Russia warns about World War III: ‘అలా అయితే, మూడో ప్రపంచ యుద్ధమే’
13 October 2022, 17:52 IST
- Russia warns about World War III: రష్యా, ఉక్రెయిన యుద్ధం క్రమంగా మూడో ప్రపంచ యుద్ధం దిశగా వెళ్తోందనే సంకేతాలు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ, రష్యా అధ్యక్షుడు పుతిన్
Russia warns about World War III: రష్యా, ఉక్రెయిన్ సంక్షోభంలో ఇటీవల చోటు చేసుకున్న పలు పరిణామాలు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేశాయి. ఉక్రెయిన్ తీరు, ఆ దేశానికి పశ్చిమ దేశాలు ఇస్తున్న మద్దతు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని రష్యా హెచ్చరించింది.
Russia warns about World War III: నాటోలో చేర్చుకోండి..
ఉక్రెయిన్ నుంచి స్వాధీనం చేసుకున్న నాలుగు ప్రాంతాలను అధికారికంగా రష్యాలో విలీనం చేసుకుంటూ పుతిన్ ఈ మధ్య ఒక ఒప్పందం చేసుకున్నారు. దాంతో, వెంటనే స్పందించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తమ దేశాన్ని సాధ్యమైనంత త్వరగా నాటో (North Atlantic Treaty Organization NATO)లో చేర్చుకోవాలని, ఆ ప్రక్రియను వేగవంతం చేయాలని సెప్టెంబర్ నెల చివరలో అభ్యర్థించారు.
Russia warns about World War III: రష్యా సీరియస్..
ఉక్రెయిన్ ను నాటో లో చేర్చుకుంటే మూడో ప్రపంచ యుద్ధం తప్పదని రష్యా హెచ్చరించింది. అలా జరిగితే, ఆ బాధ్యత పశ్చిమ దేశాలదేనని స్పష్టం చేసింది. రష్యాను రెచ్చగొట్టే చర్యగా దాన్ని భావిస్తామని తేల్చి చెప్పింది. నాటో లో ఉక్రెయిన్ చేరితే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందనే విషయం ఉక్రెయిన్ ను బాగా తెలుసని వ్యాఖ్యానించింది.
Russia warns about World War III: పశ్చిమ దేశాల జోక్యం
నాటోలో ఉక్రెయిన్ ను చేర్చుకోవడం అంటే పశ్చిమ దేశాలు రష్యా, ఉక్రెయిన్ సంక్షోభంలో ప్రతక్షంగా జోక్యం చేసుకున్నట్లుగానే భావిస్తామని రష్యా తేల్చి చెప్పింది. ఇప్పటికే అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తదితర దేశాలు ఉక్రెయిన్ కు ఆధునిక ఆయధ వ్యవస్థలను అందించడం ద్వారా పరోక్షంగా సాయపడుతున్నాయి.