Festive Decor Ideas : దీపావళికి.. తక్కువ బడ్జెట్లో మీ ఇంటిని ఇలా డెకరేట్ చేయండి
Home Decor Ideas for Deepavali : పండుగల సమయంలో ఇంటిని డెకరేట్ చేసుకోవడం పెద్ద పని. ముఖ్యంగా దీపావళి సమయంలో ఇంటిని మేకోవర్ చేయాల్సిందే. ఎందుకంటే.. ఈ పండుగకి.. ఇంటిని.. పగటితోపాటు.. రాత్రికి సిద్ధం చేయాల్సి ఉంటుంది కాబట్టి. మరి దీపావళి రోజు.. మీ ఇల్లు దీపంలా మెరిసిపోవాలంటే.. ఎలాంటి డిజైన్స్, మేకోవర్ చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
Home Decor Ideas for Deepavali : దీపావళి పండుగకు ఓ ప్రత్యేకత ఉంది. అన్ని పండుగలకు పగలు అందంగా కనపించేలా ఇంటిని డెకరేట్ చేస్తే సరిపోతుంది. కానీ.. దీపావళికి మాత్రం.. రాత్రి కూడా అందంగా కనిపించేలా డెకరేట్ చేయాలి. అయితే దీవాళికి మీ ఇంటిని సిద్ధం చేయడానికి.. కొన్ని సింపుల్, ఈజీ, బడ్జెట్ ఫ్రెండ్లీ వస్తువలతో డెకరేట్ చేయడం ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.
పర్యావరణానికి అనుకూలమైన గృహాలంకరణ
సస్టైనబుల్ ఇంటీరియర్ డిజైన్ ఇప్పుడు ప్రజాదరణ పొందుతోంది. ఎందుకంటే ఇది ఇంటికి ప్రశాంతతను ఇస్తుంది. ఇవి చవకగా దొరుకుతాయి. అంతేకాకుండా సౌందర్యంగా ఉంటాయి. పర్యావరణంపై కూడా అనుకూలమైన ప్రభావాన్ని చూపుతాయి.
వెదురు వంటివి వస్తువులు.. స్థిరమైన వనరులకు ఉదాహరణలు. ఇప్పటికే ఉన్న ఫర్నిషింగ్, ఫర్నీచర్‌ను పునరుద్ధరించడం లేదా నాన్-టాక్సిక్ మెటీరియల్‌తో గోడలను పెయింటింగ్ చేయడం కూడా కొన్ని పర్యావరణ అనుకూలమైన గృహాలంకరణ ఆలోచనలు.
ప్రాక్టికల్ డెకర్ & ఫంక్షనల్ డెకర్
ఫంక్షనల్ డెకర్ మీ ఇంటికి మరింత ఆకర్షణను ఇస్తుంది. బుట్టలు, ప్లేట్లు, పాతకాలపు పాత్రలు, అద్దాలు, రగ్గులు ఆచరణాత్మక గృహాలంకరణకు ఉదాహరణలు. వైర్ లేదా నేసిన బుట్టలు నిల్వ, మంచి ఆకృతిని అందిస్తాయి. ఇవి తటస్థ, ప్రకాశవంతమైన లుక్ ఇస్తూ.. కళగా ఉంటాయి.
పాతకాలపు పాత్రలు లేదా కంటైనర్లు ఓపెన్ అల్మారాల్లో డిస్ ప్లే చేస్తే.. అవి మీ ఇంటికి డిఫరెంట్ లుక్ ఇస్తాయి. అద్దాలు గదులను ప్రకాశవంతం చేయడంతో పాటు.. సహజ కాంతిని ప్రతిబింబిస్తాయి.
మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులు
మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులు.. ఈ పండుగ సీజన్, స్థానిక ఆర్థిక వ్యవస్థ, గో దేశీకి దోహదపడతాయి. మాక్రేమ్ వాల్ ఆర్ట్, వెదురు ఫర్నిచర్, ప్లాంటర్‌లు, వికర్ ఫర్నిచర్, జ్యూట్ బ్యాగ్‌లు, షాలువాలు, కుండలు, చేతితో తయారు చేసిన గృహాలంకరణ ఉత్పత్తులకోసం స్థానిక కళాకారులు ఎంచుకోండి.ఇవి స్మాల్ బిజినెస్ వారిని ప్రోత్సాహించడానికి సహాయపడతాయి. పండుగ సమయంలో వాళ్లు హ్యాపీగా ఉంటారు.. మీరు హ్యాపీగా ఉండొచ్చు.
దీపావళి అంటేనే లైటింగ్
ఆర్ట్‌వర్క్‌ను హైలైట్ చేయడానికి సాఫ్ట్ లైటింగ్‌ని ఉపయోగిస్తే.. ఆ లుక్ చూసి.. మీరే ఆశ్చర్యపోతారు. ఇంట్లో ఏమి డెకరేట్ చేయడానికి లేకపోయినా.. లైటింగ్ పెడితే చాలు.. లేదా దీపాలు వెలిగించి.. అక్కడొకటి అక్కడొకటి పెడితే చాలు.. దీపావళి కళ ఇట్టే వచ్చేస్తుంది.
మంచి లైటింగ్ మీ ఇంటిలోని ఉత్తమమైన వాటిని హైలైట్ చేస్తుంది. వెలుగు, నీడ మీ గదిని మరింత అందంగా తీర్చిదిద్దుతాయి. ఆర్ట్‌వర్క్, బుక్‌కేస్‌లు, ఫర్నిచర్, ఆర్కిటెక్చరల్ అలంకారాలను హైలైట్ చేస్తుంది.
ఆహ్లదకరమైన సుగంధాలు
ఇంటి నుంచి వచ్చే సుగంధాలు.. పండుగ వాతవరణాన్ని రెట్టింపు చేస్తాయి. కాబట్టి మీ ఇంటిని సాంప్రదాయ, ఆహ్లాదకరమైన సువాసనలతో నింపేయండి. అగరుబత్తిలు, సాంబ్రాణీలు, సుగంధ తైలాలు, కర్పూరం, మంచి స్మెల్ ఇచ్చే క్యాండిల్స్.. మీ పండుగ వాతావరణాన్ని పదిలం చేస్తాయి.
సంబంధిత కథనం
టాపిక్