తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sun Explosion | సూర్యుడిపై భారీ పేలుడు.. భూమిపై రేడియో బ్లాకౌట్స్‌

sun explosion | సూర్యుడిపై భారీ పేలుడు.. భూమిపై రేడియో బ్లాకౌట్స్‌

HT Telugu Desk HT Telugu

14 June 2022, 17:14 IST

  • అగ్నిగోళం సూర్యుడిపై అత్యంత భారీ పేలుడు సంభ‌వించింది. దాదాపు 8 గంట‌ల పాటు అది కొన‌సాగింది. సూర్య‌డి ఉప‌రిత‌లంపై పేలుళ్లు సాధార‌ణ‌మే కానీ, ఇంత సుదీర్ఘ స‌మ‌యం ఈ పేలుడు కొన‌సాగ‌డం అరుదు అని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.

ప్ర‌తీకాత్మ‌క చిత్రం
ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

సూర్యుడిపై ఈ భారీ పేలుడు కార‌ణంగా జ‌పాన్‌, ఆగ్నేయ ఆసియా ప్రాంత దేశాల్లో రేడియో బ్లాకౌట్ కు అవ‌కాశం ఉంది. సూర్యుడిపై ఈ పేలుడుతో వెలువ‌డే శ‌క్తి వ‌ల్ల ఉప‌గ్ర‌హ సేవ‌ల‌కు కూడా కొంత‌వ‌ర‌కు అంత‌రాయం క‌లిగే ప్ర‌మాద‌ముంది.

ట్రెండింగ్ వార్తలు

Crime news: స్కూల్ లో బాలికపై అత్యాచారం; దారుణం చేసింది స్కూల్ ఓనరే; అతడికి సహకరించిన ఏఎస్సై

UPSC CDS 2: కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదల చేసిన యూపీఎస్సీ

UK Graduate Visa: హైయర్ స్టడీస్ కు యూకే వెళ్లే స్టుడెంట్స్ కు గుడ్ న్యూస్; గ్రాడ్యుయేట్ వీసాపై కీలక అప్ డేట్

Rajasthan: రాజస్థాన్ గనిలో కుప్పకూలిన లిఫ్ట్; మైన్ లో ఇరుక్కుపోయిన 15 మంది అధికారులు

`ఏఆర్‌3032`

సూర్యుడి ఉప‌రిత‌లంపై భూమి వైపు ఉన్న స‌న్‌స్పాట్ `ఏఆర్‌3032` వ‌ద్ద భారీ పేలుడు సంభ‌వించిందని శాస్త్ర‌వేత్త‌లు వెల్ల‌డించారు. ఇటీవ‌లి కాలంలో ఈ స్పాట్ చాలా యాక్టివ్ అయింది. ఈ `ఏఆర్‌3032` పేలుడుతో ఎం 3 క్లాస్ మంట‌లు ఎగిసిప‌డ్డాయని, ఇవి అసాధార‌ణంగా దాదాపు 8 గంట‌ల పాటు కొన‌సాగాయ‌ని వివ‌రించారు. ఈ అసాధార‌ణ ఘ‌ట‌న‌ను అంత‌రిక్షంలోని రెండు స్పేస్‌క్రాఫ్ట్స్ రికార్డు చేశాయ‌న్నారు.

యూవీ రేడియేష‌న్‌

ఈ పేలుడు కార‌ణంగా సూర్యుడి నుంచి అత్యంత తీవ్ర‌మైన అల్ట్రా వ‌యెలెట్ రేడియేష‌న్ ఉత్ప‌త్తి అవుతుంది. ఇది భూ ఉప‌రిత‌లం వైపు ప్ర‌స‌రిస్తుంది. దీనివ‌ల్ల జ‌పాన్‌, ఆగ్నేయాసియా దేశాల్లో రేడియో త‌రంగాల్లో అంత‌రాయం క‌లిగిస్తుంది. ఈ ప్రాంతాల్లోని రేడియో ఆప‌రేట‌ర్లు 30 మెగాహెర్ట్జ్స్ ఫ్రీక్వెన్సీ లోప‌ల‌ ఈ మార్పును గుర్తించ‌గ‌ల‌ర‌ని స్పేస్‌వెద‌ర్ డాట్ కామ్‌(spaceweather.com) వెల్ల‌డించింది. ఈ పేలుడుతో జ‌రిగిన `కొరొన‌ల్ మాస్ ఎజెక్ష‌న్‌(సీఎంఈ)`ను `సోలార్ అండ్ హీలియోస్ఫీరిక్ అబ్జ‌ర్వేట‌రీ(ఎస్ఓహెచ్ఓ)` రికార్డ్ చేయ‌గ‌లిగింది. ఈ సీఎంఈ`తో గంట‌కు కొన్ని ల‌క్ష‌ల కిమీల వేగంతో సూర్యుడి నుంచి భారీ ఎత్తున‌ ప్లాస్మా అంత‌రిక్షంలోకి వెద‌జ‌ల్ల‌బ‌డుతుంది. ఎస్ఓహెచ్ఓతో పాటు సోలార్ డైన‌మిక్స్ అబ్జ‌ర్వేట‌రీ(ఎస్‌డీఓ) కూడా సూర్యుడి ఉప‌రితంపై చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న‌ను క్యాప్చ‌ర్ చేసింది. ఎస్‌డీఓ 2010 నుంచి సూర్యుడి ఉప‌రిత‌లంపై ఘ‌ట‌న‌ల‌ను ప‌రిశీలిస్తోంది.

వారంలో భూమికి ద‌గ్గ‌ర‌గా..

సూర్యుడి నుంచి దూసుకొస్తున్న ఈ ప్లాస్మా వారం రోజుల్లో భూమికి ద‌గ్గ‌ర‌గా రావ‌చ్చ‌ని అమెరికాకు చెందిన National Oceanic and Atmospheric Administration (NOAA) వెల్ల‌డించింది. భూమిపై ఉన్న అయిస్కాంత క్షేత్రంపై దీని ప్ర‌భావం క‌నిపిస్తుంద‌ని హెచ్చ‌రించింది. సూర్యుడిపై జ‌రిగిన భారీ పేలుడుతో వెలువ‌డిన ఈ `కొరొన‌ల్ మాస్ ఎజెక్ష‌న్(coronal mass ejection)ను తాము కూడా గుర్తించామ‌ని భార‌త్‌కు చెందిన సెంట‌ర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ స్పేస్ సైన్సెస్ నిర్ధారించింది. దీని ప్ర‌భావంతో వారం రోజుల్లో భూ ఉప‌రిత‌లంపై రేడియో బ్లాకౌట్స్‌కు, జియో మాగ్నెటిక్ స్టార్మ్స్‌కు అవ‌కాశముంద‌ని హెచ్చ‌రించింది.

టాపిక్

తదుపరి వ్యాసం