తెలుగు న్యూస్ / ఫోటో /
Diwali 2022 Dos | మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలంటే దీపావళిలోపు ఈ పనులు చేయండి!
- దీపావళి దగ్గర్లోనే ఉంది, అంతకు ముందు ధనత్రయోదశి, లక్ష్మీపూజలు కూడా ఉంటాయి. మరి లక్ష్మీదేవి ఇంటికి వస్తే ఎవరు కాదంటారు? అయితే ఇంటి శుభ్రత విషయంలో ఈ నియమాలు పాటించండి.
- దీపావళి దగ్గర్లోనే ఉంది, అంతకు ముందు ధనత్రయోదశి, లక్ష్మీపూజలు కూడా ఉంటాయి. మరి లక్ష్మీదేవి ఇంటికి వస్తే ఎవరు కాదంటారు? అయితే ఇంటి శుభ్రత విషయంలో ఈ నియమాలు పాటించండి.
(1 / 9)
దీపావళి పండుగకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇదే సమయంలో లక్ష్మీపూజలు కూడా నిర్వహిస్తారు. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం వలన ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని నమ్ముతారు. శుభ్రతకు సంబంధించి ఇంటి నుంచి కొన్ని వస్తువులను తొలగించాల్సి ఉంటుంది. అవేంటో చూడండి.
(2 / 9)
దీపావళి పండగలోపు ఇంట్లో పగిలిన అద్దం, పగిలిన గాజు వస్తువులు తీసేయాలి. పగిలిన గాజును ఉంచుకోవడం వాస్తు శాస్త్రం ప్రకారం అశుభంగా అంటారు. అలాగే విరిగిన కిటికీలు, తలుపులు సరిచేసుకోవాలి.
(3 / 9)
పాడైపోయిన ఎలక్ట్రికల్ వస్తువులు ఉంటే దీపావళికి ముందే సరిచేయండి లేదా అవసరం లేనివి ఇంటి నుంచి తొలగించేయండి.
(4 / 9)
పనిచేయని పాత గడియారాలు సరిచేయండి లేదా తొలగించి స్టోర్ రూంలో పెట్టేయండి. ఇంటి గోడపై పనిచేయని గడియారాలు పురోగతికి ఆటంకం కలిగిస్తాయి.
(5 / 9)
మీ ఇంట్లో పూజా మందిరంలో ఏదైనా విరిగిన విగ్రహం ఉంటే, దీపావళికి ముందు దానిని తొలగించండి. శాస్త్రాల ప్రకారం, విరిగిన విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం అశుభం.
(6 / 9)
ఇంటి పైకప్పు పరిశుభ్రతకు కూడా ప్రాధాన్యత ఇవ్వండి. ఇంటి పైకప్పు మురికిగా ఉండటం వల్ల ఇంటి సభ్యులు ఎల్లప్పుడూ అనారోగ్యాల బారిన పడతారని నమ్ముతారు. కాబట్టి ఇంటి పైకప్పును ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.
(7 / 9)
విరిగిన పాత్రలలో ఆహారం తినే వారికి అదృష్టం వరించదని నమ్ముతారు. అందుకే దీపావళికి ముందు ఇంట్లోని విరిగిన పాత్రలను బయటకు విసిరేయండి.
(8 / 9)
వాస్తు ప్రకారం, ఇంట్లో విరిగిన ఫర్నిచర్ ఉంచడం అశుభం. కాబట్టి మీ ఇంట్లో ఏదైనా విరిగిన ఫర్నిచర్ ఉంటే, దానిని మరమ్మతు చేయండి లేదా తొలగించండి.
సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు