Celebrity Couple Pregnancy: ఈ ఏడాది ప్రెగ్నెన్సీ ప్రకటించిన సెలబ్రిటీ కపుల్స్.. దీపిక నుంచి అమలా పాల్ వరకు!-top 5 celebrity couple pregnant in 2024 deepika padukone to amala paul announce their pregnancy ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Top 5 Celebrity Couple Pregnant In 2024 Deepika Padukone To Amala Paul Announce Their Pregnancy

Celebrity Couple Pregnancy: ఈ ఏడాది ప్రెగ్నెన్సీ ప్రకటించిన సెలబ్రిటీ కపుల్స్.. దీపిక నుంచి అమలా పాల్ వరకు!

Mar 01, 2024, 03:49 PM IST Sanjiv Kumar
Mar 01, 2024, 03:49 PM , IST

Celebrity Couple Pregnancy In 2024: ఫిబ్రవరి 29న తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు బాలీవుడ్ సెలబ్రిటీ జంట దీపికా పదుకొణె-రణ్‌వీర్ సింగ్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. వీరిలాగే ఈ ఏడాది తమ ప్రెగ్నెన్సీని ప్రకటించిన సెలబ్రిటీ కపుల్స్ ఎవరో చూద్దాం.

చాలా రోజుల పుకార్ల తర్వాత బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీ జంట రణ్ వీర్. దీపికా పదుకొణె తల్లిదండ్రులు కాబోతున్నట్లు ఫిబ్రవరి 29 గురువారం నాడు ఇన్ స్టా వేదికగా తెలియజేశారు. వారు తమ మొదటి బిడ్డకు సెప్టెంబర్‌లో స్వాగతం పలకనున్నట్లు పోస్ట్ ద్వారా తెలిపారు.  

(1 / 5)

చాలా రోజుల పుకార్ల తర్వాత బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీ జంట రణ్ వీర్. దీపికా పదుకొణె తల్లిదండ్రులు కాబోతున్నట్లు ఫిబ్రవరి 29 గురువారం నాడు ఇన్ స్టా వేదికగా తెలియజేశారు. వారు తమ మొదటి బిడ్డకు సెప్టెంబర్‌లో స్వాగతం పలకనున్నట్లు పోస్ట్ ద్వారా తెలిపారు.  (Instagram)

దక్షిణ భారత చిత్రాలలో బాగా పేరు తెచ్చుకున్న బ్యూటిఫుల్ హీరోయిన్ అమలా పాల్ జనవరిలో తాను, ఆమె భర్త జగత్ దేశాయ్ తమ మొదటి బిడ్డకు స్వాగతం పలుకుతున్నట్లు ప్రకటించారు. బేబీ బంప్ ఫొటోలు షేర్ చేస్తూ "1+1 మీతో 3 అని ఇప్పుడు నాకు తెలుసింది" అని క్యాప్షన్ రాసుకొచ్చింది అమలా పాల్. 

(2 / 5)

దక్షిణ భారత చిత్రాలలో బాగా పేరు తెచ్చుకున్న బ్యూటిఫుల్ హీరోయిన్ అమలా పాల్ జనవరిలో తాను, ఆమె భర్త జగత్ దేశాయ్ తమ మొదటి బిడ్డకు స్వాగతం పలుకుతున్నట్లు ప్రకటించారు. బేబీ బంప్ ఫొటోలు షేర్ చేస్తూ "1+1 మీతో 3 అని ఇప్పుడు నాకు తెలుసింది" అని క్యాప్షన్ రాసుకొచ్చింది అమలా పాల్. (Instagram)

ఇతర సెలబ్రిటీస్‌ల కాకుండా యామీ గౌతమ్, ఆదిత్య ధర్ తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వ్యక్త పరిచలేదు. ఆర్టికల్ 370 సినిమా ట్రైలర్ లాంచ్ వేదికగా తాను తల్లి కాబోతున్నట్లు గుడ్ న్యూస్ చెప్పింది బ్యూటిఫుల్ యామీ గౌతమ్. ఈ ముద్దుగుమ్మ తెలుగులో నువ్విలా, కొరియర్ బాయ్ కల్యాణ్, యుద్ధం, గౌరవం సినిమాల్లో నటించింది.   

(3 / 5)

ఇతర సెలబ్రిటీస్‌ల కాకుండా యామీ గౌతమ్, ఆదిత్య ధర్ తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వ్యక్త పరిచలేదు. ఆర్టికల్ 370 సినిమా ట్రైలర్ లాంచ్ వేదికగా తాను తల్లి కాబోతున్నట్లు గుడ్ న్యూస్ చెప్పింది బ్యూటిఫుల్ యామీ గౌతమ్. ఈ ముద్దుగుమ్మ తెలుగులో నువ్విలా, కొరియర్ బాయ్ కల్యాణ్, యుద్ధం, గౌరవం సినిమాల్లో నటించింది.   (Instagram)

మీర్జాపూర్ సిరీస్‌తో పాపులరైన అలీ ఫజల్, ఇన్‌సైడ్ ఎడ్జ్ సిరీస్‌తో ఫేమస్ అయిన రిచా చద్దా ఫిబ్రవరి 9న తల్లిదండ్రులు కాబోతున్నట్లు ఇన్ స్టా గ్రామ్ వేదికగా ప్రకటించారు. "1 + 1 = 3" అని రాసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. "ఒక చిన్న హృదయ స్పందన మన ప్రపంచంలో అత్యంత పెద్ద శబ్దం కానుంది" అని క్యాప్షన్‌ రాశారు. 

(4 / 5)

మీర్జాపూర్ సిరీస్‌తో పాపులరైన అలీ ఫజల్, ఇన్‌సైడ్ ఎడ్జ్ సిరీస్‌తో ఫేమస్ అయిన రిచా చద్దా ఫిబ్రవరి 9న తల్లిదండ్రులు కాబోతున్నట్లు ఇన్ స్టా గ్రామ్ వేదికగా ప్రకటించారు. "1 + 1 = 3" అని రాసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. "ఒక చిన్న హృదయ స్పందన మన ప్రపంచంలో అత్యంత పెద్ద శబ్దం కానుంది" అని క్యాప్షన్‌ రాశారు. (instagram)

బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్, తన భార్య నటాషా దలాల్ తల్లిదండ్రులు కాబోతున్నట్లు ఫిబ్రవరి 18న సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. తన భార్య బేబీ బంప్‌పై ప్రేమగా ముద్దు పెడుతున్న ఫొటోను షేర్ చేస్తూ ఈ గుడ్ న్యూస్ తెలిపాడు. 

(5 / 5)

బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్, తన భార్య నటాషా దలాల్ తల్లిదండ్రులు కాబోతున్నట్లు ఫిబ్రవరి 18న సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. తన భార్య బేబీ బంప్‌పై ప్రేమగా ముద్దు పెడుతున్న ఫొటోను షేర్ చేస్తూ ఈ గుడ్ న్యూస్ తెలిపాడు. (Instagram)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు