Ugadi 2023: చిలకమర్తి ఉగాది పంచాంగం-ugadi 2023 panchangam made available by chilakamarthi
Telugu News  /  Andhra Pradesh  /  Ugadi 2023 Panchangam Made Available By Chilakamarthi
చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

Ugadi 2023: చిలకమర్తి ఉగాది పంచాంగం

15 March 2023, 2:00 ISTHT Telugu Desk
15 March 2023, 2:00 IST

ఇంజీనీర్‌గా సేవలు అందిస్తున్న పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది పంచాంగం-2023 అందుబాటులోకి తెచ్చారు.

ఆధ్యాత్మిక, జ్యోతిష్య రంగాలలో సనాతన ధర్మం కోసం, సమాజ హితం కోసం సేవలను అందిస్తున్న బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది పంచాంగం-2023 అందుబాటులోకి తెచ్చారు. బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ ప్రపంచ తొలి ఆంగ్ల పంచాంగకర్తగా ఆయనకు పేరుంది. ప్రభాకర శర్మ జ్యోతిష్యశాస్త్రం, పంచాంగం, ముహూర్త విధానం, నదులు, పుష్కరాలు, వాస్తు, భారతదేశ యాత్రలపై 12 పుస్తకాలు రాశారు.

చిలకమర్తి రాసిన పుస్తకాలలో చిలకమర్తి వాస్తు, గోదావరి పుష్కర వైశిష్ట్యము, నిత్య పూజా విధానము వంటివి ప్రసిద్ధి చెందాయి. చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ బి.టెక్., ఎం.టెక్., ఎం.బి.ఏ. చేసి చమురు, సహజ వాయు రంగంలో పని చేస్తున్నారు. ఆయన ఇంజనీరింగ్ చదివే సమయంలో భద్రాచల దేవస్థానం సంస్కృత పాఠశాల ద్వారా, చిత్తూరు సంస్కృత భాషా ప్రచారణి సభ ద్వారా సంస్కృతం, జ్యోతిష్య శాస్త్రం, ధర్మశాస్త్రం, సిద్ధాంత భాగము వరకు చదువుకొని విద్యాభూషణ్ పరీక్షలలో జ్యోతిష్య శాస్త్రంలో ఉత్తీర్ణత పొందారు.

భద్రాచల దేవస్థానం సంస్కృత పాఠశాల చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మను ఉత్తమ విద్యార్థిగా సత్కరించింది. చిలకమర్తి తెలుగు పంచాంగం మందపల్లి, అన్నవరం దేవస్థానాలకు పంచాంగంగా వ్యవహారంలో ఉంది. చిలకమర్తి ఆంగ్ల పంచాంగము ఉజ్జయినీ మహాకాళేశ్వరమునకు పంచాంగముగా వ్యవహారంలో ఉంది.

చిలకమర్తి వాస్తు పుస్తకాన్ని జ్ఞాన పీఠ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి ప్రశంసించి చిలకమర్తిని హైద్రాబాద్ లో సన్మానించారు. చిలకమర్తి పుస్తకాలకు దుబాయ్ వంటి దేశాలలో ఉగాది పురస్కరాలు లభించాయి. 2021వ సంవత్సరంలో చిలకమర్తి పుస్తకాలకు రాజమహేంద్రవరం నందు సాంస్కృతిక శాఖ ద్వారా పురస్కారం లభించింది.

పత్రికలు, మీడియా ద్వారా నిత్యం ఆధ్యాత్మిక బోధనలు చేస్తున్న చిలకమర్తి .. ఆయన ఆవిష్కరించిన ఉగాది పంచాంగం, ఇతర పుస్తకాలను www.chilakamarthi.com, www.southindianastrology.org వెబ్‌సైట్ల ద్వారా అందరికీ అందుబాటులో ఉంచారు. చిలకమర్తి రాసిన కృష్ణ పుష్కర వైభవం అనే పుస్తకాన్ని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజమండ్రిలో ఆవిష్కరించి ఆయనను సన్మానించారు. 2022 చిలకమర్తి పంచాంగాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఆవిష్కరించారు. 

టాపిక్