తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Moon Facts | చంద్రుడి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు!

Moon Facts | చంద్రుడి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు!

16 August 2022, 22:46 IST

ఆకాశంలో రాత్రి పూట చల్లని వెన్నెలను కురిపించే చందమామ మనల్ని ఎంతగానో ఆకర్షిస్తాడు. భూమికి ఉన్న ఏకైక ఉపగ్రహం చంద్రుడే. భూమిలో పావు వంతు పరిమాణంలో ఉండే చంద్రుడు, మనకు సుమారు 2,38,855 మైళ్ల దూరంలో ఉన్నాడు. చంద్రుని గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ తెలుసుకోండి.

ఆకాశంలో రాత్రి పూట చల్లని వెన్నెలను కురిపించే చందమామ మనల్ని ఎంతగానో ఆకర్షిస్తాడు. భూమికి ఉన్న ఏకైక ఉపగ్రహం చంద్రుడే. భూమిలో పావు వంతు పరిమాణంలో ఉండే చంద్రుడు, మనకు సుమారు 2,38,855 మైళ్ల దూరంలో ఉన్నాడు. చంద్రుని గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ తెలుసుకోండి.

చంద్రుడు ఎలా ఏర్పడ్డాడు? NASA అందించిన సమాచారం ప్రకారం, చంద్రుడు ఏర్పడటానికి వెనుక ఉన్న ప్రధాన కారణం ఏమిటంటే, బిలియన్ల సంవత్సరాల క్రితం అంగారక గ్రహం పరిమాణంలో ఉన్న వస్తువు భూమిని బలంగా ఢీకొట్టింది. ఈ తాకిడి నుంచి వెలువడిన శిథిలాలు చివరికి చంద్రుడిని ఏర్పర్చాయి.
(1 / 6)
చంద్రుడు ఎలా ఏర్పడ్డాడు? NASA అందించిన సమాచారం ప్రకారం, చంద్రుడు ఏర్పడటానికి వెనుక ఉన్న ప్రధాన కారణం ఏమిటంటే, బిలియన్ల సంవత్సరాల క్రితం అంగారక గ్రహం పరిమాణంలో ఉన్న వస్తువు భూమిని బలంగా ఢీకొట్టింది. ఈ తాకిడి నుంచి వెలువడిన శిథిలాలు చివరికి చంద్రుడిని ఏర్పర్చాయి.(NASA)
చంద్రుని భ్రమణం: చంద్రుడు తన అక్షం మీద ఒకసారి తిరిగేందుకు పట్టే సమయం, భూమి చుట్టూ ఒకసారి తిరిగేందుకు పట్టే సమయానికి సమానం. అందువల్ల నెల పొడవునా చంద్రుని ఒక వైపు మాత్రమే భూమికి ఎదురుగా కనిపిస్తుంది.
(2 / 6)
చంద్రుని భ్రమణం: చంద్రుడు తన అక్షం మీద ఒకసారి తిరిగేందుకు పట్టే సమయం, భూమి చుట్టూ ఒకసారి తిరిగేందుకు పట్టే సమయానికి సమానం. అందువల్ల నెల పొడవునా చంద్రుని ఒక వైపు మాత్రమే భూమికి ఎదురుగా కనిపిస్తుంది.(NASA)
NASA ప్రకారం, చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి దాదాపు ఒక నెల పడుతుంది. ఒక ఆర్బిట్ పూర్తి చేయడానికి 27.3 రోజులు, కానీ అమావాస్య నుండి అమావాస్యకు మారడానికి 29.5 రోజులు పడుతుంది.
(3 / 6)
NASA ప్రకారం, చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి దాదాపు ఒక నెల పడుతుంది. ఒక ఆర్బిట్ పూర్తి చేయడానికి 27.3 రోజులు, కానీ అమావాస్య నుండి అమావాస్యకు మారడానికి 29.5 రోజులు పడుతుంది.(NASA)
చంద్రుడికి గురుత్వాకర్షణ శక్తి ఉందా? అంటే కచ్చితంగా ఉంది. అయితే చంద్రుడు భూమి కంటే తక్కువ ద్రవ్యరాశి కలిగి ఉన్నందున, దాని గురుత్వాకర్షణ శక్తి బలహీనంగా ఉంటుంది. సుమారుగా భూమిలో ఆరవ వంతు మాత్రమే ఉంటుంది. ఈ కారణంగా భూమిపై దూకటంతో పోలిస్తే చంద్రునిపై ఆరు రెట్లు ఎక్కువ ఎత్తుకు దూకగలరు అని NASA తెలియజేసింది. అలాగే, చంద్రుడు లేకపోతే, భూమి చాలా భిన్నమైన ప్రపంచం అవుతుంది. చంద్రుని గురుత్వాకర్షణ మన గ్రహం దాని అక్షం మీద ఎక్కువగా కదలకుండా చేస్తుంది, ఇది మన వాతావరణాన్ని స్థిరీకరించడానికి సహాయపడుతుంది. భూమిపై ఉన్న మహాసముద్రాలలో ఆటుపోట్లు సృష్టించడంలో చంద్రుడు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు.
(4 / 6)
చంద్రుడికి గురుత్వాకర్షణ శక్తి ఉందా? అంటే కచ్చితంగా ఉంది. అయితే చంద్రుడు భూమి కంటే తక్కువ ద్రవ్యరాశి కలిగి ఉన్నందున, దాని గురుత్వాకర్షణ శక్తి బలహీనంగా ఉంటుంది. సుమారుగా భూమిలో ఆరవ వంతు మాత్రమే ఉంటుంది. ఈ కారణంగా భూమిపై దూకటంతో పోలిస్తే చంద్రునిపై ఆరు రెట్లు ఎక్కువ ఎత్తుకు దూకగలరు అని NASA తెలియజేసింది. అలాగే, చంద్రుడు లేకపోతే, భూమి చాలా భిన్నమైన ప్రపంచం అవుతుంది. చంద్రుని గురుత్వాకర్షణ మన గ్రహం దాని అక్షం మీద ఎక్కువగా కదలకుండా చేస్తుంది, ఇది మన వాతావరణాన్ని స్థిరీకరించడానికి సహాయపడుతుంది. భూమిపై ఉన్న మహాసముద్రాలలో ఆటుపోట్లు సృష్టించడంలో చంద్రుడు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు.(NASA)
చంద్రునిపై నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ , ఎడ్విన్ బజ్ ఆల్డ్రిన్ వంటివారు చంద్రునిపై నడిచిన 12 మంది మానవుల్లో మొదటివారు. మూన్‌వాకర్‌లలో నలుగురు ఇప్పటికీ సజీవంగా ఉన్నారు. వారు అమెరికాకు చెందిన ఆల్డ్రిన్ (అపోలో 11), డేవిడ్ స్కాట్ (అపోలో 15), చార్లెస్ డ్యూక్ (అపోలో 16), హారిసన్ ష్మిట్ (అపోలో 17). మొత్తం మీద1968 - 1972 మధ్య 24 మంది అమెరికన్ వ్యోమగాములు భూమి నుండి చంద్రునికి యాత్ర చేసారు. ముగ్గురు వ్యోమగాములు భూమి నుండి చంద్రునికి రెండుసార్లు ప్రయాణించారు. వారు జేమ్స్ లోవెల్ (అపోలో 8, అపోలో 13), జాన్ యంగ్ (అపోలో 10 , అపోలో 16) అలాగే జీన్ సెర్నాన్ (అపోలో 10 , అపోలో 17)
(5 / 6)
చంద్రునిపై నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ , ఎడ్విన్ బజ్ ఆల్డ్రిన్ వంటివారు చంద్రునిపై నడిచిన 12 మంది మానవుల్లో మొదటివారు. మూన్‌వాకర్‌లలో నలుగురు ఇప్పటికీ సజీవంగా ఉన్నారు. వారు అమెరికాకు చెందిన ఆల్డ్రిన్ (అపోలో 11), డేవిడ్ స్కాట్ (అపోలో 15), చార్లెస్ డ్యూక్ (అపోలో 16), హారిసన్ ష్మిట్ (అపోలో 17). మొత్తం మీద1968 - 1972 మధ్య 24 మంది అమెరికన్ వ్యోమగాములు భూమి నుండి చంద్రునికి యాత్ర చేసారు. ముగ్గురు వ్యోమగాములు భూమి నుండి చంద్రునికి రెండుసార్లు ప్రయాణించారు. వారు జేమ్స్ లోవెల్ (అపోలో 8, అపోలో 13), జాన్ యంగ్ (అపోలో 10 , అపోలో 16) అలాగే జీన్ సెర్నాన్ (అపోలో 10 , అపోలో 17)(NASA)

    ఆర్టికల్ షేర్ చేయండి

This asteroid is worth $10,000 Quadrillion

This asteroid is worth $10,000 Quadrillion

Aug 08, 2022, 06:35 PM
Earth From Space | భూమిపై ఉన్న ఈ 7 అద్భుత ప్రదేశాలను అంతరిక్షం నుంచి చూస్తే?

Earth From Space | భూమిపై ఉన్న ఈ 7 అద్భుత ప్రదేశాలను అంతరిక్షం నుంచి చూస్తే?

Jul 19, 2022, 04:39 PM
Asteroid threat | ఆ ఆస్ట‌రాయిడ్స్‌తో భూమికి ముప్పుందా?

Asteroid threat | ఆ ఆస్ట‌రాయిడ్స్‌తో భూమికి ముప్పుందా?

Aug 12, 2022, 04:43 PM
భూమి మీదకు పడిపోతున్న ఉపగ్రహాలు.. కారణం తెలిసి శాస్త్రవేత్తలే షాక్​!

భూమి మీదకు పడిపోతున్న ఉపగ్రహాలు.. కారణం తెలిసి శాస్త్రవేత్తలే షాక్​!

Jul 03, 2022, 03:35 PM
sun explosion | సూర్యుడిపై భారీ పేలుడు.. భూమిపై రేడియో బ్లాకౌట్స్‌

sun explosion | సూర్యుడిపై భారీ పేలుడు.. భూమిపై రేడియో బ్లాకౌట్స్‌

Jun 14, 2022, 05:14 PM
భూమివైపు దూసుకొస్తున్న భారీ గ్రహశకలం- బుల్లెట్​ కంటే 20రెట్ల వేగం..!

భూమివైపు దూసుకొస్తున్న భారీ గ్రహశకలం- బుల్లెట్​ కంటే 20రెట్ల వేగం..!

May 23, 2022, 05:00 PM
Mission Earth 2.0 | భూమి వంటి మ‌రో గ్ర‌హం కోసం `మిష‌న్ ఎర్త్ 2.0`

Mission Earth 2.0 | భూమి వంటి మ‌రో గ్ర‌హం కోసం `మిష‌న్ ఎర్త్ 2.0`

Apr 13, 2022, 07:55 PM