ఆకాశంలో అద్భుతం.. ఒకే వరుసలో ఐదు గ్రహాలు..!
Planet alignment 2022 : బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉండే ఐదు గ్రహాలు.. ఆకాశంలో ఒకే వరుసలో దర్శనమిచ్చాయి. ఇలా జరగడం 18ఏళ్లల్లో ఇదే తొలిసారి.
Planet alignment 2022 : ఆకాశంలో అద్భుతం ఆవిష్క్రతమైంది! బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉండే ఐదు గ్రహాలు.. ఒకే వరుసలో కనిపించాయి. ఆకాశంలో ఈ వింత చోటుచేసుకోవడం.. 18ఏళ్లల్లో ఇదే తొలిసారి. మరో 18ఏళ్ల వరకు ఇది కనిపించదు.
మెర్క్యూరీ, మార్స్, వీనస్, సాటర్న్ గ్రహాలు.. ఇటీవలే భూమి మీద ఉన్న ఆకాశంలో కనిపించాయి. వాటి ఆర్బిట్లోనే, సూర్యుడి చుట్టూ తిరుగుతున్న క్రమంలో ఒకే వరుసలోకి వచ్చి చేరాయి. చంద్రుడు కూడా వాటి పక్కకు చేరడంతో ఈ దృశ్యం మరింత ప్రత్యేకంగా నిలిచిపోయింది.
జూన్ 26 తెల్లవారుజామున.. ఇటలీలోని రోమ్ నగరంలో ఈ అద్భుతం ఆవిష్క్రతమైంది. సూర్యోదయానికి 45-90 నిమిషాల ముందు దీనిని చూడగలిగారు. వాస్తవానికి ఈ కలయిక జూన్ 10నే మొదలైంది. సూర్యోదయానికి ముందు నుంచి మెర్క్యూరీ కనిపించడం మొదలుపెట్టింది.
Planet alignment : ఇలా సూర్యుడి చుట్టు తిరుగుతూ, ఐదు గ్రహాలు ఒకే వరుసలో కనిపించడం చాలా అరుదు! చివరిగా.. 2004 డిసెంబర్లో ఇలా జరిగింది. శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం 2040 వరకు మళ్లీ ఇలా జరగకపోవచ్చు.
సంబంధిత కథనం