Naturals Ice Cream : నేచురల్స్ ఐస్‌క్రీమ్ వ్యవస్థాపకుడు రఘునందన్ కామత్ కన్నుమూత..
Published May 19, 2024 11:50 AM IST
Raghunandan Kamath death : ప్రముఖ నేచురల్స్ ఐస్‌క్రీమ్ వ్యవస్థాపకుడు రఘునందన్ కామత్ కన్నుమూశారు. ఆయన వయస్సు 75ఏళ్లు.
రఘునందన్ కామత్ కన్నుమూత..
Raghunandan Kamath naturals ice cream : నేచురల్స్ ఐస్‌క్రీమ్ వ్యవస్థాపకుడు రఘునందన్ కామత్ కన్నుమూశారు. ఈ విషయాన్ని.. సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది సంస్థ.
"నేచురల్స్ ఐస్ క్రీమ్ వ్యవస్థాపకుడు రఘునందన్ కామత్ కన్నుమూశారు. ఇది మాకు చాలా బాధాకరమైన విషయం. నేచురల్స్ ఫ్యామిలి," అని మ 18న ట్విట్టర్లో పోస్ట్ చేసింది సంస్థ.
75ఏళ్ల కామత్.. అనారోగ్య సమస్యల కారణంగా మే 17న మరణించినట్టు తెలుస్తోంది. ఆయనకు ఒక భార్య, కుమారులు ఉన్నారు.
నేచురల్స్ ఐస్‌క్రీమ్ వ్యవస్థాపకుడు రఘునందన్ కామత్ మరణంపై పలువు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
"ఒక గొప్ప ప్రయాణం ముగిసింది. ఐస్‌క్రీమ్ మ్యాన్ రఘునందన్ కామత్ మరణవార్త చాలా బాధ కలిగించింది," అని కర్ణాటక బీజేపీ చీఫ్ కెప్టెన్ బ్రిజేష్ చౌవ్టా తెలిపారు.
Raghunandan Kamath passed away : "ఒక బ్రాండ్‌ని నిర్మించాలని కలలు కని ముల్కీ నుంచి ముంబై వరకు వచ్చి ప్రతి ఐస్‌క్రీమ్ లవర్‌కి నేచురల్ ఛాయిస్ అయ్యారు. రఘునందన్ కామత్ జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి," చౌవ్టా అన్నారు.
ఐస్‌క్రీమ్ ఇండస్ట్రీలో రఘునందన్ కామత్ చాలా ఫేమస్. కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లా మంగళూరులోని ముల్కి అనే ప్రాంతంలో జన్మించారు. పండ్లు అమ్ముకునే తన తండ్రికి రఘునందన్ కామత్ చాలా సాయం చేసేవారు. 14ఏళ్ల వయస్సులో గ్రామాన్ని విడిచిపెట్టి.. ముంబైకి వెళ్లారు. తన సోదరుడి రెస్టారెంట్లో పనిచేశారు.
1984 ఫిబ్రవరిలో ఐస్‌క్రీమ్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు రఘునందన్ కామత్. మొదట్లో కేవలం 12 ఐస్‌క్రీమ్ ఫ్లేవర్స్‌ని మాత్రమే విక్రయించేవారు. కస్టమర్లను ఆకర్షించేందుకు.. ఐస్‌క్రీమ్‌తో పాటు పావ్బాజీని కూడా పక్కన పెట్టేవారు. ఈ స్ట్రాటజీ బంపర్ హిట్ కొట్టింది. ఆ వ్యాపారం అంచెలంచెలుగా ఎదిగింది.
Naturals ice cream Raghunandan Kamath : నేచురల్స్ ఐస్‌క్రీమ్ బిజినెస్ వృద్ధి చెందడంటో.. ఇక కేవలం ఐస్‌క్రీమ్ వ్యాపారంపైన ఫోకస్ చేయాలని ఆయన నిర్ణయించున్నారు. అందుకు తగ్గట్టుగానే బిజినెస్‌ని విస్తరించారు. ఎప్పటికప్పుడు కొత్త ప్రాడక్ట్స్‌ని తీసుకొచ్చారు. 2020 నాటికి దేశవ్యాప్తంగా 135 నేచురల్స్ ఔట్లెట్స్ ఉన్నాయి. సంస్థ వాల్యూ రూ. 400కోట్ల కన్నా ఎక్కువే!
టాపిక్