తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Negative Energy In House । ఈ సంకేతాలు గమనించారా? అయితే ఇంట్లో ప్రతికూల శక్తి ఉందని అర్థం!

Negative Energy in House । ఈ సంకేతాలు గమనించారా? అయితే ఇంట్లో ప్రతికూల శక్తి ఉందని అర్థం!

HT Telugu Desk HT Telugu

17 October 2022, 12:32 IST

google News
    • Identify Negative Energy in House: మీ ఇంట్లో మీరు ప్రశాంతంగా ఉండలేకపోతున్నారా? నిరంతరం ఏవో సమస్యలతో, అనుక్షణం భయంభయంగా గడుపుతున్నారా? లేదా జీవితం ముందుకు కదలలేకపోతుందా? ఈ సంకేతాలకు కారణమేమిటి? ఈ స్టోరీ చదివితే అర్థం అవుతుంది.
Identify Negative Energy in House, Signs
Identify Negative Energy in House, Signs (Unsplash)

Identify Negative Energy in House, Signs

మన చుట్టూ ఉండే ప్రపంచం అనేక సానుకూల, ప్రతికూల శక్తులతో నిండి ఉంది. ఉదాహరణకు మనం కొన్నిసార్లు ఏదైనా ఒక చోటుకి వెళ్లినపుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. వీలైనంత ఎక్కువ సేపు అక్కడ సమయం గడపాలనిపిస్తుంది. అదే మరికొన్ని చోట్లకు వెళ్లినపుడు అంతా బాగానే ఉంటుంది కానీ, ఏదో కళావిహీనంగా ఉన్న భావన కలుగుతుంది. అక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలనిపించదు.

దీని అర్థం, మొదట చెప్పిన చోట సానుకూల శక్తి, తదుపరి చెప్పిన చోట ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ప్రతికూల శక్తిని వెదజల్లారని కాదు. దీనికి పూర్తి బాధ్యత మనలోని అంతరాత్మే. ప్రాంతానికి తగినట్లుగా మన శరీరంలోని చక్రాలు ఎలా ప్రతిస్పందిస్తున్నాయనేది ఇక్కడ గుర్తించాలి. కాబట్టి సానుకూల శక్తి, ప్రతికూల శక్తి అనేవి రెండూ మనలోనే ఉంటాయి. మనమే ప్రతికూల శక్తుల గ్రహీతలు, ట్రాన్స్‌మిటర్‌గా మారకూడదని ఇక్కడ గుర్తుంచుకోవాలి.

సరే, మనలో ప్రతికూల శక్తులు అనేవి ఎలా బయటపడతాయి అంటే, మన ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఆ ప్రదేశంలో మనం ఆత్మన్యూనతకు గురవుతాం. అసూయ రూపంలో ప్రతికూల ఆలోచనలు, ఇతరులను విమర్శించడం, నిరంతరం కలహాలు, అతిగా తినడం లేదా అసలు తినకపోవడం, బద్ధకం, మొండితనం ఇవన్నీ మనిషిలోని ప్రతికూల శక్తులే.

ఏ మనిషైనా జీవితంలో పురోగతి సాధించాలంటే ఇలాంటి ప్రతికూల శక్తులకు దూరంగా ఉండాలి. ఇవే శక్తులు మన చుట్టుపక్కల వ్యక్తులను, పర్యావరణాన్ని ప్రభావితం చేస్తున్నాయని గమనించడం ముఖ్యం.

Identify Negative Energy in House, Signs: ఇంట్లో ప్రతికూల శక్తి ఉందనడానికి సంకేతాలు

మీకు తెలియకుండా ఆ ప్రాంతంలో చోటుచేసుకున్న కొన్ని సంఘటనలు, వాస్తు దోషాలు, చేతబడి మొదలైనవి కూడా ఆ ప్రాంత వాతావరణాన్ని ప్రతికూల శక్తితో నింపుతాయని వాస్తు నిపుణులు తెలియజేశారు. ప్రతికూల శక్తులు నిజంగా మన చుట్టూ తిరుగుతున్నాయని అర్థం చేసుకోవడానికి ఇక్కడ కొన్ని సంకేతాలు ఉన్నాయి. అవేంటో పరిశీలించండి.

  • పదేపదే అనారోగ్య సమస్యలు, పరిష్కరించలేని దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్య, చికిత్సకు సహకరించకపోవడం.
  • ఎలాంటి అవకాశాలు రాకపోవటం లేదా ఫలవంతమయ్యాయి అన్న అవకాశాలు కూడా చివరి దశలో చేజారిపోవడం.
  • అందనంత దూరంలో విజయం ఉండటం, ఆశించిన ఫలితాలు రాకపోవడం.
  • విపరీతమైన ఖర్చులు, ధన నష్టం, డబ్బు నిల్వ లేకపోవడం. .
  • ఎల్లవేళలా నీరసంగా అనిపించడం, చుట్టూ సరిపడా వనరులు, అవకాశాలు ఉన్నప్పటికీ నిరుపయోగంగా మారడం.
  • పనిలో ఏకాగ్రత, పని చేయాలనే సంకల్పం లేకపోవడం. అడుగు ముందుకు వేయటానికి చిక్కుముడులు.
  • ఎలాంటి ఆలోచనలు లేకపోవడం, 'సున్నా-స్థితి' లో ఉన్నట్లు అనిపించడం, అసౌకర్యంగా అనిపించడం.
  • పునరావృతమయ్యే ప్రతికూల ఆలోచనలు లేదా ఆత్మహత్య ఆలోచనలు.
  • కుటుంబంలోని సభ్యులు అస్థిరమైన ఆలోచనలు కలిగి ఉండటం, అహేతుకమైన లేదా అనూహ్య ప్రవర్తన.
  • కుటుంబ సభ్యుల మధ్య పదేపదే గొడవలు, తీవ్రమయ్యే భావోద్వేగాలు.
  • ఇంట్లో అశాస్త్రీయమైన లేదా కొన్ని అనుకోని సంఘటనలు జరగటం.

పైన పేర్కొన్న సంకేతాలు మీరు గమనించినట్లయితే అక్కడ ప్రతికూల శక్తి అనేది ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. అయితే ఇందుకు భయపడాల్సిన అవసరం లేదు. ప్రతీ దానికి పరిహారం అంటూ ఒకటి ఉంటుంది. ప్రతికూల శక్తిని సైతం సానుకూల శక్తిగా మార్చే యుక్తులు ఉంటాయి. ప్రతికూల శక్తి వ్యక్తిరూపంలోనే లేదా వాస్తు దోష రూపంలోనా అనేది మొదట గుర్తించాలి. అందుకు అనుగుణంగా పరిహారం చేసుకోవాలి. మీకు నచ్చిన విధంగా ప్రశాంతంగా, సౌకర్యవంతంగా ప్రదేశాన్ని మార్చుకుంటే చాలు. అన్నింటికంటే ముఖ్యంగా మీ గుండె ధైర్యం ప్రదర్శించాలి. ధైర్యవంతులను, తెలివిగల వారిని ఏ శక్తి కూడా అడ్డుకోలేదు. భయపడితే భయమే.. భయం వీడితే విజయమే.

ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీని పారద్రోలటానికి వాస్తు నిపుణులు కొన్ని చిట్కాలను తెలియజేశారు. అవి ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి. వీలైతే ఒక గురువును, నిపుణులను ఇంటికి పిలిపించి సంప్రోక్షణ చేయించండి. మీకున్న భయాలన్నీ పటాపంచలైపోతాయి అని నిపుణులు తెలియజేశారు.

టాపిక్

తదుపరి వ్యాసం