తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rbi Repo Rate : సెన్సెక్స్ 250 పాయింట్లు అప్

RBI Repo Rate : సెన్సెక్స్ 250 పాయింట్లు అప్

HT Telugu Desk HT Telugu

08 June 2022, 10:56 IST

    • ఆర్‌బీఐ రెపో రేటు పెంచిన కొద్దిసేపటి వరకు నష్టాల్లో ట్రేడయిన స్టాక్ మార్కెట్లు తిరిగి కొద్దిసేపటికే లాభాల బాట పట్టాయి.
స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు (REUTERS)

స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు

ముంబై, జూన్ 8: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తన మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయించిన మేరకు రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచుతూ 4.9 శాతానికి పెంచింది. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు కొద్దిగా నెగెటివ్‌గా ట్రెండైనట్టు కనిపించినప్పటికీ.. కొద్దిసేపటికే లాభాల బాట పట్టాయి.

ట్రెండింగ్ వార్తలు

ICSE results 2024 : ఐసీఎస్​ఈ క్లాస్​ 10, ఐఎస్సీ క్లాస్​ 12 ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Criminal cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

ఉదయం 10.48 సమయానికి సెన్సెక్స్ 253 పాయింట్లు లాభపడి 55,316 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 65.90 పాయింట్లు బలపడి 16,482 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. 

అయితే టెలికాం, హెల్త్‌కేర్ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. జీటీఎల్ ఇన్ఫ్రా 4.83 శాతం, భారతీ ఎయిర్ టెల్ 1.17 శాతం, ఎంటీఎన్ఎల్ 0.70 శాతం నష్టపోయాయి.

హెల్త్ కేర్ సెక్టార్‌లో మెట్రోపొలిస్ ల్యాబ్ 2.65 శాతం, మాక్స్ హెల్త్ కేర్ 2.49 శాతం, ఎన్‌జీఎల్ ఫైన్ కెమ్ 1.99 శాతం నష్టపోయాయి.

టాప్ గెయినర్స్ జాబితాలో ఎస్‌బీఐ, బజాజ్ ఫైనాన్స్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, బజాజ్ ఫిన్‌సర్వ్, గ్రాసిం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, బీపీసీఎల్ తదితర స్టాక్స్ నిలిచాయి.

నష్టపోయిన స్టాక్స్ జాబితాలో యూపీఎల్, సిప్లా, రిలయన్స్, బ్రిటానియా, భారతీ ఎయిర్ టెల్, నెస్లే, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, టాటా కన్జ్యూమర్స్, మారుతీ సుజుకీ, శ్రీ సిమెంట్స్, ఎం అండ్ ఎం తదితర స్టాక్స్ ఉన్నాయి.

టాపిక్