తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Nasa Webb | అంతరిక్షంలోని అద్భుత దృశ్యం, కళ్లముందు ప్రత్యక్షం- ఈ వీడియో చూడండి!

NASA Webb | అంతరిక్షంలోని అద్భుత దృశ్యం, కళ్లముందు ప్రత్యక్షం- ఈ వీడియో చూడండి!

13 July 2022, 15:07 IST

US స్పేస్ ఏజెన్సీ NASA తమ శక్తివంతమైన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా క్యాప్చర్ చేసిన చిత్రాలను విడుదల చేసింది. అంతరిక్షంలోని అద్భుత దృశ్యాలను ఆ టెలిస్కోప్ ఆవిష్కరించింది. తళుకు బెళుకులతో కాంతులీనుతున్న బేబీ స్టార్‌లు, కాలం చెల్లిన నక్షత్రం నుంచి నీలం రంగులో వెదజల్లిన నురుగులాంటి ప్రకాశవంతమైన కాంతి, చిమ్మచీకటిలో నారింజ రంగు కాంతి దృశ్యం, అంతరిక్షంలో నృత్యమాడుతున్నట్లుగా ఉన్న ఐదు గెలాక్సీలు మొదలైనవి వీక్షకులను అబ్బురపరుస్తున్నాయి. ముఖ్యంగా భూమి నుంచి 1,150 కాంతి సంవత్సరాల దూరంలో, చనిపోతున్న ఓ భారీ నక్షత్రం చుట్టూ ఆవరించిన విస్తారమైన వాయువు దృశ్యం అద్భుతంగా కనిపిస్తుంది. మనిషి కంటికి కనిపించని ఇన్‌ఫ్రారెడ్ పౌనఃపున్యాలను స్కాన్ చేసే ఈ టెలిస్కోప్ నుంచి మరింత సమాచారాన్ని సేకరించాలని శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. మరిన్ని అద్భుత దృశ్యాలను ఈ వీడియోలో చూడండి.