తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Hari Prasad S HT Telugu

08 May 2024, 15:44 IST

    • Neeraj Chopra: ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ గెలిచిన తర్వాత తొలిసారి ఇండియాలో సొంత ప్రేక్షకుల ముందు తలపడబోతున్నాడు. ఒడిశాలో జరగబోయే నేషనల్ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ పోటీల్లో అతడు పాల్గొననున్నాడు.
ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్
ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Neeraj Chopra: నీరజ్ చోప్రా గుర్తున్నాడు కదా.. టోక్యో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ గెలిచాడు. ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్ లో గోల్డ్ మెడల్ గెలిచిన తొలి ఇండియన్ అథ్లెట్ గా చరిత్ర సృష్టించాతడు. ఇది జరిగి మూడేళ్లు అవుతోంది. కానీ ఇంత వరకూ నీరజ్.. ఇండియాలో మాత్రం జావెలిన్ విసరలేదు. మొత్తానికి ఇన్నాళ్లకు భారత అభిమానుల ఆకాంక్షలు ఫలించనున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

ఇండియాలో నీరజ్ చోప్రా కాంపిటిషన్

జావెలిన్ త్రోయర్ అయిన నీరజ్ చోప్రా 2021లో టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ గెలిచాడు. అయితే ఈ మూడేళ్లలో అతడు ఎప్పుడూ ఇండియాలో ఆడలేకపోయాడు. అయితే ఇప్పుడు ఆదివారం (మే 12) నుంచి ఒడిశాలో జరగబోతున్న నేషనల్ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ కాంపిటీషన్స్ లో నీరజ్ పాల్గొననున్నాడు. మే 12 నుంచి 15 వరకు ఈ ఈవెంట్స్ జరగనున్నాయి.

ఈ సీజన్ డైమండ్ లీగ్ సిరీస్ లో నీరజ్ చోప్రాకు ఇదే తొలి కాంపిటిషన్ కానుంది. ప్రస్తుతం దోహాలో ఉన్న నీరజ్.. ఇందులో పాల్గొనడానికి శుక్రవారం (మే 10) ఇండియాకు రానున్నాడు. భువనేశ్వర్ లోని కళింగ స్టేడియంలో ఈ నేషనల్ ఫెడరేషన్ కప్ జరగనుంది. 2021లోనూ చివరిసారి ఇదే ఫెడరేషన్ కప్ లో పాల్గొన్న నీరజ్.. మళ్లీ ఇన్నాళ్లకు సొంత ప్రేక్షకుల ముందు తలపడబోతున్నాడు.

నీరజ్ చోప్రాతోపాటు కిశోర్ కుమార్ జేనా ఇందులో పాల్గొనబోతున్నట్లు అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ట్వీట్ చేసింది. జులై 26 నుంచే పారిస్ ఒలింపిక్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో నీరజ్ చోప్రా ఆలోపే సాధ్యమైనంత ఎక్కువ ప్రాక్టీస్ చేయాలని భావిస్తున్నాడు.

టార్గెట్ పారిస్ ఒలింపిక్స్

"పారిస్ ఒలింపిక్స్ కోసం నేను సాధ్యమైనంత సిద్ధంగా ఉండాలని భావిస్తున్నాను. ట్రైనింగ్ సెషన్లు బాగా నడుస్తున్నాయి. స్ట్రెంత్, టెక్నిక్ తోపాటు ఫిట్‌నెస్ పైనా దృష్టి సారిస్తాను. చాలా కాలం తర్వాత చాలా బాగా ఉన్నానని అనిపిస్తోంది. అయితే ట్రైనింగ్, కాంపిటీషన్స్ రెండూ వేర్వేరు. అందుకే ఇందులో పాల్గొంటున్నాను. ఇండియా జెర్సీ వేసుకుంటే ఆ జోష్ వేరుగా ఉంటుంది" అని నీరజ్ చోప్రా అన్నాడు.

టోక్యో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్, తర్వాత కూడా పలు కాంపిటీషన్స్ లో రాణించినా.. నీరజ్ ఇప్పటికీ 90 మీటర్ల మార్క్ మాత్రం అందుకోలేకపోయాడు. అయితే దూరాన్ని తాను పెద్దగా పట్టించుకోనని అతడు చెబుతున్నాడు. "100 శాతం ఫిట్ గా ఉండటంపైనే దృష్టి సారిస్తాను. సీజన్ మొత్తం నిలకడగా రాణిస్తూ ఆ రోజు లక్ష్యాన్ని చేరుకోవడమే ముఖ్యం. కొన్ని తప్పిదాలను ఇంకా సరి చేసుకోవాల్సి ఉంది" అని నీరజ్ అన్నాడు.

నీరజ్ చోప్రా వ్యక్తిగత బెస్ట్ 89.94 మీటర్లుగా ఉంది. స్టాక్‌హోమ్ లో ఈ ఘనత సాధించాడు. ఇప్పటికే రెండు వరల్డ్ ఛాంపియన్షిప్స్ లో మెడల్స్ సాధించాడు. డైమండ్ లీగ్ టైటిల్ కూడా సొంతం చేసుకున్నాడు. ఇవన్నీ పారిస్ ఒలింపిక్స్ కు ముందు నీరజ్ ఆత్మవిశ్వాసాన్ని పెంచేవే. టోక్యోలో గెలిచిన గోల్డ్ మెడల్ ను డిఫెండ్ చేసుకోవడానికి పారిస్ ఒలింపిక్స్ బరిలో నీరజ్ దిగబోతున్నాడు.

తదుపరి వ్యాసం