భూమి మీదకు పడిపోతున్న ఉపగ్రహాలు.. కారణం తెలిసి శాస్త్రవేత్తలే షాక్!
03 July 2022, 15:35 IST
- Satellites falling back on Earth : ఉపగ్రహాలు భూమి మీదకు పడిపోతున్నాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సోలార్ ఫ్లేర్స్ కారణం అంటున్నారు.
భూమి మీదకు పడిపోతున్న ఉపగ్రహాలు.. కారణం తెలిసి శాస్త్రవేత్తలే షాక్!
Satellites falling back on Earth : ఎన్నో వింతల నిలయం మన సౌర కుటుంబం. కొన్ని చాలా అద్భుతంగా ఉంటాయి. మరి కొన్ని అంతే ప్రమాదకరంగా ఉంటాయి. శాస్త్రవేత్తలు చెబుతున్న ‘సోలార్ ఫ్లేర్స్’ వీటిల్లో ఒకటి. ఈ సోలార్ ఫ్లేర్స్ వల్ల ఉపగ్రహాలు.. భూమి మీదకు పడిపోతున్నాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సోలార్ ఫ్లేర్ అంటే ఏంటి?
సూర్యుడి వాతావరణంలో సంభవించే పేలుళ్ల నుంచి ఉద్భవించిన ఎలక్ట్రోమేగ్నెటిక్ రేడియేషన్సే ఈ సోలార్ ఫ్లేర్. మన సౌర కుటుంబంలో అత్యంత భారీ పెలుళ్లుగా వీటిని పరిగణిస్తుంటారు. ఈ పేలుళ్లు ఒక్క నిమిషం నుంచి గంటల వ్యవధి వరకు జరగవచ్చు.
శాస్త్రవేత్తల ప్రకారం.. సూర్యుడిలోని అయస్కాంత క్షేత్రాలు ప్రతి 11ఏళ్లకు ఒకసారి కుదుపునకు గురవుతూ ఉంటాయి. అప్పుడు దక్షిణ ధ్రువం- ఉత్తర ధ్రువం మారిపోతుంటాయి. ఈ ప్రక్రియ సెటిల్ అయ్యేందుకు కొంత సమయం పడుతుంది. అప్పటి వరకు సూర్యుడి వాతావరణంలో తీవ్ర అలజడులు నెలకొంటాయి.
ఎంత ప్రమాదకరం?
సూర్యుడి నుంచి వెలువడే ఈ రేడియేషన్లతో కూడిన సోలార్ ఫ్లేర్స్.. కొన్నికొన్ని సార్లు అంతరిక్షంలో చాలా దూరం ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఇవి భూమిని తాకే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే.. ఈ సోలార్ ఫ్లేర్స్ను అడ్డుకునే సామర్థ్యం భూమి వాతావరణానికి ఉంది.
కానీ టెక్నాలజీపై ఈ సోలార్ ఫ్లేర్స్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రేడియో బ్లాక్అవుట్స్, ఇంటర్నెట్, మొబైల్ ఫోన్స్, నేవిగేషన్ వంటి శాటిలైట్ కమ్యూనికేషన్లు దెబ్బతినొచ్చు.
అయితే.. ప్రస్తుతం ఈ సోలార్ ఫ్లేర్స్ వల్ల ఉపగ్రహాలు దెబ్బతింటుండటం ఇప్పుడు ఆందోళకరంగా మారింది.
భూమి అయస్కాంత క్షేత్రాన్ని పరిశీలించే స్వార్మ్ కాన్స్టెలేషన్(మూడు ఉపగ్రహాల కలయిక).. నెమ్మదిగా భూమి మీదకు పడిపోతోందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. '5-6ఏళ్లల్లో.. ఏడాదికి 1.5మైళ్ల మేర కిందకు దిగిపోయింది,' అని శాస్త్రవేత్తలు చెప్పారు.
అయితే ఈ పూర్తి వ్యవహారాన్ని శాస్త్రవేత్తలు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఉపగ్రహాలపై సోలార్ ఫేర్స్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందని వారికి అర్థంకావడం లేదు!