తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Us Man Jailed For 100 Years : చిన్నారి హత్య కేసులో నిందితుడికి 100ఏళ్ల జైలు శిక్ష!

US Man Jailed For 100 Years : చిన్నారి హత్య కేసులో నిందితుడికి 100ఏళ్ల జైలు శిక్ష!

Sharath Chitturi HT Telugu

26 March 2023, 14:41 IST

  • US Man Jailed For 100 Years : భారత సంతతి చిన్నారి హత్య కేసులో ఓ వ్యక్తికి 100ఏళ్ల జైలు శిక్షపడింది. 2021లో జరిగిన ఘటనకు.. బాధితురాలి కుటుంబానికి న్యాయం దక్కింది.

చిన్నారి హత్య కేసులో నిందితుడికి 100ఏళ్ల జైలు శిక్ష!
చిన్నారి హత్య కేసులో నిందితుడికి 100ఏళ్ల జైలు శిక్ష!

చిన్నారి హత్య కేసులో నిందితుడికి 100ఏళ్ల జైలు శిక్ష!

US Man Jailed For 100 Years : అమెరికాలోని లుజియానా రాష్ట్రంలో ఓ 35ఏళ్ల వ్యక్తికి 100ఏళ్లు జైలు శిక్ష పడింది. భారత సంతతి చిన్నారి హత్య కేసులో దోషిగా తేలిన అతడికి.. ఓ జిల్లా కోర్టు ఈ శిక్షను విధించింది.

ట్రెండింగ్ వార్తలు

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Criminal cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- డిజీలాకర్​ యాక్సెస్​ కోడ్స్​ విడుదల..

ఇదీ జరిగింది..

అది 2021 మార్చ్​ నెల.. విమల్​, స్నేహల్​ పటేల్​ అనే భారత సంతతి దంపతులకు మాంక్​హౌజ్​ డ్రైవ్​లో ఓ హొటల్​ ఉంది. దాని పేరు సూపర్​ 8 మోటెల్​. ఈ దంపతులకు మియా పటేల్​తో పాటు మరో సంతానం ఉంది. వీరందరు హోటల్​ గ్రౌండ్​ ఫ్లోర్​లో నివాసముండే వారు.

US crime news : కాగా.. 2021 మార్చ్​లో ష్రేవెపోర్ట్​కు చెందిన జోసేఫ్​ లీ స్మిత్​ అనే వ్యక్తి.. పటేల్​ ఉన్న హోటల్​ వద్దకు వెళ్లాడు. అక్కడి పార్కింగ్​ ఏరియాలో.. మరో వ్యక్తితో గొడవకు దిగాడు. కోపంతో ఊగిపోయిన స్మిత్​.. తన వద్ద ఉన్న తుపాకీని తీసి ఆ వ్యక్తిపై ఎక్కుపెట్టాడు. తుపాకీ కాల్చుడు. కానీ అది ఆ వ్యక్తిని తగలలేదు. బుల్లెట్​ నుంచి అతను తప్పించుకున్నాడు. ఆ బుల్లెట్ కాస్త​.. హోటల్​ గ్రౌండ్​ ఫ్లోర్​లో ఆడుకుంటున్న మియా పటేల్​ తలను తాకింది. అమె కుప్పకూలిపోయింది. ఈ ఘటన జరిగిన సమయంలో మియా పటేల్​ వయస్సు 5ఏళ్లు.

మియాను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. 3 రోజుల పోరాటం అనంతరం 2021 మార్చ్​ 23న.. మియా ప్రాణాలు విడిచింది.

100ఏళ్ల జైలు శిక్ష..

Mya Patel death news : దాదాపు మూడేళ్ల పాటు ఈ కేసుపై విచారణ జరిగింది. స్మిత్​ను దోషిగా తేలుస్తూ.. ఈ ఏడాది జనవరిలో కడ్డో పారిష్​ జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. తాజాగా శిక్షను విధించింది.

చేసిన తప్పుకు స్మిత్​ మొత్తం మీద 100ఏళ్లు జైలు శిక్షను అనుభవించనున్నాడు. ఇందులో 60ఏళ్లు కఠిన ఖారాగార శిక్ష ఉంటుంది. ఈ సమయంలో ఎలాంటి ప్రొబేషన్​, పెరోల్​, శిక్ష తగ్గింపు వంటివి చర్యలు ఉండవు.