తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Russian Soldiers In Ukraine : ఉక్రెయిన్​లో అష్టకష్టాలు పడుతున్న రష్యన్​ సైనికులు!

Russian soldiers in Ukraine : ఉక్రెయిన్​లో అష్టకష్టాలు పడుతున్న రష్యన్​ సైనికులు!

23 October 2022, 15:17 IST

  • Russian soldiers in Ukraine : ఉక్రెయిన్​లో ఉన్న రష్యన్​ సైనికుల పరిస్థితి దయనీయంగా మారింది. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ఉక్రెయిన్​లో అష్టకష్టాలు పడుతున్న రష్యన్​ సైనికులు
ఉక్రెయిన్​లో అష్టకష్టాలు పడుతున్న రష్యన్​ సైనికులు (AP)

ఉక్రెయిన్​లో అష్టకష్టాలు పడుతున్న రష్యన్​ సైనికులు

Russian soldiers in Ukraine : రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్​ సైనికుల కన్నీటి గాథలు ఎన్నో.. ప్రపంచ దేశాలు విన్నారు. వారి బాధను ప్రజలు అర్థం చేసుకున్నారు. అయితే.. రష్యన్​ సైనికుల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది! వారి కష్టాలను తెలియజేసే విధంగా తాజాగా ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. ఉక్రెయిన్​లో జీవించేందుకు సౌకర్యాలు లేకపోవడంతో.. కొందరు రష్యన్​ సైనికులు గుంతలు తవ్వుకున్నారు. అది కూడా చేతులతో!

ట్రెండింగ్ వార్తలు

Criminal cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- డిజీలాకర్​ యాక్సెస్​ కోడ్స్​ విడుదల..

Chardham Yatra 2024: చార్ ధామ్ యాత్రకు ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యే తేదీ ఇదే; ఆన్ లైన్ లో కూడా చేసుకోవచ్చు

ఏం జరిగిందంటే..

ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. వీడియోలో కొందరు రష్యన్​ సైనికులు ఉన్నారు. వారిలో ఒకరు తమ బాధను వెల్లడించారు.

Rusia Ukraine "మమ్మల్ని ఒక ప్రదేశం నుంచి మరో చోటకు తీసుకొచ్చారు. అసలు మేము ఎక్కడ ఉన్నామో కూడా మాకు తెలియదు. రోజుకు రెండుసార్లు వచ్చి ఫుడ్​ పెడుతున్నారు. మాకు ఆయుధాలు ఇవ్వలేదు. మాకు ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేదు. మమ్మల్ని కుక్కలా చూస్తున్నారు," అని ఓ రష్యన్​ సైనికుడు చెప్పాడు.

ఉక్రెయిన్​లో రాత్రి వేళ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ఈ తరుణంలో ఈ సైనికులకు బ్రతకడం మరింత కష్టంగా మారింది!

"మమ్మల్ని ఎక్కడో పొలాల్లో పడేశారు. సమాచారం లేదు. అలా కూర్చుని ఉంటున్నాము అంతే. మా వాళ్లు ఎవరో, శత్రువులు ఎవరో మాకు తెలియడం లేదు. రేడియో లేదు, శృంగారం లేదు," అని ఓ సైనికుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

"మాకు షెల్టర్​ లేదు. గుంతలు తవ్వుకుని బ్రతుకుతున్నాము. చేతులతో తవ్వుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు," అని ఓ సైనికుడు పేర్కొన్నాడు.

పుతిన్​పై విమర్శలు..

Putin Russia Ukraine war : ప్రజలు కూడా యుద్ధంలో పాల్గొనాలని ఇచ్చిన పిలుపుపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​పై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక తాజా వీడియోతో ఆ విమర్శలు మరింత పెరిగాయి. సొంత ప్రజలను కూడా పుతిన్​ లెక్కచేయడం లేదని, పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

2022 ఫిబ్రవరిలో మొదలైన రష్యా ఉక్రెయిన్​ యుద్ధం. ఇంకా కొనసాగుతోంది. శీతాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పరిస్థితులు ఇరు వర్గాలకు మరింత ప్రతికూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. కానీ ఉక్రెయిన్​లో ఎక్కడా శాంతి కనిపించడం లేదు. నిత్యం మిసైళ్లు, రాకెట్లతో దాడి చేస్తూనే ఉంది రష్యా. యుద్ధాన్ని ముగించే యోచనలో పుతిన్​ లేనట్టు, ఆయన మాటల్లో స్పష్టమవుతోంది.

యుద్ధాన్ని ఆపేయాలని భారత్​ కూడా పుతిన్​కు చెబుతూ వస్తోంది. శాంతికి సాయం చేస్తామని సైతం ముందుకొచ్చింది. కానీ ఇంకా ఎలాంటి ఫలితం దక్కలేదు.