తెలుగు న్యూస్ / ఫోటో /
Shukraditya Raja yogam 2024: శుక్రాదిత్య రాజయోగం: ఈ రాశుల వారికి ఆదాయం పెరుగుదలతో పాటు చాలా లాభాలు
- Shukraditya Raja yogam 2024: సుమారు పదేళ్ల తర్వాత శుక్రాదిత్య రాజయోగం ఏర్పడుతోంది. దీనివల్ల మూడు రాశుల వారికి చాలా ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఆ వివరాలివే..
- Shukraditya Raja yogam 2024: సుమారు పదేళ్ల తర్వాత శుక్రాదిత్య రాజయోగం ఏర్పడుతోంది. దీనివల్ల మూడు రాశుల వారికి చాలా ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఆ వివరాలివే..
(1 / 5)
జ్యోతిష శాస్త్రం ప్రకారం, గ్రహాలు సంచరిస్తూ నిర్దిష్ట వ్యవధిలో స్థానాలు మారుతూ వస్తాయి. గ్రహాల సంచారం వల్ల మనుషుల జీవితాల్లో ప్రభావం కనిపిస్తుంది. శుభయోగాలు ఏర్పడతాయి. మే 14వ తేదీన వృషభ రాశిలోకి గ్రహాలకు అధిపతి అయిన సూర్యడు ప్రవేశించనున్నాడు. అలాగే, మే 19వ తేదీన వృషభ రాశిలోకి శుక్రుడు ప్రవేశిస్తాడు. ఈ కలయిక వల్ల మే 19న శుక్రాదిత్య రాజయోగం ఏర్పడనుంది.
(2 / 5)
సుమారు 10ఏళ్ల తర్వాత ఇలాంటి కలయికలో శుక్రాదిత్య రాజయోగం ఏర్పడనుంది. దీనివల్ల అన్ని రాశులపై ప్రభావం ఉన్నా… ముఖ్యంగా మూడు రాశుల వారికి చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. ఆ వివరాలివే..
(3 / 5)
వృషభం: శుక్రాదిత్య రాజయోగం వల్ల వృషభ రాశి వారికి చాలా లాభాలు కలుగుతాయి. ఈ కాలంలో వారి వ్యక్తిత్వం చాలా మెరుగుపడుతుంది. తమ వృత్తిజీవితంలో బాగా పని చేస్తారు. వారి కుటుంబంలో శాంతి, సంతోషం నెలకొంటాయి. వైవాహిక జీవితానికి కూడా అనుకూలంగా ఉంటుంది.
(4 / 5)
మిథునం: శుక్రాదిత్య రాజయోగం మిథున రాశి వారికి బాగా కలిసి వస్తుంది. వ్యాపారం చేస్తున్న వారు తమ వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు కొత్త ఒప్పందాలు దక్కించుకునే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశి వారి ఆకాంక్షలు నెరవేరుతాయి. ఈ కాలంలో ఎక్కువగా ఆర్థిక సమస్యలు ఎదురవవు. ఇతర వ్యక్తులతో మంచి బంధాలు ఏర్పడతాయి.
(5 / 5)
సింహం: జ్యోతిష శాస్త్రం మేరకు సింహ రాశి వారికి శుక్రాదిత్య రాజయోగం కాలంలో చాలా ప్రయోజనాలు దక్కుతాయి. వీరి ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు కూడా దక్కే అవకాశాలు ఉంటాయి. ఈ కాలంలో సింహ రాశి వారి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. పెట్టుబడుల్లోనూ మంచి లాభాలు రావొచ్చు. పిల్లలు ఉన్న వారు వారి నుంచి శుభవార్తలు అందుకునే అవకాశం ఉంటుంది.
ఇతర గ్యాలరీలు