Asteroid threat | ఆ ఆస్ట‌రాయిడ్స్‌తో భూమికి ముప్పుందా?-asteroid to come dangerously close to earth today nasa on its impact ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Asteroid Threat | ఆ ఆస్ట‌రాయిడ్స్‌తో భూమికి ముప్పుందా?

Asteroid threat | ఆ ఆస్ట‌రాయిడ్స్‌తో భూమికి ముప్పుందా?

Livemint HT Telugu
Aug 12, 2022 04:43 PM IST

భూమికి ఆస్ట‌రాయిడ్స్ నుంచి ముప్పు ముంచుకువ‌స్తోందా? అంటే అవుననే అంటోంది అమెరికా అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ‌ నాసా. వ‌చ్చే ఐదు రోజుల్లో క‌నీసం ఐదు గ్ర‌హ శ‌క‌లాలు భూమి వైపు దూసుకురానున్నాయ‌ని హెచ్చ‌రించింది.

ప్ర‌తీకాత్మ‌క చిత్రం
ప్ర‌తీకాత్మ‌క చిత్రం

అంత‌రిక్షంలో గ్ర‌హ శ‌క‌లాల ప్ర‌యాణం సాధార‌ణ‌మే. భూమి వైపున‌కు కొన్ని శ‌క‌లాలు దూసుకురావ‌డం కూడా స‌హ‌జ‌మే. అరుదైన సంద‌ర్భాల్లో మాత్ర‌మే అవి భూమిని ఢీ కొన్నాయి. చిన్న ప‌రిమాణంలో ఉన్న శ‌క‌లాలు భూవాతావ‌ర‌ణంలోనే అంత‌మ‌వుతాయి.

Asteroid threat | విమానం సైజులో..

రానున్న ఐదు రోజుల్లో భూమి వైపు వ‌స్తున్న ఐదు గ్ర‌హ శ‌క‌లాల్లో మూడు భారీ ప‌రిమాణంలో ఉన్నాయి. అవి దాదాపు పెద్ద సైజు విమానం అంత ఉన్నాయ‌ని నాసా వెల్ల‌డించింది. వీటిలో అతి పెద్ద గ్ర‌హ శ‌క‌లానికి 2022 OT1 అని పేరు పెట్టారు. ఇది 110 అడుగుల వెడల్పు ఉంది. ఇది ఆగ‌స్ట్ 14 ఆదివారం తెల్ల‌వారుజామున సెక‌నుకు 5.7కిమీల వేగంతో భూమి నుంచి 4.7 మిలియ‌న్ కిమీల దూరం నుంచి దూసుకువెళ్ల‌నుంది. ఒక‌వేళ ఈ గ్ర‌హ శ‌క‌లం భూమిని ఢీ కొంటే ఫ్రాన్స్ రాజ‌ధాని పారిస్ న‌గ‌ర‌మంత పెద్ద గొయ్యి ఏర్ప‌డుతుంది. అయితే, ఈ గ్ర‌హ శ‌క‌లాల వ‌ల్ల భూమికి త‌క్ష‌ణ‌మే వ‌చ్చే ముప్పేమీ లేద‌ని నాసా తెలిపింది.

Asteroid threat | మ‌రో శ‌క‌లం

భూమి కి ద‌గ్గ‌ర‌గా వ‌చ్చే మ‌రో గ్ర‌హ శ‌క‌లం 2022 PK1. ఇది దాదాపు 100 అడుగుల వెడల్పు ఉంది. ఇది భూమి నుంచి 5.2 కిమీల దూరంలో ఉండ‌గా మ‌న గ్ర‌హాన్ని దాట‌నుంది. మిగ‌తా గ్ర‌హ శ‌క‌లాల్లో.. 2015 FF 53 అడుగులు, 2022 OA4 71 అడుగులు, 2022 PW 93 అడుగుల వెడ‌ల్పు ఉన్నాయి. వీటిలో 2022 PW ఆగ‌స్ట్ 16న‌, 2015 FF ఆగ‌స్ట్ 12న భూ గ్ర‌హాన్ని దాటేయ‌నున్నాయి.

Asteroid threat | NASA ఆస్టరాయిడ్ వాచ్

NASA ఆస్టరాయిడ్ వాచ్ మన గ్రహం నుండి 7.5 మిలియన్ కిలోమీటర్ల లోపు వచ్చే గ్రహశకలాలు మరియు తోకచుక్కలను ట్రాక్ చేస్తుంది, ఇది భూమి మరియు చంద్రుని మధ్య దూరం కంటే 19.5 రెట్లు ఎక్కువ. 150 మీటర్ల కంటే పెద్దగా ఉన్న ఏ వస్తువైనా.. భూమి నుంచి 7.5 మిలియ‌న్ కిమీ లోపు దూరం వ‌ర‌కు వ‌స్తే ప్ర‌మాద‌క‌రంగా భావిస్తారు. ఎందుకంటే, ఆ దూరంలోపు ఆ ప‌రిమాణంలో ఉన్న వ‌స్తువుపై భూ గురుత్వాక‌ర్ష‌ణ శ‌క్తి ప‌నిచేస్తుంది. ఆ వ‌స్తువును భూమి ఆక‌ర్షిస్తే అత్యంత దారుణ ప‌రిణామాలు సంభ‌విస్తాయి.

IPL_Entry_Point