తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Wtc Points Table | టెస్టు ఛాంపియన్‌షిప్‌లో శ్రీలంక జోరు.. భారత్ ఎక్కడుందంటే?

WTC Points Table | టెస్టు ఛాంపియన్‌షిప్‌లో శ్రీలంక జోరు.. భారత్ ఎక్కడుందంటే?

27 May 2022, 18:11 IST

    • ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో శ్రీలంక జట్టు మరో స్థానాన్ని అధిగమించింది. బంగ్లాతో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 తేడాతో గెలవడంతో ఐదో స్థానం నుంచి నాలుగో స్థానానికి మెరుగుపడింది.
నాలుగో స్థానంలో శ్రీలంక
నాలుగో స్థానంలో శ్రీలంక (AFP)

నాలుగో స్థానంలో శ్రీలంక

బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను శ్రీలంక 1-0 తేడాతో విజయం సాధించింది. ఢాకాలోని షేర్ బంగ్లా స్టేడియం వేదికగా జరిగిన రెండో టెస్టులో లంక జట్టు 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరచుకుంది. ఈ విజయంతో గతంలో ఐదో స్థానంలో ఉన్న శ్రీలంక.. ఇప్పుడు నాలుగో స్థానానికి ఎగబాకింది. ఇదే సమయంలో బంగ్లాదేశ్ 8వ స్థానానికి పడిపోయింది.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

శ్రీలంక ఆడిన 6 సిరీస్‌ల్లో మూడింటిలో విజయం సాధించగా.. రెండింటిలో పరాజయం చెందింది. ఒకటి డ్రాగా తేలింది. దీంతో 55.56 శాతంతో 40 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. అన్నింటికంటే ముందు ఆస్ట్రేలియా ఐదింటిలో విజయం సాధించి 72 పాయింట్లు, 75 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. అనంతరం దక్షిణాఫ్రికా 71.43 శాతంతో రెండో స్థానంలో, 58.33 శాతంతో భారత్ మూడో స్థానంలో ఉన్నాయి.

ప్రస్తుతం ఇంగ్లాండ్ 12.50 శాతంతో అన్నింటికంటే కింది స్థానంలో ఉండగా.. బంగ్లాదేశ్ 16.67 శాతంతో కింది నుంచి రెండో స్థానం అంటే 8వ స్థానంలో నిలిచింది. పాకిస్థాన్ 52.38 శాతంతో ఐదో స్థానంలో ఉండగా.. 38.89 శాతంతో న్యూజిలాండ్ ఆరు, 35.71 శాతంతో వెస్టిండీస్ 7వ స్థానాల్లో నిలిచాయి.

ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా మొదటి ఇన్నింగ్స్‌లో 365 పరుగులకు ఆలౌట్ కాగా.. అనంతరం శ్రీలంక 506 పరుగుల భారీస్కోరు చేసింది. మ్యాథ్యూస్(145), చండీమల్(124) శతకాలతో విజృంభిచగా.. కెప్టెన్ కరుణరత్నే(80), ఓషాడా ఫెర్నాండో(57) ఆకట్టుకున్నారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 169 పరుగులకే ఆలౌట్ కాగా.. మిగిలిన 29 పరుగుల లక్ష్యాన్ని వికెట్లేమి పడకుండా లంక జట్టు ఛేదించింది.

టాపిక్

తదుపరి వ్యాసం