Diwali Gift Ideas : ఈ గిఫ్ట్​లిచ్చి.. మీ బంధు, మిత్రులకు దీపావళి శుభాకాంక్షలు చెప్పేయండి..-diwali gift ideas for friends and family in budget ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Diwali Gift Ideas : ఈ గిఫ్ట్​లిచ్చి.. మీ బంధు, మిత్రులకు దీపావళి శుభాకాంక్షలు చెప్పేయండి..

Diwali Gift Ideas : ఈ గిఫ్ట్​లిచ్చి.. మీ బంధు, మిత్రులకు దీపావళి శుభాకాంక్షలు చెప్పేయండి..

Geddam Vijaya Madhuri HT Telugu
Oct 15, 2022 01:55 PM IST

Diwali Gift Ideas : దీపావళి అంటే గుర్తొచ్చేది టపాసులు, స్వీట్స్, గిఫ్ట్స్. పండుగ దాదాపు దగ్గర్లోనే ఉంది. అయితే మీకు ఇష్టమైనవారికి దివాళి గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకుంటే.. ఏమి బహుమతి ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారా? అయితే మీకోసమే ఇక్కడ కొన్ని గిఫ్ట్ సజెషన్స్ ఉన్నాయి. మీరు చూసి.. మీ మిత్రులకు, కుటుంబసభ్యులకు ఇచ్చేయండి.

<p>దీపావళికి ఈ గిఫ్ట్స్ ఇవ్వండి</p>
దీపావళికి ఈ గిఫ్ట్స్ ఇవ్వండి

Diwali Gift Ideas : సంవత్సరంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి దీపావళి. ఈ పండుగకి కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. మీ ఇళ్లను మెరిసే దీపాలతో అలంకరించి.. రుచికరమైన, మీకు ఇష్టమైన వంటలను తినే సమయం వచ్చింది. అంతేకాకుండా మన బంధువులు, మిత్రులు ఇచ్చే గిఫ్ట్​లకోసం కూడా ఎదురుచూస్తాము. వాళ్లు గిఫ్ట్​ల గురించి ఓకే.. మరి మీరు ఇచ్చే వాటి సంగతేంటి? అయితే మీరు గిఫ్ట్స్​ ఇవ్వడానికి.. ఇక్కడ కొన్ని సజేషన్స్ ఉన్నాయి.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆధ్యాత్మికమైన, మతపరమైనవి

మీ కుటుంబానికి ఉత్తమమైన బహుమతుల్లో ఆధ్యాత్మికమైనవి ఒకటి. మతపరమైన, ఆధ్యాత్మిక అంశాలు వారి దైనందిన జీవితంలో వారికి ఓదార్పు, బలాన్ని అందిస్తాయి. మీరు మీ కుటుంబాలకు సందర్భానుసారంగా శ్రీరాముడు, గణేశుడు, విష్ణువు, లక్ష్మి, కృష్ణుడు, దుర్గ, లేదా బుద్ధుడు వంటి దేవతల విగ్రహాలు లేదా పెయింటింగ్‌లను బహుమతిగా ఇవ్వవచ్చు. పూజ గంటలు, దీపాలు, వెండి సామాగ్రి కూడా బహుమతిగా ఇవ్వొచ్చు.

అరోమా డిఫ్యూజర్స్

దీపాల పండుగ అంటే మీ ఇంటిని శుభ్రపరచడం. రంగురంగుల రంగోలి, లైట్లతో అలంకరించడం. ఇంటిలో మంచి సుగంధ సువాసనలు వచ్చేలా చేయడం మంచిది. దీనికోసం మీరు మంచి సువాసనలు వెదజల్లే నూనె లేదా అరోమాథెరపీ డిఫ్యూజర్‌ని బహుమతిగా ఇవ్వొచ్చు. కొన్ని నూనెలు, దీపాలు, క్యాండిల్స్ రూమ్​ని మంచి అరోమాతో నింపేస్తాయి. హాయినిస్తాయి. కాబట్టి మీరు వాటిని గిఫ్ట్​గా ఇవ్వొచ్చు.

మొక్కలు

అత్యంత క్లాసిక్, పర్యావరణ అనుకూలమైన బహుమతి ఎంపికలలో ఒకటి మొక్కలు. అవి ఇండోర్​వి అయితే ఇంకా మంచిది. బహుమతిగా ఇచ్చే మొక్కలు గౌరవానికి సంకేతాన్ని సూచిస్తాయి. కాబట్టి రిసీవర్ వారి పోషణ స్వభావానికి విలువైన అనుభూతిని కలిగిస్తుంది. మీరు వారికి స్నేక్ ప్లాంట్లు, ఆర్కిడ్‌లు, మనీ ప్లాంట్లు, అలోవెరా మొదలైన ఇండోర్ మొక్కలను బహుమతిగా ఇవ్వవచ్చు.

కళాఖండాలు

కళాకృతులు చాలా వ్యక్తిగతమైనవి. మీ కుటుంబ సభ్యుల అభిరుచి, ప్రాధాన్యతలను ఇవి ప్రతిబింబిస్తాయి. కాబట్టి కళాకృతులు కుటుంబానికి గొప్ప బహుమతి ఎంపికలు. ఇవి చిరస్మరణీయమైనవి కూడా. మీరు వారికి ప్రత్యేకమైన లేదా పురాతనమైన పెయింటింగ్‌లు, పోర్ట్రెయిట్‌లు లేదా శిల్పాలను బహుమతిగా ఇవ్వవచ్చు. లేదా మీకు కళాత్మక సామర్థ్యాలు ఉంటే మీరే అసాధారణమైన వాటిని సిద్ధం చేసుకోవచ్చు.

ఇంట్లో తయారుచేసిన స్వీట్లు, చాక్లెట్లు

స్వీట్లు, చాక్లెట్లు లేకుండా దీపావళి అసంపూర్ణం అని చెప్పవచ్చు. అయితే దుకాణంలో కొనుగోలు చేసిన స్వీట్లు, చాక్లెట్లు చాలా సాధారణమైన బహుమతి ఎంపికలు. ఈ స్వీట్ ట్రీట్‌లను మీరే ఇంట్లో తయారు చేసుకుంటే.. ఈ వ్యక్తిగత టచ్ మీ కుటుంబ సభ్యులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది.

వ్యక్తిగత అవసరాలను తీర్చడానికి వారికి తక్కువ కొవ్వు, ఆరోగ్యకరమైన, చక్కెర రహిత ఎంపికలతో కొన్ని ఆర్గానిక్ టీ, ఇంట్లో తయారుచేసిన చాక్లెట్‌లు, స్వీట్లు, కుక్కీలను బహుమతిగా ఇవ్వొచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం