Attack on Russian military base : రష్యా సైనిక శిబిరంపై దాడి.. భారీగా మృతుల సంఖ్య!-attack on russian military base kills 11 in new blow to moscow s ukraine campaign ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Attack On Russian Military Base Kills 11 In New Blow To Moscow's Ukraine Campaign

Attack on Russian military base : రష్యా సైనిక శిబిరంపై దాడి.. భారీగా మృతుల సంఖ్య!

Sharath Chitturi HT Telugu
Oct 16, 2022 03:09 PM IST

Attack on Russian military base : ఉక్రెయిన్​కు సరిహద్దులో ఉన్న రష్యా సైనిక శిబిరంపై దాడి జరిగింది. ఇద్దరు వ్యక్తులు.. భారీ ఆయుధాలతో కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో అనేకమంది సైనికులు మరణించారు.

రష్యా సైనిక శిబిరంపై దాడి..
రష్యా సైనిక శిబిరంపై దాడి.. (AP/file)

Attack on Russian army base : రష్యా ఉక్రెయిన్​ యుద్ధం నేపథ్యంలో వ్లాదిమిర్​ పుతిన్​కు భారీ షాక్​! రష్యా సైనిక శిబిరంపై జరిగిన దాడిలో 11మంది సైనికులు మృతిచెందారు. అనేకమంది గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని, ప్రభుత్వం దానిని దాచుతున్నట్టు మీడియా కథనాలు వెలువడ్డాయి.

ట్రెండింగ్ వార్తలు

ఏం జరిగింది..?

రష్యాలో ఉక్రెయిన్​కు సరిహద్దు ప్రాంతమైన బెల్గొరాడ్​లో శనివారం జరిగింది ఈ ఘటన. ఇద్దరు వ్యక్తులు.. భారీ ఆయుధాలతో సైనిక శిబిరంవైపు దూసుకెళ్లారు. అక్కడ శిక్షణ పొందుతున్న వారిపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 15మంది గాయపడినట్టు రష్యా పేర్కొంది.

Attack on Russian Army base : ఉక్రెయిన్​పై యుద్ధంలో పాల్గొనాలని కొన్ని రోజుల క్రితం పౌరులకు పిలుపునిచ్చారు రష్యా అధ్యక్షుడు పుతిన్​. ఈ నేపథ్యంలో కొందరు బెల్గొరాడ్​లో శిక్షణ తీసుకుంటున్నారు. వారిపై దాడి జరగడం గమనార్హం.

దాడికి పాల్పడిన వారి వివరాలు, వారు ఎక్కడి నుంచి వచ్చారు? అన్న విషయాలు తెలియలేదు. కాగా వారిని అధికారులు అక్కడికక్కడే కాల్చి చంపేశారు.

"మన సరిహద్దులో భయానక ఘటన చోటుచేసుకుంది. మిలిటరీ శిబిరంపై దాడి జరిగింది. సైనికులు చాలా మంది మరణించారు. చాలా మంది గాయపడ్డారు. కాగా ఈ ఘటనలో పౌరులు ఎవరూ మరణించలేదు. వారికి గాయాలు కాలేదు," అని బెల్గొరాడ్​ ప్రాంత గవర్నర్​ గ్లాడ్కోవ్​ ఆదివారం ఓ ప్రకటన చేశారు.

రష్యా ఉక్రెయిన్​ మధ్య ఉద్రిక్త వాతావరణం ఇటీవలి కాలంలో మళ్లీ పెరిగింది. క్రిమియా వంతెన ధ్వంసం ఘటనతో ఉద్రిక్తత తీవ్రమైంది. అందుకు ప్రతీకారంగా.. ఉక్రెయిన్​లోని కీలక నగరాలపై మిసైల్​ దాడులతో విరుచుకుపడింది రష్యా. ఇవి జరిగిన వారం రోజుల వ్యవధిలోనే రష్యా మిలిటరీ శిబిరంపై దాడి జరగడంతో పరిస్థితులు మరింత ప్రతికూలంగా మారాయి.

రష్యా ఉక్రెయిన్​ యుద్ధం..

Russia Ukraine war latest news : యుద్ధంలో శాంతి మాటలు కనిపించడం లేదు! ఆదివారం ఉదయం నాటికి 24 గంటల వ్యవధిలో ఉక్రెయిన్​లోని 30 పట్టణాలు, అనేక గ్రామాలను లక్ష్యంగా చేసుకున్న రష్యా.. ఐదు మిసైళ్లతో దాడి చేసింది. 23 వాయు దాడులు చేసింది. 60 రాకెట్లను ప్రయోగించింది! ఈ వివరాలను ఉక్రెయిన్​ దళాలు ఆదివారం వెల్లడించాయి.

ఇందుకు ఉక్రెయిన్​ కూడా ప్రతిఘటించింది. 24 రష్యాన్ టార్గెట్లపై 32సార్లు దాడులు చేసినట్టు ఉక్రెయిన్​ వాయుసేన ప్రకటించింది.

డానెస్క్​, లుషన్​స్క్​ ప్రాంతాల్లో యుద్ధం తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో అనేక భవనాలు ధ్వంసమయ్యాయి.

ఇరు దేశాల మధ్య ఉద్రిక్తలను తగ్గించేందుకు భారత్​ తన వంతు కృషిచేస్తోంది. శాంతికి సాయం చేస్తామని ఇప్పటికే పలుమార్లు ముందుకొచ్చింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం