తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Katchatheevu Island : ఎన్నికల వేళ 'కచ్చతివు' దుమారం- అసలేంటి వివాదం? కాంగ్రెస్​ మళ్లీ దొరికిపోయిందా?

katchatheevu island : ఎన్నికల వేళ 'కచ్చతివు' దుమారం- అసలేంటి వివాదం? కాంగ్రెస్​ మళ్లీ దొరికిపోయిందా?

Sharath Chitturi HT Telugu

31 March 2024, 14:53 IST

    • katchatheevu island row : ‘కచ్చతివు’ ద్వీపం వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. లోక్​సభ ఎన్నికలకు ముందు.. ఈ వ్యవహారం కాంగ్రెస్​కు తలనొప్పిగా మారే అవకాశం ఉంది.
ఎన్నికల వేళ 'కచ్చతివు' దుమారం
ఎన్నికల వేళ 'కచ్చతివు' దుమారం

ఎన్నికల వేళ 'కచ్చతివు' దుమారం

Katchatheevu island controversy explained : 2024 లోక్​సభ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో.. కాంగ్రెస్​ పార్టీపై మరో 'పిడుగు'! ‘కచ్చతివు ద్వీపం’ వివాదాన్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భారత దేశాన్ని విడదీసి, భారత్​లో ఒక భాగమైన ద్వీపాన్ని.. కాంగ్రెస్​ ప్రభుత్వం.. శ్రీలంకకు ఇచ్చేసిందని ఆరోపించారు. ఫలితంగా.. ఈ కచ్చతివు వివాదం మళ్లీ వార్తలకెక్కింది. ఈ నేపథ్యంలో.. అసలేంటి ఈ వివాదం? అన్న ప్రశ్నలకు సమాధానం ఇక్కడ తెలుసుకుందాము..

ట్రెండింగ్ వార్తలు

Protein supplements ICMR : ప్రోటీన్​ సప్లిమెంట్స్​ వాడొద్దని ఐసీఎంఆర్​ ఎందుకు చెప్పింది?​

UPSC NDA NA results 2024: ఎన్డీఏ, ఎన్ఏ 2024 ఫలితాలను విడుదల చేసిన యూపీఎస్సీ

Kedarnath Dham yatra 2024: రేపటి నుంచి కేదార్ నాథ్ ధామ్ యాత్ర ప్రారంభం; రిజిస్టర్ చేసుకోకుండా వెళ్లొచ్చా?

karnataka sslc result 2024: 10వ తరగతి ఫలితాలను డైరెక్ట్ లింక్ ద్వారా తెలుసుకోండి

అసలేంటి ఈ కచ్చతివు వివాదం?

తమిళనాడు రామేశ్వరం- శ్రీలంకకు మధ్యలో ఉన్న ఓ చిన్న ద్వీపం.. ఈ కచ్చతివు. ఇది 285 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. తమిళనాడు నుంచి కేవలం 25కి.మీల దూరంలోనే ఉంటుంది ఈ ద్వీపం. దీనిపై చాలా సంవత్సరాలుగా వివాదం ఉన్నప్పటికీ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఆదివారం చేసిన ఓ ట్వీట్​తో ఇప్పుడు ఈ కచ్చతివు వ్యవహారం హాట్​ టాపిక్​గా మారింది.

"ఆశ్చర్యకరమైన విషయం! కచ్చతివును కాంగ్రెస్​.. శ్రీలంకకు ఇచ్చేసిందని కొత్త ఆధారాలు బయటకు వచ్చాయి. ఇది భారతీయులను ఆగ్రహానికి గురి చేస్తోంది. కాంగ్రెస్​ను నమ్మలేమని ప్రజల్లో ఉన్న ఆలోచనలు మళ్లీ నిరూపితమయ్యాయి," అని ట్వీట్​ చేశారు ప్రధాని మోదీ.

Katchatheevu island : "భారత దేశ ఐకమత్యం, సమగ్రత, ప్రయోజనాలను 75ఏఏళ్లుగా కాంగ్రెస్​ పార్టీ బలహీనపరుస్తూ వస్తోంది," అని మోదీ అన్నారు.

భారత తొలి ప్రధాని జవహర్​లాల్​ నెహ్రూ హయాంలోనూ.. ఈ కచ్చతివు వివాదం కొనసాగింది. అయితే.. 'ఇంత చిన్న విషయాన్ని మాటిమాటికి ప్రస్తవించకండి. అవసరమైతే కచ్చతివును వదులుకోవడానికి సిద్ధం' అని నెహ్రూ అన్నట్టు.. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమళై వ్యాఖ్యానించారు. ఆర్​టీఐ ద్వారా తాను సంపాదించిన రెండు డాక్యుమెంట్స్​లో నెహ్రూ ఈ మెరకు వ్యాఖ్యానించినట్టు ఉందని పేర్కొన్నారు.

కానీ.. కచ్చతివు అనే ప్రాంతం.. భారత్​లో ఒక భాగమని నిరూపించేందుకు అనేక ఆధారాలు ఉన్నట్టు, అప్పటి అటార్నీ జనరల్​ వాదించారు. ఈ విషయం కూడా.. అన్నమళై పొందిన డాక్యుమెంట్స్​లో ఉంది.

కాగా.. 1974లో ఈ కచ్చతివు ద్వీపాన్ని భారత్​.. నిజంగానే శ్రీలంకకు ఇచ్చేసింది! ఈ మేరకు.. కచ్చితువు శ్రీలంకకు చెందినది అని ఇందిరా గాంధీ నేతృత్వంలోని ప్రభుత్వం గుర్తించింది. ఇదే విషయంపై.. 1974 జూన్​ 26న శ్రీలంకలో, రెండు రోజుల తర్వాత.. జూన్​ 28న దిల్లీలో సంబంధిత ఒప్పందాలపై సంతకాలు చేశారు.

Katchatheevu island controversy : ఈ కచ్చతివులో చేపలు పట్టేందుకు చాలా మంది తమిళులు వెళుతూ ఉంటారు. కానీ ఇప్పుడది చాలా కష్టంగా మారింది. ఇంటర్నేషనల్​ మేరిటైమ్​ బౌండరీ లైన్​కి అవతల ఉన్న ఈ ప్రాంతానికి వెళుతుంటే.. శ్రీలంక అధికారులు మత్స్యకారులను అరెస్ట్​ చేస్తున్నారు. కచ్చితివును శ్రీలంకలో భాగంగా భారత్​ గుర్తించడం.. చాలా మంది తమిళులకు ఇష్టం లేదు.

కచ్చతివులో సెయింట్​ ఆంటోని ఆలయం ఉంటుంది. ప్రతియేటా అక్కడ ఉత్సవాలు జరుగుతాయి. 1974లో జరిగిన ఒప్పందం ప్రకారం.. భారత మత్స్యకారులు ఉత్సవంలో పాల్గొనవచ్చు. అక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు. కానీ వేటకు వెళుతున్న వారకి మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

కాగా.. కచ్చతివుని శ్రీలంకకు ఇచ్చేయడంపై అప్పటి విపక్ష పార్టీలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశాయి. కానీ ఇందిరా గాంధీ ప్రభుత్వం.. వాటిని పట్టించుకోకుండా, శ్రీలంకకు అప్పజెప్పిందని తెలుస్తోంది. శ్రీలంకతో సత్సంబంధాల కోసమే.. అప్పటి భారత ప్రభుత్వం ఇలా చేసిందని వార్తలు వచ్చాయి.