారు. వ్యాపారపరంగా అనుకూలం. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. విద్యార్థులకు మంచి సమయం. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. అస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. ప్రయాణాలు కలసివచ్చును. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. కోర్టు కేసుల్లో వ్యయప్రయాసలు అధిమవుతాయి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. శనివారం రోజు దుర్గాదేవిని పూజించాలి.
మిథున రాశి
మిథున రాశి వారికి ఈ వారం మీకు అనుకూల ఫలితాలున్నాయి. దీర్ఘ కాలిక పెట్టుబడులకు అవకాశం. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆదాయం పెరుగుతుంది. వారాంతంలో ఒక వార్త ఆనందాన్నిస్తుంది. వ్యాపారులకు అదృష్టం కలసి వస్తుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. కోర్టు పనుల్లో విజయం సాధిస్తారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఖర్చుల నియంత్రణ అవసరం. కనకధారా స్తోత్రాలు పఠించండి. ఆదివారం సూర్యాష్టకాన్ని పఠించండి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు అంత అనుకూలంగా లేదు. శ్రమతో పనులు పూర్తి చేస్తారు. పట్టుదల అవసరం. ప్రభుత్వ వ్యవహారాల్లో ఆలస్యం జరుగుతుంది. ఉద్యోగులకు మధ్యస్థ సమయం. సహోద్యోగులు, అధికారులతో మాటపట్టింపులు రావచ్చు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. కొత్తవారితో పరిచయాలు ఏర్పడతాయి. వివాదాలు ఏర్పడవచ్చు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వారాంతంలో శుభవార్త వింటారు. కర్కాటక రాశి వారు ఈవారం మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించడం. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం మంచిది.
సింహ రాశి
సింహ రాశి వారికి ఈవారం మీకు అనుకూలముగా ఉంది. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. సమయానికి డబ్బు అందుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పదోన్నతి, అనుకూల స్థానచలన మార్పులు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. కొన్ని విషయాల్లో నిరుత్సాహం కలుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ద వహించాలి. వ్యాపారులకు మంచి సమయం. కళాకారులకు అనుకూలం. ఆదాయం పెరుగుతుంది. వ్యాపార భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. బంధుమిత్రుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. వేంకటేశ్వరస్వామిని పూజించండి.
కన్యా రాశి
కన్యా రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితాలుంటాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో కొంత ఊరట లభిస్తుంది. ప్రయాణాలు కలసివస్తాయి. తీర్ధయాత్రలు చేపట్టే అవకాశముంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యం అనుకూలించును. పలుకుబడి పెరుగుతుంది. ప్రభుత్వ పనుల్లో కదలిక వస్తుంది. కోర్టు వ్యవహారాలలో జాప్యం జరుగుతుంది. పెద్దల సహకారం ఉంటుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. కన్యా రాశి వారు ఈవారం మరింత శుభఫలితాలు కోసం మహా విష్ణువును పూజించాలి. విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.
తులా రాశి
తులా రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విందులు, వినోదాలకు హాజరవుతారు. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. సమయానికి సాయం చేసేవారు ఉంటారు. బాకీలు ఆలస్యంగా వసూలవుతాయి. నిర్మాణ కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగులకు మధ్యస్థ సమయం. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పరించడం. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం మంచిది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ వారం మీకు అంత అనుకూలంగా లేదు. రావలసిన డబ్బు అందుతుంది. ప్రారంభించిన పనులలో శ్రమ పెరిగినా ఫలితం దక్కుతుంది. తీర్థయాత్రలు చేపడతారు. కొత్తగా పరిచయమైన వ్యక్తులతో సమస్యలు రావచ్చు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. సహోద్యోగులతో అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. అధికారుల జోక్యంతో కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. ఆరోగ్యం అనుకూలించును. గురుదక్షిణామూర్తిని పూజించడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని పూజించండి. లక్షీ అష్టకం పఠించండి.
ధనూ రాశి
ధనూ రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. విద్యార్థులు కష్టపడవలసిన సమయం. ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. చేపట్టిన పనులు పూర్తి చేయగలుగుతారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సోదరులతో మాటపట్టింపులు రావచ్చు. ఆరోగ్యంగా ఉంటారు. ప్రయాణాల వల్ల కలసివచ్చును. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సూర్యాష్టకాన్ని పఠించడం. శివాలయంలో అభిషేకం చేసుకోవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.
మకర రాశి
మకర రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అధికారుల వల్ల కార్యసాఫల్యం ఉంది. పదోన్నతితో స్థానచలన సూచన. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టు కేసులలో సానుకూలం. స్నేహితులు బంధువుల రాకతో ఇంట్లో సందడి వాతావరణం ఉటుంది. వాహనాలు కొనుగోలు చేయవచ్చు. ప్రయాణాలు కలసివస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ద పెడతారు. అనుకున్న పనులు నెరవేరతాయి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించడం మంచిది.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈ వారం మీకు అంత అనుకూలంగా లేదు. ఇంటి వాతావరణంగా అనుకూలం. కళాకారులుకు మంచి అవకాశాలు వస్తాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. న్యాయ సమస్యలు పరిష్కారం అవుతాయి. అధికారుల అండదండలు లభిస్తాయి. శ్రమతో కూడిన ఫలితాలు అందుకుంటారు. ఖర్చుల నియంత్రణ అవసరం. వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో అందరి సహకారం లభిస్తుంది. ఆస్తుల ద్వారా ఆదాయం సమకూరుతుంది. కుంభ రాశి వారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం వేంకటేశ్వరస్వామిని పూజించండి. నవగ్రహ పీడాహర స్తోత్రాలను పఠించండి.
మీన రాశి
మీన రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థముగా ఉన్నది. అన్నదమ్ముల సహకారం లభిస్తుంది. భూలావాదేవీల్లో లాభాలు అందుకుంటారు. కోర్టు కేసుల్లో కదలిక వస్తుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. రావలసిన డబ్బు అందుతుంది. ఆదాయం పెరుగుతుంది. నలుగురికీ సాయపడతారు. ప్రయాణాలు కలసి వస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఆస్తుల మూలంగా అదాయం వస్తుంది. మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ ఆలయాల్లో శనికి తైలాభిషేకం చేసుకోవాలి. దక్షిణామూర్తిని పూజించండి. లలితా సహస్ర నామాన్ని పఠించండి.
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
మొబైల్ : 9494981000