తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Surya Grahanam 2022 । స్వాతి నక్షత్రంలో సూర్యగ్రహణం.. గ్రహణ సమయం, ఫలితాలు, పరిహారాలు చూడండి!

Surya Grahanam 2022 । స్వాతి నక్షత్రంలో సూర్యగ్రహణం.. గ్రహణ సమయం, ఫలితాలు, పరిహారాలు చూడండి!

HT Telugu Desk HT Telugu

20 October 2022, 11:30 IST

    • Surya Grahanam 2022: అక్టోబర్ 25వ తేదీన సూర్యగ్రహణం (Solar Eclipse) సంభవిస్తుంది, అదే రోజున దీపావళి పండుగ ఉంది. ఈ సందర్భంగా పంచాగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ పలు పరిహారాలను వివరించారు. అవి ఇక్కడ తెలుసుకోండి.
Surya Grahanam 2022- Solar Eclipse
Surya Grahanam 2022- Solar Eclipse (Pixabay)

Surya Grahanam 2022- Solar Eclipse

Surya Grahanam 2022: ఈ ఏడాది అక్టోబర్ 25వ తేదీన సూర్యగ్రహణం సంభవిస్తుంది. అదేరోజున దీపావళి పండగ రావడంతో అందరిలో కొన్ని సందేహాలు నెలకొన్నాయి. దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి, లక్ష్మీ పూజలకు శుభముహూర్తం ఎప్పుడు అనే విషయంలో చాలా మందికి స్పష్టత లేదు. అలాగే సూర్యగ్రహణ సమయము, గ్రహణం ఎప్పుడు వీడితుంది వంటి విషయాలపైనా చర్చించుకుంటున్నారు. వీటన్నింటికి ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరణ ఇచ్చారు. అదేవిధంగా సూర్యగ్రహణం సమయంలో ఆచరించవలసిన నియమాలు, పరిహారాలు తెలిపారు. ఈ సూర్యగ్రహణం ఫలితంగా కొన్ని రాశుల వారికి ఫలితాలు మారనున్నాయి. ఆ విషయాలపైనా చిలకమర్తి చర్చించారు. అవన్నీ ఇక్కడ తెలుసుకోండి.

లేటెస్ట్ ఫోటోలు

Malavya Rajyog 2024: మాలవ్య రాజయోగం: ఈ రాశుల వారికి అదృష్టం! ఆర్థిక లాభాలతో పాటు మరిన్ని ప్రయోజనాలు

May 06, 2024, 04:49 PM

ఈ రాశుల వారికి కష్టాలు తప్పవు! ఆర్థికంగా ఇబ్బందులు- జీవితంలో ఒడుదొడుకులు..

May 06, 2024, 09:45 AM

Saturn Retrograde : శని తిరోగమనం.. వీరికి జీతాల్లో పెంపు, అన్నీ శుభవార్తలే

May 06, 2024, 08:32 AM

ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి! ఆరోగ్య సమస్యలు- భారీ డబ్బు నష్టం..

May 05, 2024, 04:07 PM

Bad Luck Rasi : ఈ రాశులవారికి కష్టకాలం, ధన నష్టం జరిగే అవకాశం.. జాగ్రత్త

May 05, 2024, 08:38 AM

అదృష్టం అంతా ఈ రాశుల వారిదే.. భారీ ధన లాభం, ఉద్యోగంలో ప్రమోషన్​!

May 04, 2024, 01:28 PM

సూర్యగ్రహణ సమయం

దృక్ సిద్ధాంత గణితం ఆధారంగా చిలకమర్తి పంచాంగం దృష్ట్యా 25 అక్టోబర్ 2022 మంగళవారం ఆశ్వయుజ మాసం బహుళ పక్ష అమావాస్య స్వాతి నక్షత్రమునందు సూర్యగ్రహణము ఏర్పడినదని ప్రముఖ పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఈ సూర్యగ్రహణము సాయంత్రం 5.01 ని.లకు ప్రారంభమయి, 6.26 ని.లకు పూర్తి అవుతుంది. గ్రహణ మధ్య కాలము సాయంత్రం గం. 5.29 ని.లు. గ్రహణ పుణ్యకాలము 1.25 ని.లు.

ఈ గ్రహణము స్వాతి నక్షత్రము నందు సంభవించుట చేత తులారాశి వారు చూడకుండా ఉండటం మంచిది. ఈ గ్రహణము సాయంత్రం సంభవించుటచేత మధ్యాహ్నం 3 నుండి రాత్రి 10 వరకు ఆహార నియములు పాటించాలి. ఈ గ్రహణ ఫలము సింహ, వృషభ, మకర, ధనుస్సు రాశుల వారికి శుభఫలితాలు. కన్య, మేష, కుంభ, మిథున రాశులకు మధ్యస్త ఫలితాలు. తుల, కర్కాటక, మీన వృశ్చిక రాశుల వారికి అశుభ ఫలితాలు కలుగజేయును.

సూర్యగ్రహణము సమయంలో తలస్నానము ఆచరించడం (పట్టు విడుపు స్నానాలు చేయడం), సూర్య ఆరాధన చేసుకోవడం. రాహు జపం, దుర్గాదేవి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను కలుగచేస్తాయి. మోక్ష సాధకులకు సూర్యగ్రహణము సమయము నందు చేసేటువంటి ధ్యానమునకు విశేషములైనటువంటి ఫలితములుంటాయి. సూర్యగ్రహణము రోజే దీపావళి పండుగ సంభవించినది. సూర్యగ్రహణము సాయంత్రం 6.30 కు పరిసమాప్తం అయిన తరువాత 7 గంటల నుండి లక్ష్మీపూజ దీపారాధన, దీపావళి పండుగను యధావిధిగా జరుపుకొనవలెను అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.