తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rbi Monetary Policy: 0.5 శాతం వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్..

RBI Monetary Policy: 0.5 శాతం వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్..

08 June 2022, 10:05 IST

    • RBI Monetary Policy: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయాలను వెల్లడించారు. రెపో రేటును అర శాతం పెంచుతూ మానిటరీ పాలసీ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఇకపై రెపో రేటు 4.90 శాతంగా ఉండనుంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ (REUTERS)

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన మానిటరీ పాలసీ జూన్ సమీక్ష నిర్ణయాలను ప్రకటించింది. స్వల్ప కాలిక రుణాలకు గాను ఆర్‌బీఐ బ్యాంకుల వద్ద నుంచి వసూలు చేసే వడ్డీ రేటు అయిన రెపో రేటును 0.50 శాతం పెంచి 4.90 శాతంగా మార్చింది. ఊహించినదాని కంటే ఎక్కువగానే వడ్డీ రేట్లను పెంచుతూ ఆర్‌బీఐ పాలసీ కమిటీ నిర్ణయించింది. మానిటరీ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ (ఎంఎస్ఎఫ్) 5.15 శాతానికి పెంచింది. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ (ఎస్‌డీఎఫ్) ను 4.65 శాతానికి పెంచింది.

పోయిన మే నెలలో మానిటరీ పాలసీ సమీక్ష షెడ్యూలులో లేనప్పటికీ ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ అనూహ్యంగా సమావేశమైంది. రెపో రేటును 0.40 శాతం మేర పెంచింది. ఈ నేపథ్యంలో బ్యాంకులు కూడా తమ తమ వడ్డీ రేట్లను వెంటవెంటనే పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.

పెరుగుతున్న ద్రవ్యోల్భణాన్ని అదుపు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు తన మానిటరీ పాలసీని సమీక్షించి వడ్డీ రేట్లను పెంచుతుంది. కోవిడ్ కంటే ముందు ఈ రెపో రేటు 5.15 శాతంగా ఉండేది. మే నెలలో పెంపుతో 4.40 శాతంగా ఉన్న వడ్డీ రేట్లను క్రమంగా 5.15 శాతానికి పెంచుతుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

జూన్ సమీక్షతో పాటు, ఆగస్టు సమీక్షలోనూ వడ్డీ రేట్లను పెంచుతారని మెజారిటీ ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా రుణాలపై ఈఎంఐల భారం పెరుగుతుంది.

అభివృద్ధి చెందుతున్న దేశాలు తీవ్రంగా ప్రభావితం చెందాయని శక్తికాంత దాస్ ఈ ఉదయం 10 గంటలకు తన బ్రీఫింగ్‌లో వివరించారు.

మానిటరీ పాలసీ కమిటీ ఏకగ్రీవంగా రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచాలని నిర్ణయించిందని తెలిపారు.

యుద్ధ ప్రభావం, కోవిడ్ మహమ్మారి ప్రభావం నుంచి మార్కెట్లు కోలుకున్నాయని, డిమాండ్ పుంజుకుందని వివరించారు.

కోవిడ్ 19 కారణంగా దెబ్బతిన్న ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దినట్టుగానే ఎప్పటికప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మానిటరీ పాలసీ సమీక్షిస్తున్నట్టు వివరించారు.

ద్రవ్యోల్భణాన్ని అదుపులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు.

ఆర్‌బీఐ పాలసీ మానిటరీ కమిటీ (ఎంపీసీ) ఆరు, ఏడు, ఎనిమిది తేదీల్లో సమావేశమైందని వివరించారు.

ప్రస్తుత ఆర్తిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కన్జ్యూమర్స్ ప్రైస్ ఇండెక్స్ ఆధారిత ద్రవ్యోల్భణం 6.2 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ అంచనా వేసినట్టు తెలిపారు. నాలుగో త్రైమాసికంలో 5.8 శాతంగా ఉంటుందని అంచనా వేశారు.

నైరుతి రుతుపవనాల కారణంగా కురిసే సాధారణ వర్షపాతం ద్రవ్యోల్భణాన్ని క్రమంగా అదుపులో పెడుతుందన్న ఆశాభావాన్ని ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ వ్యక్తంచేసింది.

కాగా క్రెడిట్ కార్డులను యూపీఐ ప్లాట్‌ఫామ్‌లతో లింక్ చేయాలని ఆర్‌బీఐ ప్రతిపాదించింది.

అలాగే పట్టణ కో ఆపరేటివ్ బ్యాంకులు డోర్ టూ డోర్ బ్యాంకింగ్ సర్వీసులను ప్రొవైడ్ చేసేందుకు ఆర్‌బీఐ అనుమతించింది.

అలాగే గ్రామీణ కోఆపరేటివ్ బ్యాంకులు వాణిజ్యపరమైన రియల్ ఎస్టేట్ సెక్టార్‌కు రుణాలు ఇచ్చేందుకు కూడా ఆర్‌బీఐ అనుమతించింది.

కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తన వృద్ధి అంచనాలను 7.2 శాతంగా కొనసాగించింది.

టాపిక్

తదుపరి వ్యాసం