Lord saturn Blessings: శనివారం ఇవి కనిపిస్తే శనిదేవుడి అనుగ్రహం పొందినట్టే-see these things on saturday you will get lord saturn blessings ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Lord Saturn Blessings: శనివారం ఇవి కనిపిస్తే శనిదేవుడి అనుగ్రహం పొందినట్టే

Lord saturn Blessings: శనివారం ఇవి కనిపిస్తే శనిదేవుడి అనుగ్రహం పొందినట్టే

Gunti Soundarya HT Telugu
Dec 07, 2023 12:54 PM IST

shani blessings: శనివారం రోజు కొన్నింటిని చూస్తే మీ మీద శని దేవుడి దయ ఉన్నట్టు అర్థం. ఏ పని తలపెట్టినా కూడా అద్భుతమైన విజయం సాధిస్తారు.

ఈ పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం పొందుతారు
ఈ పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం పొందుతారు (stock photo)

హిందువులు ఒక్కొక్క రోజు ఒక్కో దేవుడిని పూజిస్తారు. అలా శనివారం శని దేవుడిని ఆరాధిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని దేవుడి అత్యంత భయంకరమైన గ్రహాలలో ఒకడు. వ్యక్తి జీవితంలో శని స్థానం బలంగా ఉంటే మేలు జరుగుతుంది. శని అశుభ స్థానంలో ఉంటే ఏ కార్యక్రమాలు చేపట్టినా కూడా అన్నింటా పరాజయమే ఎదురవుతుంది.

శని దేవుడిని అందుకే చెడు దృష్టి కలవాడని అంటారు. శని స్థానం సరిగా లేకపోతే తిరవమైన కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆయన అనుగ్రహం పొందటం కోసం తప్పనిసరిగా పూజించాలని నమ్ముతారు. అప్పుడే శని దేవుడు సానుకూల ఫలితాలు ఇస్తాడు. శనివారం నాడు ఇవి చూస్తే మీకు శని దేవుడి అనుగ్రహం లభించి అదృష్టం వరిస్తుంది.

కాకిని చూసినా మేలే

శని దేవుడి వాహనం కాకి. శనివారం రోజు మీ ఇంట్లోకి కాకి నీరు తాగడానికి వస్తే శుభం జరుగుతుంది. శని దేవుని అనుగ్రహం మీరు పొందబోతున్నారనే దానికి సంకేతం. మీ మీద శని దేవుడు దయ చూపించాడని అర్థం. ఎటువంటి పనులు తలపెట్టినా కూడా విజయం సాధిస్తారు.

బిచ్చగాడు ఎదురుపడినా మంచిదే

ఇంట్లో నుంచి బయటకి వెళ్లేటప్పుడు కొందరు ఎదురుపడితే చెడు ఎదురయ్యిందని అనుకుంటారు. అనుకున్న పనులు జరగకపోతే ఎదురొచ్చిన వారిని తిట్టుకుంటారు. కానీ శనివారం నాడు బిచ్చగాడు మీకు ఎదురుపడితే అంతా శుభమే జరుగుతుంది. బిచ్చగాడికి మీ స్థోమతకి తగినంత దానం చేయడం వల్ల శని దేవుడు సంతోషిస్తాడు. మీకు మంచి చేస్తాడు.

నల్ల కుక్క

నల్ల పిల్లి, కుక్క ఎదురుపడితే ఏదో అశుభం జరగబోతుందని భయపడతారు. కానీ శనివారం రోజు నల్ల కుక్కని చూస్తే మంచిది. నలుపు రంగు శునకం కాలభైరవుడు అంశంగా భావిస్తారు. శనివారం రోజు నలుపు రంగు కుక్కలకు ఆహారం పెడితే శని దేవుడు ఆనందిస్తాడు. నలుపు రంగు చూడటం కూడా శుభానికి సంకేతంగా పరిగణిస్తారు.

శని దేవుడి అనుగ్రహం పొందటం కోసం ప్రతి శనివారం పూజలు చేస్తే మంచిది. ఈ పనులు చేయడం వల్ల శని అనుగ్రహం పొందవచ్చు.

ఆవ నూనెతో పూజ

శనిని శాంతింపజేసేందుకు ప్రాచుర్యం పొందిన మార్గాలలో ఒకటి ఆవాల నూనె లేదా నువ్వులు సమర్పించి పూజ చేయాలి. రాగి పాత్రలో ఆవాల నూనె, నువ్వులు వేసి శని తాంత్రిక మంత్రం జపించాలి.

హనుమంతుడిని పూజించాలి

హనుమంతుడికి హృద్యపూర్వకంగా పూజిస్తే వారికి శని దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. హిందూ పురాణాల ప్రకారం హనుమంతుడి రావణుడి నుంచి శనిని రక్షించాడని నమ్ముతారు. అందుకే హనుమంతుడిని పూజిస్తే శని శాంతిస్తుంది.

దానాలు చేయాలి

దాన గుణం అందరూ మెచ్చే పని. శని భగవంతుడిని ఆరాధించడానికి ఉత్తమ మార్గాలలో ఒకటి పేదవారికి దానం చేయడం. మీ పూర్వీకుల కర్మలని తొలగించుకోవడం కోసం దానాలు చేస్తే మంచిది. అందుకు ప్రతిఫలంగా ఏమి ఆశించకూడదు. స్వచ్చందంగా ఎటువంటి కల్మషం లేకుండా దానం చేసే వారిని శని దేవుడు అనుగ్రహిస్తాడు.

రావి చెట్టుని పూజించాలి

శని దేవుడి అనుగ్రహం పొందాలంటే రావి చెట్టుని పూజించాలి. ప్రతి శనివారం రావి చెట్టు కొమ్మ మీద కొంచెం ఆవాల నూనె పోసి చెట్టు చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేయాలి. సూర్యోదయానికి ముందు ఈ పూజ చేయడం మంచిది. అలాగే శని భగవానుడికి ఇష్టమైన కాకికి ఆహారం పెట్టాలి. చాలా మంది కాకిని శుభసూచికంగా భావించరు. కానీ చెడు దృష్టి పోవాలంటే కాకులకి ఆహారం పెట్టడం వల్ల మేలు జరుగుతుంది.