భూమి మీదకు పడిపోతున్న ఉపగ్రహాలు.. కారణం తెలిసి శాస్త్రవేత్తలే షాక్​!-satellites falling back on earth due to solar flares how dangerous they can be ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Satellites Falling Back On Earth Due To Solar Flares. How Dangerous They Can Be?

భూమి మీదకు పడిపోతున్న ఉపగ్రహాలు.. కారణం తెలిసి శాస్త్రవేత్తలే షాక్​!

Sharath Chitturi HT Telugu
Jul 03, 2022 03:35 PM IST

Satellites falling back on Earth : ఉపగ్రహాలు భూమి మీదకు పడిపోతున్నాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సోలార్​ ఫ్లేర్స్​ కారణం అంటున్నారు.

భూమి మీదకు పడిపోతున్న ఉపగ్రహాలు.. కారణం తెలిసి శాస్త్రవేత్తలే షాక్​!
భూమి మీదకు పడిపోతున్న ఉపగ్రహాలు.. కారణం తెలిసి శాస్త్రవేత్తలే షాక్​!

Satellites falling back on Earth : ఎన్నో వింతల నిలయం మన సౌర కుటుంబం. కొన్ని చాలా అద్భుతంగా ఉంటాయి. మరి కొన్ని అంతే ప్రమాదకరంగా ఉంటాయి. శాస్త్రవేత్తలు చెబుతున్న ‘సోలార్​ ఫ్లేర్స్​’ వీటిల్లో ఒకటి. ఈ సోలార్​ ఫ్లేర్స్​ వల్ల ఉపగ్రహాలు.. భూమి మీదకు పడిపోతున్నాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

సోలార్​ ఫ్లేర్​ అంటే ఏంటి?

సూర్యుడి వాతావరణంలో సంభవించే పేలుళ్ల నుంచి ఉద్భవించిన ఎలక్ట్రోమేగ్నెటిక్​ రేడియేషన్సే ఈ సోలార్​ ఫ్లేర్​. మన సౌర కుటుంబంలో అత్యంత భారీ పెలుళ్లుగా వీటిని పరిగణిస్తుంటారు. ఈ పేలుళ్లు ఒక్క నిమిషం నుంచి గంటల వ్యవధి వరకు జరగవచ్చు.

శాస్త్రవేత్తల ప్రకారం.. సూర్యుడిలోని అయస్కాంత క్షేత్రాలు ప్రతి 11ఏళ్లకు ఒకసారి కుదుపునకు గురవుతూ ఉంటాయి. అప్పుడు దక్షిణ ధ్రువం- ఉత్తర ధ్రువం మారిపోతుంటాయి. ఈ ప్రక్రియ సెటిల్​ అయ్యేందుకు కొంత సమయం పడుతుంది. అప్పటి వరకు సూర్యుడి వాతావరణంలో తీవ్ర అలజడులు నెలకొంటాయి.

ఎంత ప్రమాదకరం?

సూర్యుడి నుంచి వెలువడే ఈ రేడియేషన్లతో కూడిన సోలార్​ ఫ్లేర్స్​.. కొన్నికొన్ని సార్లు అంతరిక్షంలో చాలా దూరం ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఇవి భూమిని తాకే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే.. ఈ సోలార్​ ఫ్లేర్స్​ను అడ్డుకునే సామర్థ్యం భూమి వాతావరణానికి ఉంది.

కానీ టెక్నాలజీపై ఈ సోలార్​ ఫ్లేర్స్​ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రేడియో బ్లాక్​అవుట్స్​, ఇంటర్నెట్​, మొబైల్​ ఫోన్స్​, నేవిగేషన్​ వంటి శాటిలైట్​ కమ్యూనికేషన్లు దెబ్బతినొచ్చు.

అయితే.. ప్రస్తుతం ఈ సోలార్​ ఫ్లేర్స్​ వల్ల ఉపగ్రహాలు దెబ్బతింటుండటం ఇప్పుడు ఆందోళకరంగా మారింది.

భూమి అయస్కాంత క్షేత్రాన్ని పరిశీలించే స్వార్మ్​ కాన్స్​టెలేషన్​(మూడు ఉపగ్రహాల కలయిక).. నెమ్మదిగా భూమి మీదకు పడిపోతోందని యూరోపియన్​ స్పేస్​ ఏజెన్సీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. '5-6ఏళ్లల్లో.. ఏడాదికి 1.5మైళ్ల మేర కిందకు దిగిపోయింది,' అని శాస్త్రవేత్తలు చెప్పారు.

అయితే ఈ పూర్తి వ్యవహారాన్ని శాస్త్రవేత్తలు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఉపగ్రహాలపై సోలార్​ ఫేర్స్​ ఎఫెక్ట్​ ఎలా ఉంటుందని వారికి అర్థంకావడం లేదు!

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్