తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Nasa Postpones Artemis 1 Launch : ఆర్టెమిస్​- 1 లాంచ్​ ఎందుకు వాయిదా పడింది?

NASA Postpones Artemis 1 launch : ఆర్టెమిస్​- 1 లాంచ్​ ఎందుకు వాయిదా పడింది?

Sharath Chitturi HT Telugu

29 August 2022, 19:04 IST

    • NASA Postpones Artemis 1 launch : నాసా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆర్టెమిస్​ 1 లాంచ్​ చివరి నిమిషంలో నిలిచిపోయింది. ఇందుకు గల కారణాలను నాసా వివరించింది.
ఆర్టెమిస్​- 1 లాంచ్​ సైట్​..
ఆర్టెమిస్​- 1 లాంచ్​ సైట్​.. (REUTERS)

ఆర్టెమిస్​- 1 లాంచ్​ సైట్​..

NASA Postpones Artemis I launch : చంద్రుడిపైకి రాకెట్​ను పంపించేందుకు నాసా చేపట్టిన అతిపెద్ద మిషన్​ 'ఆర్టెమిస్​-1' లాంచ్.. చివరి నిమిషంలో అనూహ్యంగా రద్దు అయ్యింది. రాకెట్​లో ఉన్న నాలుగు ఆర్​ఎస్​-25 ఇంజిన్లలోని ఒక దానిలో సమస్య ఏర్పడిన కారణంగా.. లాంచ్​ను వాయిదా వేస్తున్నట్టు నాసా పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు

Cricket ball : జననాంగాలకు క్రికెట్​ బాల్​ తాకి.. 11ఏళ్ల బాలుడు మృతి!

Houston floods : టెక్సాస్​- హూస్టన్​ని ముంచెత్తిన వరద.. భయం గుప్పిట్లో ప్రజలు

ICSE results 2024 : ఐసీఎస్​ఈ క్లాస్​ 10, ఐఎస్సీ క్లాస్​ 12 ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

ఈ మానవరహిత రాకెట్​ లాంచ్​ను సెప్టెంబర్​ 2, 5వ తేదీల్లో నిర్వహించే అవకాశం ఉంది.

"ఈరోజు ఆర్టెమిస్​ 1 లాంచ్​ జరగడం లేదు. ఇంజిన్​లో సమస్య ఎదురవడమే ఇందుకు కారణం. మా బృందాలు డేటాను సేకరించే పనిలో పడ్డాయి. తదుపరి లాంచ్​ గురించి మీకు మళ్లీ చెబుతాము," అని నాసా ట్వీట్​ చేసింది.

<p>లాంచ్​ సైట్​</p>

రాకెట్​ లాంచ్​కి 40 నిమిషాల ముందు.. కోర్​ ఫ్యూయెల్​ ట్యాంక్​లోకి సూపర్​ కూల్డ్​ లిక్విడ్​ ఆక్సిజన్​- హైడ్రోజన్​ ప్రొపెలెంట్స్​ని నింపడం మొదలుపెట్టారు. లాంచ్​కి ముందు ఇంజిన్లలో సరైన ఉష్ణోగ్రతలు మెయింటైన్​ చేయాల్సి ఉంది. ఆ సమయంలోనే నాలుగు ఆర్​ఎస్​-25 ఇంజిన్లలోని ఒక దాంట్లో ఇంధనం లీక్​ని గమనించారు. కావాల్సిన ఉష్ణోగ్రతను ఆ ఇంజిన్​ అందుకోలేకపోయింది. ఫలితంగా ఆర్టెమిస్​ 1 లాంచ్​ నిలిచిపోయింది.

Artemis I Nasa : ఫ్లోరిడాలోని కెనెడి స్పేస్​ సెంటర్​లో ఈ ఆర్టెమిస్​ 1 లాంచ్​ జరగాల్సి ఉంది. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్​తో పాటు వేలాది మంది.. అక్కడికి తరలివెళ్లారు. అతి పెద్ద రాకెట్​ లాంచ్​ను చూసేందుకు సిద్ధపడ్డారు. కానీ చివరి నిమిషంలో రాకెట్​ ప్రయోగం నిలిచిపోయింది.

చంద్రుడిపై నాసా ఓ మిషన్​ చేపట్టడం 50ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. చివరిగా 50ఏళ్ల క్రితం.. అపోలో 17తో వ్యోమగాములు చంద్రుడిపై అడుగుపెట్టారు.

<p>ఆర్టెమిస్​ 1 లాంచ్​ వాయిదా</p>