Neeraj Chopra: రీఎంట్రీలో అదరగొట్టిన నీరజ్ చోప్రా - లుసానే డైమండ్ లీగ్‌లో గోల్డ్ మెడల్ సొంతం
Neeraj Chopra: రీఎంట్రీలో ఒలింపిక్ విన్నర్ నీరజ్ చోప్రా అదరగొట్టాడు. లుసానే డైమంగ్ లీగ్‌లో గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నాడు

Neeraj Chopra: గాయం కారణంగా కొంత కాలంగా జావెలిన్ త్రోకు దూరంగా ఉన్న ఒలింపిక్ విన్నర్ నీరజ్ చోప్రా రీఎంట్రీలో అదరగొట్టాడు. లుసానే డైమండ్ లీగ్‌లో గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నాడు. ఈ టోర్నీలో 87.66 మీటర్లు జావెలిన్ విసిరి తొలి స్థానంలో నిలిచాడు నీరజ్ చోప్రా. తొలి ప్రయత్నంలో నీరజ్ విఫలం కావడంతో అభిమానుల్లో టెన్షన్ మొదలైంది.
రెండు, మూడో ప్రయత్నాల్లో 85 మీటర్ల దూరం అందుకోవడంతో పతాకం ఆశలు మినుకుమినుకుమన్నాయి. నాలుగో ప్రయత్నంలో తడబడిన నీరజ్ లాస్ట్ ఛాన్స్‌లో పట్టుదలగా ప్రయత్నించి 87.66 మీటర్లు జావెలిన్‌ను విసిరి టాప్ ప్లేస్‌లోకి దూసుకెళ్లాడు. మిగిలిన ప్లేయర్స్‌కు అందనంత దూరంలో నిలిచి పతకాన్నిగోల్డ్ మెడల్ ఖాయం చేశాడు.
నీరజ్‌కు జర్మన్ ప్లేయర్ వెబర్ గట్టి పోటీ ఇచ్చాడు. నీరజ్‌కు దాటేందుకు చాలా ప్రయత్నించిన వెబర్ చివరకు 87.03 మీటర్లతో సెకండ్ ప్లేస్‌లో నిలిచాడు. చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాక్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
లుసానే డైమండ్ లీగ్‌లో అద్భుత ప్రదర్శనతో వచ్చే ఏడాది జరుగనున్న ఆసియా కప్‌తో పాటు వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ పతక ఆశలను నిలబెట్టాడు నీరజ్ చోప్రా. ఆగస్ట్‌లో బుడాపెస్ట్, సెప్టెంబర్‌లో ఆసియాడ్ గేమ్స్‌లో శిక్షణ కోసం త్వరలోనే జర్మనీ వెళ్లనున్నాడు నీరజ్ చోప్రా. ఇందుకోసం అవసరమైన నిధులను ఒలింపిక్ అసోసియేషన్ మంజూరు చేసింది.
టాపిక్