Protein supplements ICMR : ప్రోటీన్ సప్లిమెంట్స్ వాడొద్దని ఐసీఎంఆర్ ఎందుకు చెప్పింది?
10 May 2024, 6:30 IST
ICMR guidelines for food 2024 : ప్రోటీన్ సప్లిమెంట్స్ వాడొద్దని ఐసీఎంఆర్ చెప్పడం ఇప్పుడు చర్చకు దారి తీసింది. అసలు ప్రోటీన్ పౌడర్ వాడొద్దని ఎందుకు చెప్పింది? కారణం ఏంటి?
'ప్రోటీన్ సప్లిమెంట్స్ వాడకండి'
ICMR guidelines for food : ప్రోటీన్‌పై అధికంగా ఫోకస్ చేసి, నిత్యం ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకునే వారికి ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) షాక్ ఇచ్చింది! బాడీ మాస్ కోసం ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకోవద్దని సూచించింది. ఈ మేరకు పలు కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది.
ప్రోటీన్ పౌడర్లు వద్దు..!
గుడ్లు, పాలు, వే, సోయాబీన్-పీస్‌ల నుంచి తయారు చేసే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ పౌడర్స్కు ఈ మధ్య కాలంలో డిమాండ్ పెరుగుతోంది. ఇవి ప్రోటీన్ సప్లిమెంట్స్‌గా మంచి గుర్తింపు పొందుతున్నాయి. కానీ.. ఈ ప్రాడక్ట్స్‌లో యాడెడ్ షుగర్స్, కాలేరిక్ స్విటెనర్స్, ఆర్టిఫీషియల్ ఫ్లేవరింగ్స్ ఉంటున్నాయని, వీటిని రోజు తీసుకుంటే.. ఆరోగ్యానికి హానికరమని ఐసీఎంఆర్ చెప్పింది. ఫలితంగా.. ఇప్పుడు ఈ వ్యవహారం ఫిట్నెస్ ప్రపంచంలో చర్చకు దారితీసింది.
మరీ ముఖ్యంగా.. వే ప్రోటీన్‌కి దూరంగా ఉండాలని ఐసీఎంఆర్ సూచించిది. ఈ వే ప్రోటీన్‌లో బీసీఏఏ(బ్రాంచ్డ్ చెయిన్ అమీనో యాసిడ్స్) పుష్కలంగా ఉంటాయి. ఈ బీసీఏఏని అధికంగా తీసుకుంటే.. ఎన్సీడీ (సంక్రమించని వ్యాధులు) రిస్క్ ఉంటుందని ఐసీఎంఆర్ తెలిపింది. వీటి వినియోగాన్ని తగ్గించాలని పేర్కొంది.
"ప్రోటీన్ సప్లిమెంట్ పౌడర్స్ ద్వారా అధిక మొత్తంలో ప్రోటీన్ తీసుకోవడాన్ని మేము సూచించము," అని ఐసీఎంఆర్ వెల్లడించింది.
Protein supplements ICMR : కండరాల బలంలో ప్రోటీన్ చాలా కీలకం అని ఇప్పటివరకు ఉన్న నమ్మకాన్ని ఐసీఎంఆర్ కొత్త మార్గదర్శకాలు సవాలు చేస్తున్నాయి! రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ ట్రైనింగ్‌తో పాటు కండరాల బలానికి ప్రోటీన్ సప్లిమెంట్స్ పెద్దగా సాయం చేయడం లేదని తమ రీసెర్చ్‌తో తేలినట్టు ఐసీఎంఆర్ స్పష్టం చేసింది.
"రోజుకు 1.6గ్రాములు/కేజీ ప్రోటీన్ తీసుకున్నా.. ఆర్ఈటీ వల్లే వచ్చి మజిల్ మాస్‌పై ఎఫెక్ట్ ఏమీ ఉండదు," అని ఐసీఎంఆర్ వివరించింది.
ప్రోటీన్ సప్లిమెంట్స్‌తో పాటు ఉప్పును తగ్గిచాలని, చక్కెరని కూడా తగ్గించాలని, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ జోలికి వెళ్లొద్దని సూచనలు చేసింది ఐసీఏఎంఆర్. మెరుగైన ఆరోగ్యం కోసం ఫుడ్ ప్యాకెట్స్ వెనుక ఉండే లేబుల్స్ని చదవాలని పేర్కొంది.
ప్రెగ్నెన్సీ, బాలింత సమయంలో ఆహారం అధికంగా తినాలని కూడా తన 17 మార్గదర్శకాల్లో పేర్కొంది. ఆరోగ్యం విషయంలో పెద్దవారు.. పోషకాలతో కూడిన ఆహారాలు కచ్చితంగా తినాలని వివరించింది.
ICMR on Protein supplements : ఐసీఎంఆర్- ఎన్ఐఎన్ డైరెక్టర్ డా. హేమలత ఆర్ నేతృత్వంలోని నిపుణుల కమిటి.. ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది. అనేకమార్లు సైంటిఫిక్ రివ్యూలు జరిపిన తర్వాతే వీటిని విడుదల చేసినట్టు పేర్కొంది.
ఐసీఎంఆర్ విడుల చేసిన 17 మార్గదర్శకాలు..
సమతుల్య ఆహారాన్ని నిర్ధారించడానికి వివిధ రకాల ఆహారాలను తినండి.
గర్భధారణ, పాలిచ్చే సమయంలో అదనపు ఆహారం, ఆరోగ్య సంరక్షణ అవసరం.
మొదటి ఆరు నెలలు ప్రత్యేకమైన తల్లి పాలు ఇవ్వాలి. రెండు సంవత్సరాలు, అంతకు మించి తల్లి పాలివ్వడాన్ని కొనసాగించండి.
ఆరు నెలల వయస్సు వచ్చిన వెంటనే శిశువుకు ఇంట్లో తయారుచేసిన సెమీ-సాలిడ్ కాంప్లిమెంటరీ ఆహారాన్ని తినిపించడం ప్రారంభించండి.
ఆరోగ్యం, అనారోగ్యం రెండింటిలోనూ పిల్లలు, కౌమారదశలో ఉన్నవారికి తగిన ఆహారాన్ని ఇవ్వాలి.
కూరగాయలు, చిక్కుళ్ళు పుష్కలంగా తినండి; నూనెలు / కొవ్వులను మితంగా ఉపయోగించండి; కొవ్వులు మరియు ముఖ్యమైన కొవ్వు ఆమ్లాల (ఇఎఫ్ఎ) రోజువారీ అవసరాలను తీర్చడానికి వివిధ రకాల నూనె గింజలు, కాయలు, న్యూట్రియల్స్, చిక్కుళ్ళు ఎంచుకోండి.
Protein powders ICMR guidelines : తగిన ఆహారాల కలయిక ద్వారా మంచి నాణ్యమైన ప్రోటీన్లు ముఖ్యమైన అమైనో ఆమ్లాలను (ఇఎఎ) పొందండి. మజిల్ మాస్ నిర్మించడానికి ప్రోటీన్ సప్లిమెంట్లను నివారించండి.
శారీరకంగా చురుకుగా ఉండండి. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.
ఉప్పు తీసుకోవడం తగ్గించండి.
సురక్షితమైన, శుభ్రమైన ఆహారాన్ని తీసుకోండి. తగిన ముందస్తు వంట పద్ధతులను అవలంబించండి.
తగినంత పరిమాణంలో నీరు త్రాగాలి.
అధిక కొవ్వు, చక్కెర, ఉప్పు (హెచ్ఎఫ్ఎస్ఎస్), అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ (యుపిఎఫ్) వినియోగాన్ని తగ్గించండి.
ఆరోగ్యం, శ్రేయస్సు కోసం వృద్ధుల ఆహారంలో పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చండి.
ఆరోగ్యకరమైన ఆహార ఎంపిక చేయడానికి ప్రాడక్ట్ లేబుళ్లపై సమాచారాన్ని చదవండి.