తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Ugadi Panchangam 2023। ఉగాది రోజు పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి?

Ugadi Panchangam 2023। ఉగాది రోజు పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి?

HT Telugu Desk HT Telugu

22 March 2023, 8:34 IST

  • Ugadi Panchangam 2023: ఉగాది రోజున ఆచరించవలసిన కార్యాలు ఏవి, ఈ పండగ రోజున పంచాగ శ్రవణం ఎందుకు విశేషమైనది, తదితర విషయాలను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

Ugadi 2023
Ugadi 2023 (Freepik/HT PIC)

Ugadi 2023

Ugadi Panchangam 2023: శ్రీ శోభకృత నామ సంవత్సరంలో బుధవారం, మార్చి 22, 2023న ఉగాది పండుగను జరుపుకుంటున్నాం. ఉగాది అనగానేమి? ఉగాది రోజున ఆచరించవలసిన కార్యాలు ఏవి, ఉగాది రోజున పంచాగ శ్రవణం ఎందుకు చేయాలి? మొదలగు అన్ని విషయాలను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

లేటెస్ట్ ఫోటోలు

మే 8, రేపటి రాశి ఫలాలు.. కొత్తగా వ్యాపారాన్ని చేపట్టాలనుకునే వారి కోరిక తీరుతుంది

May 07, 2024, 08:45 PM

Mars Transit : కుజుడి దయతో ఈ రాశులవారి జీవితాల్లో అద్భుతాలు.. విక్టరీ మీ సొంతం

May 07, 2024, 04:07 PM

Shukraditya Raja yogam 2024: శుక్రాదిత్య రాజయోగం: ఈ రాశుల వారికి ఆదాయం పెరుగుదలతో పాటు చాలా లాభాలు

May 07, 2024, 03:43 PM

ఈ రాశుల వారికి టైమ్​ వచ్చింది- భారీ ధన లభాం, ఉద్యోగంలో ప్రమోషన్​.. అనుకున్నది సాధిస్తారు!

May 07, 2024, 05:50 AM

మే 7, రేపటి రాశి ఫలాలు.. రేపు వీరికి ఆదాయం ఫుల్, మనసు ఖుషీగా ఉంటుంది

May 06, 2024, 08:31 PM

Malavya Rajyog 2024: మాలవ్య రాజయోగం: ఈ రాశుల వారికి అదృష్టం! ఆర్థిక లాభాలతో పాటు మరిన్ని ప్రయోజనాలు

May 06, 2024, 04:49 PM

చైత్ర మాస శుక్ల పక్ష పాడ్యమిని ఉగాదిగా జరుపుకుంటామని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఉగాది అనే శబ్దానికి అర్థము ఉగ అనగా నక్షత్ర ఆరంభము. ఉగ అనగా ఆయుష్షు అని అర్థాలు. ఉగాది నక్షత్ర గమనానికి ఆది అనగా నక్షత్ర గమన ప్రారంభము అని అర్థము. ఇది యుగాదిగా అనగా యుగమునకు ఆదిగా సనాతన ధర్మంలో తెలుపడమైనది. కాలానుగుణంగా ఇది ఉగాది అయినది అని చిలకమర్తి తెలిపారు.

ఉగాది రోజు ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఆచరించవలసిన అంశాలు

1. ప్రప్రథమంగా ఉదయానే లేచి ఇంటిని శుభ్రపరచుకొని మామిడి తోరణాలతో ఇంటిని అలంకరించుకోవాలి.

2. తలస్నానం ఆచరించాలి.

3. నూతన వస్త్రాలను ధరించాలి.

4. పెద్దల ఆశీస్సులు పొందాలి.

5. ఇంటి ఇలవేల్పును పూజించి ఉగాది పచ్చడిని భగవంతునికి నివేదన చేయాలి.

6. ఏదైనా నూతనంగా కార్యక్రమాన్ని ప్రారంభించుకోవాలి.

7. పంచాంగ శ్రవణం చేయాలి.

ఉగాది రోజు పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి...?

మానవ జీవితంలో కష్టసుఖాలు సహజము. అలాగే ప్రకృతిలో మార్పు సహజము. భగవంతుని గూర్చి, భగవతత్వమును గూర్చి, సృష్టి గురించి ఆలోచించే శక్తి భగవంతుడు మనుష్యులకు ఇచ్చాడు. మన సనాతన ధర్మంలో ఋషులద్వారా మానవాళికి అందినటువంటి జ్ఞానము జ్యోతిష్యము. జ్యోతిష్య శాస్త్రాన్ని శరీర భాగాలలో కళ్ళతోటి పోల్చారు. జ్యోతిష్యశాస్త్ర ఆధారంగానే మనకు పండుగలు, పర్వదినాలు, ముహూర్తాలు అనేవి ఏర్పడినవి. ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేయాలని శాస్త్రాలు తెలియచేసాయి.

మానవుడు తన జీవితంలో స్వార్థరహితంగా ఉండడం కోసం మానవుడు తను, తన కుటుంబము, సమాజం కూడా శ్రేయస్కరంగా ఉండాలని తెలియచేప్పేది పంచాంగ శ్రవణం. పంచాంగ శ్రవణంలో విశేషంగా సంవత్సర ఫలితము, ఆ సంవత్సరము ఎలా ఉండబోతుంది? దేశ పరిస్థితి ఎలా ఉంటుంది? ఆర్ధిక పరిస్థితి ఎలా ఉంటుంది? వాతావరణ పరిస్థితి ఎలా ఉంటుంది? ఎలాంటి పంటలు వేయాలి? పశు పక్ష్యాదులు సుఖంగా ఉంటాయా? మనుష్యులకు ఆరోగ్య విషయల్లో ఫలితాలు ఎలా ఉంటాయి? అనే అంశాలు పంచాంగ శ్రవణం ద్వారా తెలుస్తాయి.

ఇదే కాకుండా పంచాంగ శ్రవణం నందు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు కూడా తెలుస్తాయి. ఒక ఇంటిలో నలుగురు కావచ్చు పదిమంది కావచ్చు ఎవరైతే నివసిస్తున్నారో వారికి పంచాంగ శ్రవణం ద్వారా ఏ రాశి వారికి బాగుందో, ఏ రాశివారికి బాగోలేదో తెలుసుకోవడం వలన సంవత్సర ఫలితాలు బాగున్న రాశివారు, సంవత్సర ఫలితాలు బాగా లేని రాశి వారికి సహాయ పడడం ఈ పంచాంగ శ్రవణంలో ఉన్న అంతరార్థం.

మానవాళికి వారి జీవితంలో ఉగాదిరోజు పంచాంగ శ్రవణాన్ని చేయడం వలన మన జీవితం సమస్యాత్మక పూర్వకమైన సమయమా లేదా? శుభ సమయమా అనేది గ్రహించి ఆ సమయానుకూలంగా ప్రణాళికబద్దంగా జీవితం ముందుకు నడువాలని సూచించేదే ఉగాది పంచాంగ శ్రవణ విశేషము. మానవుని జీవితం ప్రణాళికబద్దంగా అనుకూల విధంగా కొనసాగడం కోసం పంచాంగ శ్రవణం ఉపయోగపడుతుందని జ్యోతిష్యశాస్త్రము, మహర్షులు, పెద్దలు తెలియచేశారు అని పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

- బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ,

మొబైల్: 9494981000.

 బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ